For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీలోని కెఫీన్ మహిళల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది! బీ కేర్ ఫుల్ లేడీస్

|

ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే మీ మెదడును చురుకుగా మార్చే అద్భుతశక్తులు కెఫీన్ కు ఉన్నాయి. కెఫీన్ నిద్రమత్తును వదిలించి, శరీరాన్ని చురుకుపరుస్తుంది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచంలో 90 శాతం ప్రజలు కెఫీన్ ను ఏదో ఒక ఆహార పదార్థ రూపంలో తీసుకుంటున్నారు.

కానీ మీకు ఎక్కువ కెఫీన్ తీసుకుంటే ఆడవారిపై నెగటివ్ ప్రభావం పడుతుందని తెలుసా? ఆడవారికి చెడ్డవార్త,కదా? కెఫీన్ వలన రక్తనాళాలు వెడల్పవుతాయి, దాని వల్ల మీ స్తనాలు వాచినట్లు, నొప్పిగా అన్పిస్తాయని డ్యూక్ యూనివర్శిటీ పరిశోధనలో తెలిపారు.

ఈ పరిశోధనలో స్తనాల్లో నొప్పి ఉన్న 61 శాతం మంది స్త్రీలు కెఫీన్ ను మానేస్తే నొప్పి తగ్గిందని తెలిపారు. స్త్రీలలో కెఫీన్ ప్రభావాలు, మానేస్తే వారి స్పందనలు,మగవారి కన్నా వేరుగా ఉండవచ్చు. ముఖ్యంగా కెఫీన్ హార్మోన్లపై ఎలా ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఈ తేడాలు వస్తాయి. శరీరంలో ఇతర పనులలో కూడా ఈ తేడాలు కన్పించవచ్చు.

ఆడవారిలో కాఫీ దుష్ప్రభావాలు హార్మోన్ల వ్యవస్థ, నాడీ వ్యవస్థ రెండింటిపై ఉంటాయి. అందుకని మీరు కెఫీన్ తీసుకున్న వెంటనే ఆందోళన, కళ్ళు తిరగటం, వికారం లాంటివి అనుభూతి చెందితే, ఆశ్చర్యపోకండి.

1. కెఫీన్ విషప్రభావం

1. కెఫీన్ విషప్రభావం

కెఫీన్ అతిగా తీసుకోవడం వలన వచ్చే లక్షణాలలో ఆందోళన, ప్రశాంతత లేకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు వంటివి ఉంటాయి. కెఫీన్ ఇంకా తీవ్రంగా విషప్రభావాన్ని చూపిస్తే తీవ్ర లక్షణాలైన వేగంగా గుండె కొట్టుకోవడం. గుండె దడ, అధిక రక్తపోటు, కళ్ళుతిరగటం వంటివి కన్పిస్తాయి.

2. స్తనాల్లో వ్యాధి

2. స్తనాల్లో వ్యాధి

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ ఆన్ సైంటిఫిక్ ఎఫైర్స్ ఇంకా నేషనల్ క్యాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ ఒక ప్రకటన లో కెఫీన్ వాడకం , ఫైబ్రోసిస్ట్ బ్రెస్ట్ జబ్బుకి ఏ సంబంధం లేదని చెప్పింది. ఫైబ్రోసిస్టిక్ స్తనాల వ్యాధి క్యాన్సర్ కాదు. ఇది ద్రవపదార్థం నిండిన గుండ్రటి లేదా కోల తిత్తులు/సిస్టులు ఏర్పడటానికి దారితీస్తుంది. ఫైబ్రస్ కణజాలం లాగా ఈ సిస్టులు స్పష్టంగా కన్పిస్తూ స్తనాలలో గడ్డలను పెంచుతాయి.

ఇది ఎలా ఉన్నా కొంతమంది స్త్రీలు మాత్రం కెఫీన్ తీసుకోవడం తగ్గించటం లేదా మానేయటం వలన ఫైబ్రోసిస్టిక్ స్తనాల నొప్పినుంచి ఉపశమనం కలిగిందని చెప్పారు.

3. స్త్రీలలో మానసిక స్థితి మార్పులు

3. స్త్రీలలో మానసిక స్థితి మార్పులు

ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం వలన మానసికంగా దుష్ప్రభావం ఉంటుంది. అది చిన్నగా అయోమయం నుండి తీవ్రమైన సైకోటిక్ లక్షణాల వరకూ ఏదైనా కావచ్చు. కెఫీన్ వలన మానసిక ఆందోళన, స్త్రీలలో భయం లోపాలు పెరుగుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ?

4. కెఫీన్, ఎముకల లోపం

4. కెఫీన్, ఎముకల లోపం

ఒక అధ్యయనంలో మెనోపాజ్ దశ దాటిన తర్వాత కాల్షియం తగ్గటం వలన ఆడవారిలో కెఫీన్ తీసుకోవడం, ఎముకల లవణాల సాంద్రతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరీక్షించారు. మీరు కెఫీన్ మాత్రమే తీసుకుని కాల్షియం అందేలా చూసుకోకపోతే,అది తీవ్రమైన ఎముకల లోపానికి దారితీస్తుంది.

ఎక్కువ కాల్షియం ఉత్పత్తులు కూడా తీసుకుంటూ కెఫీన్ ను కూడా తీసుకునే స్త్రీలలో కాల్షియం తీసుకోవడం మానేసిన స్త్రీలకంటే తక్కువ ఎముకల లోపం ఉంటుంది.

5. అడ్రినల్ అసమతుల్యత

5. అడ్రినల్ అసమతుల్యత

కెఫీన్ తాగే ఆడవారికి తక్కువ నిద్ర పడుతుంది. ఎక్కువగా కెఫీన్ వలన శరీరంలో మార్పులొచ్చి అడ్రినల్ గ్రంథులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆడవారు మెనోపాజ్ దశలోకి వస్తున్నప్పుడు సెక్స్ హార్మోన్ల స్థాయిని నిలిపివుంచటంపై కూడా ప్రభావం చూపిస్తుంది.

6. మెదడు పనితీరు మందగించటం

6. మెదడు పనితీరు మందగించటం

ప్రసిద్ధ పరిశోధనలో 3 లేదా అంతకన్నా ఎక్కువసార్లు ప్రతిరోజూ కాఫీ తాగే స్త్రీలలో మెదడు పనితీరు స్పష్టంగా మందగించిందని తేలింది. టీ, కాఫీ రెండింటిలోని కెఫీన్ ఆడవారిలో మెదడు పనితీరును ఒకేలా మందగించేలా చేస్తాయి.

7. కడుపుతో ఉన్నప్పుడు కెఫీన్ ను పరిమితంగా తీసుకోవటం

7. కడుపుతో ఉన్నప్పుడు కెఫీన్ ను పరిమితంగా తీసుకోవటం

రోజూ రెండు లేదా మూడు కప్పుల కాఫీని తీసుకోవడం ప్రెగ్నెన్సీపై తీవ్ర ప్రభావం ఏమీ చూపించదు. మూడు కప్పుల కాఫీ కన్నా మించితే, ఆడవారికి గర్భస్రావం జరిగే ఛాన్స్ రెట్టింపు అవుతుంది.

సురక్షితంగా ఉండటానికి, కడుపుతో ఉన్నవారు ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్ తీసుకోవడం గురించి తమ గైనకాలజిస్టులతో మాట్లాడితే మంచిది.

English summary

what-are-the-effects-of-caffeine-in-women

These are the side effects of coffee in females which include affecting the endocrine and nervous systems of a woman. So, if you may experience nervousness, dizziness, nausea after consuming caffeine, don't be surprised.
Story first published: Thursday, March 22, 2018, 12:00 [IST]