For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భసంచిని తొలగించడం వలన తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్

గర్భసంచిని తొలగించడం వలన తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్

|

యవ్వనంలోకి ప్రవేశించిన అమ్మాయికి ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. ఈ సమయంలో బ్లీడింగ్ జరుగుతుంది. ఈ సమయంలో బ్లడ్ లాస్ తో పాటు అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అనేక అసౌకర్యాలు తలెత్తుతాయి. మూడ్ స్వింగ్స్ దగ్గర నుంచి స్టమక్ క్రామ్ప్స్ అలాగే బ్లోటింగ్ వంటి అసౌకర్యాలు ఎదురవుతాయి. అయితే, నెలకోసారి ఎదురయ్యే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అమ్మాయి అలవాటు పడిపోతుంది. అయితే, ఈ అసౌకర్యాల తీవ్రత ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. నిజానికి ఎన్నో సందర్భాలలో, మహిళ తన పీరియడ్ తో కొంతమేరకు అసౌకర్యానికి గురవడం సహజం.

కొన్ని మెడికల్ కండిషన్స్ వలన గర్భ సంచిని తొలగించాల్సి రావచ్చు. శరీరంలోని ముఖ్య భాగమైన గర్భ సంచిని తొలగించాల్సి రావడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవలసి వస్తుంది. గర్భం దాల్చడానికి ఇష్టపడని వారు లేదా ఏవైనా ఇతర కారణాల వలన గర్భ సంచిని తొలగించే అవసరం ఏర్పడుతుంది. నిజానికి, పీరియడ్స్ లేని లైఫ్ అనేది కొంత మంది మహిళలకు ఒక డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. అయినా, పీరియడ్ ప్రాబ్లెమ్ ను తప్పించుకోవడానికి గర్భ సంచిని తొలగించుకోవడం మంచి ఆలోచన కాదు. గర్భసంచిని తొలగించుకోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆర్టికల్ లో ఆయా సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చించడం జరిగింది.

What are the Side Effects of Uterus Removal
• రికవరీ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, స్కారింగ్ సమస్య తలెత్తవచ్చు:

• రికవరీ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, స్కారింగ్ సమస్య తలెత్తవచ్చు:

కన్వెన్షనల్ యుటెరస్ ప్రాసెస్ ని ఫాలో అయ్యే వారిలో ఈ సైడ్ ఎఫెక్ట్ తలెత్తే ఆస్కారం ఉంది. ఈ పద్దతిలో వెర్టికల్ గా కట్ చేస్తారు. కొన్ని అరుదైన సందర్భాలలో, హారిజాంటల్ గా కట్ చేస్తారు. ఈ కట్ నుంచి గర్భసంచిని శరీరంలోంచి తొలగిస్తారు. ఈ పద్దతిని పాటిస్తే బెడ్ రెస్ట్ ను కొన్ని వారాల పాటు తీసుకోవలసి వస్తుంది.

• వెజీనాకు డేమేజ్:

• వెజీనాకు డేమేజ్:

వెజీనా హిస్టరెక్టామి పద్దతిలో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ ఇది. ఈ పద్దతిలో వెజీనా ద్వారా గర్భసంచిని తొలగిస్తారు. ఈ విషయంలో సర్జన్స్ అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. ప్రాసెస్ కాస్త అటూ ఇటూ అయితే వెజీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. లాంగ్ టర్మ్ డేమేజ్ జరగవచ్చు.

• ఎనీమియాకు గురయ్యే ప్రమాదం:

• ఎనీమియాకు గురయ్యే ప్రమాదం:

గర్భసంచిని తొలగించేందుకు ఏ పద్దతిని అనుసరించినా బ్లడ్ లాస్ జరగడం మాత్రం సహజం. అందువలన అనీమియా సమస్య వేధించే ప్రమాదం ఉంది. బ్లడ్ లాస్ ఎక్కువగా జరగడం వలన అనీమిక్ అవవచ్చు. కొంతమంది రోగులలో ఇటువంటి సర్జరీ తరువాత బ్లడ్ క్లాట్స్ సమస్య తలెత్తడాన్ని గుర్తించడం జరిగింది. కాళ్లలో లేదా లంగ్స్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడవచ్చు. ఇవి గర్భసంచిని తొలగించడం వలన ఎదురయ్యే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్.

• క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది:

• క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది:

లాపారోస్కోపిక్ హిస్టారెక్టామిలో యుటెరస్ టిష్యూలను విచ్చిన్నం చేసేందుకు శక్తివంతమైన మార్సెలేటర్స్ ను వాడతారు. లాపరోస్కోపిక్ ఇన్సిషన్ ప్రక్రియ ద్వారా వీటిని తొలగిస్తారు. అయితే, ఈ పద్దతి వలన క్యాన్సర్ కారక టిష్యూస్ శరీరం మొత్తం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇవి రాను రాను ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

• పెయిన్

• పెయిన్

సర్జికల్ ప్రాసెస్ వలన కొంత పెయిన్ కలగడం సహజం. ఏ సర్జికల్ ప్రాసెస్ లో నైనా పెయిన్ ఉంటుంది. గర్భసంచిని తొలగించేందుకు పాటించే పద్దతుల వలన కూడా పెయిన్ తలెత్తవచ్చు. అయితే, నొప్పి తీవ్రత అలాగే డ్యూరేషన్ అనేది అనుసరించబడిన లాపారోస్కోపిక్ ప్రాసెస్ పై ఆధారపడి ఉంటుంది. నేచురల్ హిస్టరెక్టామి అనేది అత్యంత పెయిన్ఫుల్ ప్రాసెస్. దీని ద్వారా తలెత్తిన నొప్పి ఒక నెలపాటు ఉంటుంది. వెజీనల్ హిస్టారెక్టామి వలన తలెత్తే నొప్పి రెండు నుంచి మూడు వారాల పాటు ఉంటుంది. లాపారోస్కోపిక్ హిస్టారెక్టోమీ వలన తక్కువ పెయిన్ ఉంటుందని తెలుస్తోంది.

• అనస్థీషియా వలన తలెత్తే సమస్యలు

• అనస్థీషియా వలన తలెత్తే సమస్యలు

రికవరీ పీరియడ్ లో పేషంట్ అనుభవించే నొప్పి గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్న పాయింట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే, సర్జరీ సమయంలో నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. అందువలన, వైద్యులు పేషంట్స్ కు అనస్థీషియా(లోకల్ లేదా జెనెరల్ అనస్థీషియా)ను ఇస్తారు. కొంతమంది మహిళల్లో గుండె లేదా బ్రీతింగ్ సమస్యలు తలెత్తవచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఆస్త్మా సమస్యతో బాధపడే వారిలో అలాగే 50 ఏళ్ళ వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

• ఇన్ఫెక్షన్:

• ఇన్ఫెక్షన్:

సర్జరీ సమయంలో కొన్ని ఫారీన్ మాటర్స్ అనేవి శరీరంలోని అంతర్గత అవయవాలలో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన, ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. వైద్యులు ఎంత కేర్ తీసుకున్నా పేషంట్స్ బాడీ కొన్నిటికి రియాక్ట్ అయి ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, గర్భసంచిని తొలగించే క్రమంలో ఇన్ఫెక్షన్స్ సమస్య తలెత్తవచ్చు. ఇది, ఒక సైడ్ ఎఫెక్ట్.

• ఇతర అవయవాలకు గాయాలు:

• ఇతర అవయవాలకు గాయాలు:

మానవశరీరం అత్యంత కాంప్లికేటెడ్ మెషిన్. అత్యంత తక్కువ స్థలంలోనే అనేక అవయవాల అమరికాను గుర్తించవచ్చు. గర్భసంచి చుట్టూ ఫెలోపియన్ ట్యూబ్స్, ఇంటస్టైన్, పెల్విక్ బోన్స్ మరియు ఓవరీస్ ఉంటాయి. సర్జరీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే గర్భసంచి చుట్టుపక్కల ఉండే అవయవాలపై ఆ ప్రభావం పడవచ్చు. డేమేజ్ తీవ్రత అనేది ఆయా సందర్భాన్ని బట్టి మారుతుంది. డేమేజ్ షార్ట్ టర్మ్ కావచ్చు లేదా లాంగ్ టర్మ్ కూడా కావచ్చు.

• ఎర్లీ మెనోపాజ్:

• ఎర్లీ మెనోపాజ్:

గర్భసంచిని తొలగించే చాలా సందర్భాలలో ఓవరీస్ ను కూడా తొలగించే ఆస్కారం ఉంది. అటువంటి సందర్భాలలో, ప్రీ మెనోపాసల్ స్థితికి చేరవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే, మెనోపాజ్ అనేది కాస్తంత ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితి తలెత్తడం వలన మూడ్ స్వింగ్స్, నైట్ స్వేట్, తేలికపాటి ఫీవర్ మరియు ఇతర లక్షణాలు తలెత్తుతాయి.

• పెయిన్ఫుల్ సెక్స్:

• పెయిన్ఫుల్ సెక్స్:

ఈ సైడ్ ఎఫెక్ట్ సాధారణంగా ఎదురవదు. అయితే, కొన్ని సందర్భాలలో మహిళలు ఇంటర్కోస్ సమయంలో తీవ్రమైన బాధను అనుభవించే ఆస్కారం ఉంది. ఈ పెయిన్ చిన్నపాటి నుంచి తీవ్రంగా ఉండవచ్చు. అబ్డోమినల్ క్రామ్ప్స్ ను వారు ఎక్స్పీరియెన్స్ చేయవచ్చు. గర్భసంచిని తొలగించడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. ఒకవేళ ఈ సమస్య మీకు ఎదురైతే వెంటనే వైద్యుని దృష్టికి తీసుకెళ్లండి.

English summary

What are the Side Effects of Uterus Removal

It is this inconvenience prompted by some medical condition that might make a woman want to remove the uterus from her body. This is especially true in the case of women who have lived their reproductive life or those who do not want to conceive at all. Indeed, a life that is free from periods and all the associated problems seems like a dream to most of us women.
Story first published:Saturday, July 21, 2018, 12:14 [IST]
Desktop Bottom Promotion