For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకర వీర్యానికి ఉండవలసిన రంగు ఏమిటి ? వీర్యం యొక్క వివిధ రంగులు, వాటి సంకేతాలు !

|

మీకు, వీర్యం రంగు ఆధారితంగా కూడా ఆరోగ్యాన్ని ధ్రువీకరించవచ్చని తెలుసా? మరియు వాస్తవానికి ఉండవలసిన ఆరోగ్యకర రంగు మరియు భిన్న రంగులలోని వీర్యానికి మద్య తేడాల గురించిన అవగాహన ఉందా ? నిజానికి, వైద్యులు చెప్తున్న వివరాల ప్రకారం, వీర్యం యొక్క రంగు మీకు ఇదివరకే తెలిసిన అంశాల కన్నా, మీ ఆరోగ్యం గురించి ఎక్కువ వివరాలను అందివ్వగలదు. ఒక్కోసారి అసాధారణమైన రంగులలో కూడా వీర్యం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి, శ్లేష్మం రంగులో కూడా కనిపిస్తుంటుంది. కానీ, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోని ఎడల కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తవచ్చు. దీనికి కారణం, ఆ రంగులు కొన్ని సంక్రమణ వ్యాధులను సైతం సూచించడమే.

మీ వీర్యం యొక్క రంగును పరిశీలించడం, మీ ఆరోగ్యాన్ని కొంతమేర అర్థం చేసుకునేందుకు మీకు సహాయపడుతుంది. వాస్తవానికి, ఆరోగ్యకరమైన వీర్యం తెలుపు రంగులోనే కనిపిస్తుంది. ఏదేమైనా, దాని రంగులో మార్పులను కలిగి ఉండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. మీ ఆరోగ్యానికి వీర్యం రంగు మార్పుల గురించిన అవగాహన కోసం ఈ వ్యాసం మీకు దోహదపడుతుంది.

వీర్యం మరియు దాని మిశ్రమం :

వృషణాలు, ఎపిడిడిమిస్, ప్రోస్టేట్, సెమినల్ వెసికల్స్ మరియు బల్బౌరేత్రల్ గ్రంధులు వీర్యం ఉత్పత్తిలో ప్రధాన భూమికను పోషిస్తాయి. సెమినల్ వెసికల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడే పసుపు రంగులోని జిగట ద్రవం ఫ్రక్టోజ్ మరియు ఇతర పదార్ధాలలో సమృద్ధిగా నిండి ఉంటుంది. ఇవి మొత్తంగా 70 శాతం వీర్య కణాలతోనే తయారవుతాయి. ప్రోస్టేట్ నుండి స్రవించే స్రావం తెల్లగా ఉంటుంది మరియు ఇది డైహైడ్రోటెస్టోస్టీరోన్ ద్వారా ప్రభావితమవుతుంది. ఈ జిగట ద్రవం, లిపిడ్లు, సిట్రిక్ యాసిడ్, గెలాక్టోస్ మరియు యాసిడ్ ఫాస్ఫాటేస్లతో పాటు ప్రోటియోలిటిక్ ఎంజైమ్లను కలిగి ఉంటుంది.

ఆరోగ్యకరమైన వీర్యం యొక్క రంగు :

ఆరోగ్యకరమైన వీర్యం యొక్క రంగు :

ఒక ఆరోగ్యకరమైన శరీరం నుండి స్రవించే వీర్యం, తెల్లటి బూడిద రంగులోని ద్రావణంగా కనిపిస్తుంది. స్ఖలనం గావించినప్పుడు, ఇది మందపాటి తత్వాన్ని కలిగి, జిగట ద్రావణం స్వరూపంలో కనిపిస్తుంది. ఇది 30 నిమిషాల తర్వాత ద్రవీకృతమవుతుంది. మీ మూత్రం క్లోరిన్ వంటి వాసన తత్వాన్ని కలిగి ఉండవచ్చు, మరియు ఇది పూర్తిగా సాధారణమైన అంశం. సైంటిస్ట్ల ప్రకారం అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ వీర్యానికి తీపి రుచిని ఇస్తుంది కూడా.

వీర్యం యొక్క ఇతర రంగులు ఏమిటి ?

వీర్యం యొక్క ఇతర రంగులు ఏమిటి ?

పసుపు రంగులో వీర్యం :

కొన్ని సమయాల్లో పసుపు రంగులో కూడా వీర్యం కనిపిస్తూ ఉంటుంది. ఇది అత్యంత సాధారణమైన అంశంగా ఉంటుంది. మరియు తీవ్ర భయాందోళనలకు చెందవలసిన విషయమైతే కాదు. వయసు ప్రభావాల దృష్ట్యా, వీర్యం రంగులో మార్పులు కూడా సహజంగానే ఉంటుంది. మీరు కొంతకాలం స్ఖలనం గావించని ఎడల, మీ వీర్యం రంగు పసుపు రంగులో కనిపించడం అనేది సాధారణమైన అంశంగా ఉంటుంది. అంగస్తంభన సమయంలో, మూత్ర ప్రసారం నిరోధించబడి, వీర్యం మాత్రమే ప్రసరించేలా అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం, పసుపు రంగులో వీర్యం స్ఖలనం గావించినప్పుడు, మూత్రం అవశేషాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.

పసుపు రంగు వీర్యంతో సంబంధం ఉన్న ఇతర వైద్య కారణాలుగా ల్యూకోసిటోస్పెర్మియా (అధిక స్థాయిలో తెల్ల రక్త కణాలు ఉన్న సందర్భాలు) మరియు కామెర్లు ఉన్నాయి.

గోధుమ రంగులో వీర్యం :

గోధుమ రంగులో వీర్యం :

పింక్ లేదా గోధుమ రంగు వీర్యం, రక్తస్రావమును సూచిస్తుంది, ఎక్కువగా ప్రోస్టేట్ వాపు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

Most Read: మొబైల్ రాకముందు ప్రపంచమే వేరు, సెల్ వచ్చాక సెక్స్ కూడా చేయడం లేదు, మరి ఇంత దారుణమా?

ఆకుపచ్చ రంగు వీర్యం :

ఆకుపచ్చ రంగు వీర్యం :

ఆకుపచ్చ రంగులో వీర్యం ఉన్న ఎడల, ప్రోస్టేట్ సంక్రమణ వ్యాధిని సూచించగలదు. దీనికి వెంటనే వైద్య సహాయం అవసరం. సంక్రమణ చికిత్సకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండవచ్చు. అయిననూ, ఔషధాలు మరియు విటమిన్ అవశేషాలు కూడా వీర్యం, ఆకుపచ్చ రంగులో కనపడడానికి కారణంగా ఉంటాయి.

ఎరుపు రంగులో వీర్యం :

ఎరుపు రంగులో వీర్యం :

ఈ పరిస్థితిలో వీర్యంలో రక్తపు చాయలను సూచిస్తుంది. వైద్య పరంగా ఈ పరిస్థితిని హెమాటోస్పెర్మియా అని పిలుస్తారు. అత్యధిక సందర్భాలలో ప్రమాదకరం అయినప్పటికీ, లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు ప్రోస్టేట్ సంబంధిత సమస్యల వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఎరుపు రంగు వీర్యం సూచించగలదు. రక్తం, సాధారణంగా నాళాలు లేదా పురుషాంగంతో సంబంధం ఉన్న గ్రంథుల వాపు కారణంగా వీర్యం ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి ?

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి ?

వాస్తవానికి, వీర్యం యొక్క ఆకృతి లేదా రంగులలో మార్పులు తాత్కాలికంగా ఉంటాయి. ఈ సమస్య సాధారణంగా స్వల్ప కాల వ్యవధిలోనే దానికదే స్వయంగా పరిష్కరించబడుతుంది. క్రమంగా పరిస్థితి తగ్గుముఖం పడుతుంది. కానీ, వీర్యంలో ఈ అసాధారణ మార్పులు ఒక వారం కన్నా ఎక్కువ కాలం పాటు కనిపించిన ఎడల, వైద్యుని సంప్రదించడం తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా, వీర్యం రంగు, దురద, నొప్పి, లైంగిక అసమర్థత, జ్వరము మొదలైన పరిస్థితుల్లో, వీర్యంలో రక్తం చేరే అవకాశాలు లేకపోలేదు. ఇటువంటి సందర్భాలలో ఆలస్యం చేయకుండా, వైద్యుని సంప్రదించడం మంచిదిగా సూచించబడింది.

Most Read:ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు, అతని చూపులకు వెంటనే చీర మార్చుకోవాలనిపిస్తుంది, దూల లేదు #mystory270

చికిత్సా పద్దతులు ఎలా ?

చికిత్సా పద్దతులు ఎలా ?

పసుపు రంగులోని వీర్యం కామెర్లను సూచించవచ్చు, కావున ఇటువంటి సందర్భాలలో వైద్యుని సంప్రదించడం తప్పనిసరిగా ఉంటుంది. పసుపు రంగు వీర్యం వెనుక వయసు మాత్రమే కాకుండా, అంటువ్యాధులు కారణంగా ఉంటే, అప్పుడు మీ వైద్యుడు యాంటీ వైరల్ మందులు లేదా యాంటీ బయాటిక్స్ సూచించవచ్చు. సంక్రమణ ప్రభావాలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో, మీ భాగస్వామికి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్న కారణంగా, మీ వైద్యుడు లైంగిక సంభోగంలో పాల్గొనకూడదని, లేదా అత్యవసర పరిస్థితుల్లో సురక్షణా పద్దతులను సూచించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నీటిని అధికంగా తీసుకోవడం సహాయం చేస్తుంది.

ఆకుపచ్చ రంగులోని వీర్యం, ప్రోస్టేట్ మరియు పరిసర కణజాలాలను ప్రభావితం చేసే సంక్రమణను సూచిస్తుంది కాబట్టి. సంక్రమణ వ్యాప్తి చెందకుండా, మందులను సూచించవచ్చు.

హెమటోస్పెర్మియా అనేది వీర్యంలో ఉన్న ఒక పరిస్థితి(వీర్యం ఎరుపు లేదా గోధుమ రంగుతో వస్తుంది). అయితే, ఈ పరిస్థితి అసాధారణమైన విషయం కాదు. అత్యంత అరుదుగా మాత్రమే సమస్య తీవ్రరూపాన్ని సంతరించుకుంటుంది.

సాధారణంగా యాంటీబయాటిక్స్ కోర్సు 2 వారాలుగా ఉంటుంది. అవి ప్రధానంగా ప్రోస్టేట్ చికిత్సలో ఉపయోగపడుతాయి. డాక్సీసైక్లిన్, ట్రైమెథోప్రిమ్, సల్ఫెమెథోక్సాజోల్, ఫ్లోరోక్వినోలోన్లు వంటివి సాధారణంగా ఉపయోగించే మందులుగా చెప్పబడినవి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What The colour Of Your Semen Says About Your Health

The colour of the semen could reveal a lot about your health. The yellowish viscous fluid that is produced by the seminal vesicles is rich in fructose and other substances, which altogether make up about 70 per cent of the semen. Pinkish or brownish semen indicates bleeding, mostly due to the inflammation of the prostate.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more