For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ మీట్ ను అతిగా తీసుకునే మహిళలో అనారోగ్య ముప్పు!

రెడ్ మీట్ ను అతిగా తీసుకునే మహిళలో అనారోగ్య ముప్పు!

|

బేకాన్ మరియు సాసేజెస్ వంటి వాటితో పోలిస్తే స్టీక్ మరియు లాంబ్ చాప్స్ వంటి ప్రాసెస్ అవబడని మీట్స్ అనేవి మహిళల ఫెర్టిలిటీ లెవల్స్ పై దుష్ప్రభావం చూపుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రెడ్ మీట్ ను తీసుకుంటే ఎండోమెట్రియోసిస్ బారిన పడే ప్రమాదం మహిళల్లో 56 శాతం పెరుగుతుందని నూతన అధ్యయనం వెల్లడిస్తోంది.

ఎండోమెట్రియోసిస్ అనే ఈ స్థితిలో యుటెరస్ లైనింగ్ వద్దనున్న సెల్స్ అనేవి శరీరంలోని ఇతర ప్రాంతాలలో ( ఉదాహరణకు యుటెరస్) కనుగొనబడతాయి. ఇవి పొట్టలోని సెల్స్ రియాక్ట్ అయిన విధంగానే రియాక్ట్ అవడం ప్రారంభిస్తాయి. అంటే, బిల్డ్ అప్ అవడం, చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడటం తరువాత బ్లీడింగ్ జరగటం.

Heres Why Women Should Avoid Too Much Of Red Meat In Their Diet

యూకే మరియు యూఎస్ లో పిల్లల్నికనే వయసులో ఉండే మహిళల్లో పది మందిలో ఒకరిలో ఈ సమస్య తలెత్తుతుంది. పీరియడ్స్ భారీగా ఉండటం, నొప్పి, విపరీతమైన అలసట, ఇన్ఫెర్టిలిటీ, బౌల్ ప్రాబ్లెమ్స్ మరియు బ్లాడర్ సమస్యలు ఈ సమస్య యొక్క ప్రధాన లక్షణాలు.

రెడ్ మీట్ అనేది మహిళల్లోనే ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంపొందించుతుందని ఇదివరకటి అధ్యయనాలు స్పష్టం చేసాయి. అందువలన, ఎండోమెట్రియోసిస్ సమస్య తలెత్తవచ్చు. ఈ అధ్యయనం యొక్క ఫలితాలు మరిన్ని విషయాలను తెలియచేశాయి. ఎక్కువగా రెడ్ మీట్ ను తీసుకోవడం వలన ఎండియోమెట్రియోసిస్ సమస్య తలెత్తి నొప్పి కలగటంతో పాటు ఫెర్టిలిటీపై దుష్ప్రభావం కలిగిస్తుందని తేలింది. అయితే , పౌల్ట్రీ, ఫిష్ మరియు సీఫుడ్ వలన మహిళలలో ఎండియోమెట్రియోసిస్ లక్షణాలు కనిపించలేదని అధ్యయనాలు తెలిపాయి.

అయితే, రెడ్ మీట్ ను తీసుకోవడం తగ్గిస్తే మహిళల్లో ఎండోమెట్రియోసిస్ సమస్య తలెత్తే అవకాశాలు లేవన్న విషయం మరింత స్పష్టంగా నిర్ధారణ కావడానికి మరిన్ని అధ్యయనాలు అవసరపడతాయి. రెడ్ మీట్ ను మహిళలు అతిగా ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది:

బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది:

హార్వర్డ్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం రెడ్ మీట్ ను అతిగా తీసుకున్న మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం అధికంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు, రోజువారీ ఆహారంలో రెడ్ మీట్ కు బదులుగా చికెన్, ఫిష్ లేదా నట్స్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని కూడా తేలింది. ఎందుకంటే, రెడ్ మీట్ ను అధిక ఉష్ణోగ్రతలతో వండవలసి వస్తుంది. అందువలన, క్యాన్సర్ కారక బై ప్రోడక్ట్స్ ఉత్పన్నమవుతాయి.

మరొక కారణమేంటంటే, పశువుల ఎదుగుదల కోసం కొన్ని హార్మోన్స్ ని వాటికందిస్తారు. ఈ హార్మోన్స్ అనేవి మహిళల హార్మోన్ల స్థాయిలలో కూడా మార్పులను తీసుకువస్తాయి. ప్రాసెస్డ్ మీట్స్ లో నైట్రేట్స్ ఉంటాయి. వీటి వలన కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

కొలొరెక్టల్ క్యాన్సర్

కొలొరెక్టల్ క్యాన్సర్

రెడ్ మీట్స్ ని తీసుకోవడం వలన ముఖ్యంగా ప్రాసెస్డ్ వి తీసుకోవడం వలన కోలోరెక్టార్ క్యాన్సర్ ప్రమాదం కూడా తలెత్తుతుంది. రోగనిరోధక శక్తిపై జీన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ జీన్ గనక మీలో ఉంటే, మీట్ ను తీసుకోవడం వలన డైజేషన్ ప్రక్రియ అనేది ఇంఫ్లేమేషన్ ను పెంపొందించి ఇమ్మ్యూన్ రెస్పాన్స్ పై దుష్ప్రభావం చూపుతుంది.

హార్మోన్లలో అసమతుల్యతలు ఏర్పడతాయి:

హార్మోన్లలో అసమతుల్యతలు ఏర్పడతాయి:

ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం రెడ్ మీట్ లో జోడింపబడిన హార్మోన్స్ అనేవి 1.5 సెర్వింగ్స్ కంటే రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకున్న మహిళల్లో ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదాన్ని కలిగిస్తాయి. హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్ ని వృద్ధి చేసే ప్రమాదం ఎక్కువ. రెడ్ మీట్ ను తక్కువగా తీసుకునే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ కు గురయ్యే ప్రమాద స్థాయి కాస్తంత తక్కువే.

అధిక బరువు:

అధిక బరువు:

రెడ్ మీట్ లో అనారోగ్యకరమైన, శాచురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. వీటి వలన అధిక బరువు సమస్య వేధిస్తుంది. రెడ్ మీట్ లో అమూల్యమైన పోషకాలు అలాగే ప్రోటీన్స్ లభ్యమైనప్పటికీ అతిగా తీసుకోవడం వలన దీని వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. బరువు అతిగా పెరగటానికి ఇది కారణమవుతుంది.

జీవితకాలాన్ని తగ్గిస్తుంది:

జీవితకాలాన్ని తగ్గిస్తుంది:

రెడ్ మీట్ ను అతిగా తీసుకోవడానికి అలాగే జీవితకాలం తగ్గిపోవడానికి మధ్య గల సంబంధం గురించి హార్వర్డ్ అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. బాగా వేడికి గురి చేసి వండిన మాంసం కాస్త మాడుకు కూడా గురవడం వలన ఇది టాక్సిన్స్ ను విడుదల చేస్తుందని అందువలన ఉదర క్యాన్సర్ తో పాటు మరెన్నో అనారోగ్యకర సమస్యలు వేధిస్తాయని తెలుస్తోంది. జీవితకాలం తగ్గే ప్రమాదం ఉందని తేలింది. మరోవైపు ఆరోగ్యకరమైన పోషకాలు లభించే ఫిష్, పౌల్ట్రీ నట్స్ తో పాటు లెజ్యుమ్స్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే ప్రాణాపాయ ప్రమాదాలు తగ్గుతాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిపుణులు స్పష్టం చేశారు.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం అధికం:

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం అధికం:

రెడ్ మీట్ కొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతుంది. ఇది ఈ కోలీ వంటి బాక్టీరియాను కలిగి ఉండే అవకాశాలున్నాయి. అందువలన, మీరు అనారోగ్యం పాలు కావచ్చు. దీని వలన, పొత్తికడుపులో నొప్పి, డీహైడ్రేషన్ తో పాటు కిడ్నీ సమస్యలు వేధించవచ్చు. ప్రతిరోజూ, రెడ్ మీట్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ కోలీ బాక్టీరియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మీరు రెడ్ మీట్ ను అధికంగా తీసుకున్నప్పుడు మీ శరీరం ఇందులో ఉండే ఎన్-గ్లైకోలైన్యూరామినిక్ యాసిడ్ (Neu5Gc) అనే షుగర్ మాలిక్యూల్ ని గ్రహించడం జరుగుతుంది. ఈ కోలీ ద్వారా ఉత్పత్తి అయిన టాక్సిన్ అనేది Neu5Gc ను టార్గెట్ చేస్తుంది. Neu5Gcకు ఎక్స్పోస్ అయిన సెల్స్ కు అతుక్కుపోతుంది. ఉదాహరణకు కిడ్నీస్ తో పాటు ఇంటస్టినల్ లైనింగ్ కు చెందిన సెల్స్ ఈ ప్రభావానికి గురవుతాయి.

అల్జీమర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది:

అల్జీమర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది:

రెడ్ మీట్ లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే అల్జీమర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఈ విషయాన్ని యూసీఎల్ఏ అధ్యయనం స్పష్టం చేస్తుంది. మెదడులోని ఐరన్ ఎక్కువగా అక్యుములేట్ అవడం వలన నెర్వ్ ఫైబర్స్ ని సంరక్షించే మైలిన్ అనే ఫ్యాటీ టిష్యూ దెబ్బతినడం ప్రారంభిస్తుంది. దీనివలన, బ్రెయిన్ పనితీరు దెబ్బతింటుంది. అల్జీమర్ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి.

ఇతర అనారోగ్య సమస్యలు:

ఇతర అనారోగ్య సమస్యలు:

రెడ్ మీట్ ను అతిగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తో పాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా పెరగడం, జీర్ణ సమస్యలతో కోలో రెక్టార్ వంటి కొన్ని క్యాన్సర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే అల్జీమర్ వ్యాధి, స్ట్రోక్ మరియు టైప్ 2 డయాబెటిస్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువ.

రెడ్ మీట్ లో శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండటం వలన ఎక్కువ రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. శాచురేటెడ్ ఫ్యాట్ ని అధికంగా తీసుకుంటే, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. తద్వారా, గుండె జబ్బులు తలెత్తుతాయి. అంతేకాక, రెడ్ మీట్ లో ఎల్-కార్నిటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన ప్లేక్ ఫార్మేషన్ కి దారితీసి గుండె జబ్బులను పెంచుతుంది.

రెడ్ మీట్ ను తక్కువగా తీసుకోవటం:

రెడ్ మీట్ ను తక్కువగా తీసుకోవటం:

రెడ్ మీట్ ను తక్కువగా తీసుకోవడం వలన ముఖ్యంగా ఫ్యాట్ కలిగినవి అలాగే ప్రొసెస్డ్ వాటిని దూరంగా ఉంచి వాటికి బదులుగా పౌల్ట్రీ లేదా ఫిష్ వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ సోర్సెస్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం యానిమల్ ప్రోటీన్ ను తీసుకోవడం తగ్గించాలి. అంటే, రోజులో కేవలం ఆరు ఔన్సులకే యానిమల్ ప్రోటీన్ ను పరిమితం చేయాలి. రెడ్ మీట్ కు బదులుగా సాధ్యమైనంత వరకూ ఫిష్, చికెన్ లేదా ప్లాంట్ ప్రోటీన్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.

రెడ్ మీట్ ను తీసుకోవడం వలన కొన్ని అనారోగ్యకర సమస్యలను ఎదురుకోవడం తప్పదని తేలింది కదా. అందువలన, జాగ్రత్తగా ఉండటం కోసం రెడ్ మీట్ ను తీసుకునే మోతాదును పరిమితం చేసుకోండి. తక్కువ మోతాదులో రెడ్ మీట్ ను తీసుకోండి. కాబట్టి, ఈ సారి వంట చేసుకునేటప్పుడు హ్యాంబర్గర్ ని స్కిప్ చేసి అందుకు బదులుగా స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ లేదా ఫిష్ ను పరిగణలోకి తీసుకోండి.

English summary

Here's Why Women Should Avoid Too Much Of Red Meat In Their Diet

Unprocessed meats, including steak and lamb chops, have been linked to affecting the fertility levels in women, in comparison to bacon and sausages. A new research has suggested that two or more servings of red meat a week, increase the risk of endometriosis in women by 56 per cent.
Desktop Bottom Promotion