For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తమాకు 9 సాధారణ లక్షణాలు

|

ఆస్థమా అనేది, గురక, దగ్గు, ఛాతీ మదింపు, వాయునాళాలలో అడ్డంకి ఏర్పడడం లేదా కుదింపుకు గురికావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో కూడిన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిగా ఉంటుంది. ఈ వ్యాధి, మీ పని మరియు జీవనవిధానం మీద ప్రభావాన్ని చూపే తీవ్రమైన సమస్యగా ఉంటుంది. తీవ్రమైన ఆస్థమా అటాక్స్ కారణంగా తరచుగా ఆసుపత్రిలో చేరడానికి కూడా దారితీస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

వాస్తవానికి ఊపిరితిత్తుల్లో వాయునాళాల వాపు కారణంగా ఆస్థమా కలుగుతుంది. దీని మూలంగా చిరాకు లేదా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. డస్ట్ లేదా స్మోక్ అలర్జీలు ఉండేవాళ్ళు, ఇంటిలోని సాధారణ దుమ్ము ధూళికి కూడా ప్రభావితమై, ఆస్థమా లక్షణాల బారిన పడుతుంటారు. క్రమంగా ఈ అలర్జీ కారకాల నుండి దూరంగా ఉండడం మూలంగా, ఆస్థమా దాడులకు దూరంగా ఉండవచ్చునని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Asthma

ఆస్థమా కారకాల బారిన పడినప్పుడు ఆస్థమా అటాక్ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆస్థమా కారకాల గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా, మీరు దేనికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారోనన్న అవగాహన కలుగుతుంది. క్రమంగా వాటి నిర్వహించడం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకొనగలరు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇక్కడ పొందుపరచబడిన జాబితాలోని అంశాలు అత్యంత సాధారణమైన ఆస్త్మా కారకాలు(ట్రిగ్గర్స్) గా ఉన్నాయి.

1. డస్ట్ మైట్స్ (నల్లులు) :

1. డస్ట్ మైట్స్ (నల్లులు) :

డస్ట్ మైట్స్, ఇవి ఒకరకమైన బాక్టీరియా జాతికి చెందిన కీటకాలుగా ఉంటాయి. దాదాపు ప్రతి ఇంటిలోనూ కనిపించే ఈ నల్లులు, నిద్రాభంగానికి కారణంగా ఉండడమే కాకుండా, ఆస్థమా దాడికి కూడా అత్యంత సాధారణమైన కారకంగా ఉంటాయి. వీటి బారిన పడకుండా, ఆస్థమా దాడిని నిరోధించడానికి, దిండు మరియు పరుపు కవర్లను తరచుగా మారుస్తూ ఉండాలి. మీ పడక గదిలోని టెడ్డీ బేర్లను కూడా తరచుగా శుభ్రపరచడం అలవాటు చేసుకోండి. మీరు మీ పడకగదిని శుభ్రంగా ఉంచుకునే విధానం మీదనే సగం ఈ నల్లులు తగ్గడం ఉంటుంది. అంతేకాకుండా కనీసం వారానికి ఒకసారైనా యాంటీ బాక్టీరియల్ లిక్విడ్స్ వినియోగించి మీ ఇంటిని కడగడం లేదా మాబ్ అనుసరించడం చేయండి.

2. పెంపుడు జంతువులు :

2. పెంపుడు జంతువులు :

పెంపుడు జంతువులు కూడా ఆస్థమా దాడులకు కారణంగా మారగలవు. ఒకవేళ మీరు నిజంగా వీటి వలన ప్రభావితమైనట్లు అనిపిస్తే, కొంచం వీటికి దూరంగా ఉండాల్సిందిగా సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా మీ పెంపుడు జంతువుల బొచ్చు, మూత్రం, ఈకలు లేదా లాలాజలంలో కనిపించే ప్రోటీన్ల కారణంగా అలెర్జీ సంభవిస్తుంది. మీరు ఈ ప్రోటీన్ల పరంగా సున్నితంగా ఉన్న పక్షంలో, వాటిని తాకడం లేదా పీల్చడం మూలాన మీ రోగనిరోధక వ్యవస్థ హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడానికి కారణమవుతుంది. క్రమంగా ఇది ఆస్థమా అటాక్ కు దారితీస్తుంది. పెంపుడు జంతువులను దూరంగా ఉంచమని చెప్పడం కూడా తప్పే., బదులుగా వాటిని నిర్వహించడంలో ఎక్కువ జాగ్రత్తలను తీసుకోండి. వాటిని శుభ్రంగా ఉంచడం, టీకాలు వేయించడం మొదలైనవి అనుసరించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా, వాటి బాగోగులు చూసుకోగలరు.

3. బూజు :

3. బూజు :

మీ గదిలో బూజు వాసన ఎక్కువగా ఉన్న ఎడల, శ్వాసలో ఆటంకం ఏర్పడి ఆస్థమా ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రమంగా గురక, దగ్గు మరియు శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు తలెత్తుతాయి. తేమ మూలంగా బూజు వృద్ధి పెరుగుతుంది. కావున తేమ స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోవడం కొరకు ఎయిర్ కండిషనర్ లేదా మంచి డీహ్యుమిడిఫైయర్ ఉపయోగించడం మంచిది.

 4. పొగాకు పొగ :

4. పొగాకు పొగ :

పొగాకు పొగ, ముఖ్యంగా పరోక్ష ధూమపానం కూడా ఆస్థమా దాడికి కారణమవుతుందని చెప్పబడింది. ప్రత్యక్ష ధూమపానం చేసేవారితో సమానంగా పరోక్ష ధూమపానం చేసేవారు కూడా కాన్సర్, ఆస్థమా అటాక్స్ వంటి సమస్యల బారినపడుతున్నారని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మీరు ఆస్థమాతో బాధపడుతున్నట్లైతే పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండండి. మీపక్కన ఎవరైనా ధూమపానం చేస్తున్న పక్షంలో, ఆ ప్రాంతానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోండి.

5. బొద్దింకలు :

5. బొద్దింకలు :

బొద్దింకలు మరియు వాటి యొక్క విసర్జనలు కూడా ఆస్థమా దాడిని ప్రేరేపించగలవు. ఈ కీటకాలు వంట గది, లేదా బాత్రూంలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బొద్దింకలు ఉండే ప్రాంతాల్లో ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి వాక్యూం క్లీనర్ వేయడం లేదా క్రిమిసంహారక మందులను వినియోగించడం వంటి మార్గాలను అనుసరించాలి.

6. గడ్డి లేదా కలప నుంచి వెలువడే పొగ :

6. గడ్డి లేదా కలప నుంచి వెలువడే పొగ :

గడ్డి లేదా కలప నుంచి వెలువడే పొగలోని కర్భన ఉద్గారాల కారణంగా, శ్వాసలో ఆటంకం ఏర్పడి, ఆస్థమా ఎటాక్ దారితీస్తుంది. ఎందుకంటే పొగలో ఉండే హానికరమైన వాయువులు మరియు చిన్నచిన్న కర్భన రేణువులు ఊపిరితిత్తులకు చికాకును కలిగించవచ్చు. కావున పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలను పరిహరించండి. అనేకమంది ఇంకనూ కట్టెల పొయ్యిని అనుసరించడం, వీధులలో చెత్తను తగలెయ్యడం వంటి చర్యలకు పూనుకుంటూ కనిపిస్తుంటారు. అవి మీ ఊపిరితిత్తులకు ఎంతగానో నష్టం చేకూరుస్తాయని గుర్తుంచుకోండి.

7. బాహ్య వాయు కాలుష్యం :

7. బాహ్య వాయు కాలుష్యం :

బాహ్య వాయుకాలుష్యం అనగా కార్లు, ఫ్యాక్టరీలు మొదలైన వాటి నుంచి వచ్చే పొగ లేదా దుమ్ము కారణంగా గాలిలో చేరిన కాలుష్యంగా పరిగణించబడుతుంది. ఇవి ఆస్థమా దాడులకు మరొక ప్రధాన కారణంగా ఉంటాయి. ఒకవేళ మీ ప్రాంతంలో గాలి నాణ్యతా ప్రమాణాలు సరిగ్గాలేని పక్షంలో, బయటకు వెళ్లేముందు రెస్పిరేటర్ మాస్క్ ధరించండి. మరియు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం ఆ ప్రాంతాలలో ఉండకండి. బాహ్య వాయుకాలుష్యం కూడా ఆస్థమా దాడికి ప్రధాన కారణంగా ఉందని అనేక అధ్యయనాలలో తేలింది.

8. సైనస్ ఇన్ఫెక్షన్లు :

8. సైనస్ ఇన్ఫెక్షన్లు :

సైనస్ ఇన్ఫెక్షన్స్, మ్యూకస్ పొరల్లో ఇన్ఫ్లమేషన్(వాపు) కు కారణమవుతుంది. దీనిమూలంగా పొరలు మరింత శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. మీకు సైనస్ ఇన్ఫెక్షన్లు వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు ఉన్న పక్షంలో, మీ వాయునాళాలు కూడా ఎర్రగా వాపునకు గురవడం జరుగుతుంది. క్రమంగా ఆస్థమా అటాక్ బారిన పడవచ్చు.

9. వ్యాయామం :

9. వ్యాయామం :

వ్యాయామం కూడా మరో ఆస్థమా ట్రిగ్గర్ గా చెప్పబడుతుంది. ఏరోబిక్ వ్యాయామాలను అనుసరిస్తున్నప్పుడు, మొదటి 5 నుండి 15 నిమిషాలలోనే ఛాతీ బిగుతుగా మారడం, దగ్గు, మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది. అనేకమందికి ఈ లక్షణాలు 30 నుండి 60 నిమిషాలలోనే దూరమవుతాయి. ఇతర ఆస్థమా ట్రిగ్గర్స్ గా ఇన్ఫ్లుఎంజా, జలుబు, రేస్పిరేటరీ సైనసైటియల్ వైరస్ (RSV), అలర్జీలు, రసాయనాల వాసనలు, కొన్ని రకాల ఔషధాలు, చెడు వాతావరణం, కొన్ని రకాల ఆహార పదార్ధాలు, మరియు పరిమళాలు ఉన్నాయి.

పైవన్నీ చూశారు కాదా, మీ ఆస్థ్మా అటాక్ కు గల కారణమేదో ధృవీకరించుకుని, ఆ ప్రభావిత కారకాలకు దూరంగా ఉండేలా ప్రయత్నించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

9 Most Common Asthma Triggers

Asthma is caused by inflammation of airways in the lungs. This, in turn, causes swelling in response to irritants or other triggers. Many noted studies have shown that reducing allergens in the home can actually lessen asthma symptoms. The most common asthma triggers are pets, outdoor air pollution, tobacco smoke, dust mites, mould, smoke from burning grass or wood.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more