For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్- ఐ కారణాలు, చికిత్సా విధానాలు

|

నల్లని కళ్ళు అని అర్ధం వచ్చే ఈ బ్లాక్-ఐ, వాస్తవానికి ఒక ఆరోగ్య సమస్య. కంటి చుట్టూ ఉన్న చర్మం కింది కణజాలం కమిలినప్పుడు ఈ బ్లాక్-ఐ సమస్య తలెత్తుతుంది. అనేక సందర్భాల్లో, గాయం కంటిపై కాకుండా ముఖంపై ప్రభావం చూపుతుంది. క్రమంగా కంటి చుట్టూ ఉండే కణజాలం కమిలినట్లుగా, ముదురు నీలం రంగుతో కనిపిస్తూ ఉంటుంది.

దీనిని బ్లాక్-ఐ అని వ్యవహరించడం జరుగుతుంది. ఇది డార్క్ సర్కిల్స్ సమస్యకు పూర్తిగా భిన్నం. డార్క్ సర్కిల్స్ కారణాలుగా డీహైడ్రేషన్, రేడియేషన్, కాలుష్యం వంటివి ఉండగా, బ్లాక్-ఐ ప్రధాన కారణాలుగా గాయాలు, ప్రమాదాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

కేశ నాళికలు, లేదా చిన్న రక్త నాళాలు పగిలిపోవడం మరియు చర్మం కింద రక్తం బయటకు రావడం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది.

బ్లాక్- ఐ కారణాలు, చికిత్సా విధానాలు

ఈ బ్లాక్-ఐ సమస్యకి గల మరో పేరు "షైనర్." దీన్ని సాంకేతికంగా పెరిఆర్బిటల్ హెమటోమా అని వ్యవహరించడం జరుగుతుంది.

కంటి చుట్టూ ఉండే చర్మ భాగంలో ద్రవ నిక్షేపాలు పేరుకోవడం, కమిలినట్లుగా వాపుతో కూడుకుని ఉబ్బినట్లు కనిపిస్తుంది. క్రమంగా కంటిని సైతం తెరవడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రభావం కంటి చూపు మీద కూడా పడుతుంది. విజన్ తాత్కాలికంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కంటి చుట్టూ నొప్పిగా అనిపించడంతోపాటుగా, తలనొప్పి అదనంగా ఉంటుంది.

కంటి లోపల కూడా రక్తస్రావం ఉండే అవకాశాలు ఉన్న కారణంగా, వైద్యుల పర్యవేక్షణ అవసరంగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి తీవ్రమైతే దృష్టి సమస్యలకు దారితీస్తుంది.

క్రమంగా కంటికి తీవ్ర నష్టం కలిగించవచ్చు.

బ్లాక్- ఐ కారణాలు, చికిత్సా విధానాలు:

కారణాలు :

కొట్లాటలు, కింద పడడం, రోడ్డు లేదా ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాలు, అసంకల్పిత ప్రమాదాలు మొదలైనవి ఈ సమస్యకు గల సాధారణ కారణాలుగా ఉంటాయి.

సాధారణ కారణాలు :

1. ముఖంపై వ్యక్తి దాడికి పాల్పడటం మూలంగా ఈ బ్లాక్ ఐ సమస్య తలెత్తవచ్చు. అంతేకాకుండా, ఒక బంతి, ఒక పిడికిలి, ఒక తలుపు, లేదా మరేదైనా ఇతర అంశం కూడా కావచ్చు.

2. కొన్ని రకాల దంత లేదా కాస్మెటిక్ సర్జరీ తర్వాత కూడా ఈ బ్లాక్ ఐ సమస్య తలెత్తవచ్చు. క్రమంగా ఇది చాలా రోజుల వరకు కొనసాగవచ్చు. ఒక్కోసారి నొప్పి, వాపు కూడా కొనసాగుతుంది.

3. ఎన్నటికీ బ్లాక్-ఐ సమస్య, దానికదే ప్రమాదకరమైనది కాదు, మరియు బ్యాలెన్సింగ్ కోల్పోయి, కంటి చుట్టూ కమిలిపోవడం మూలాన జరుగుతుంది. అయితే ఒక్కోసారి అది తీవ్ర పరిస్థితులకి సంకేతం కావచ్చు.

బ్లాక్- ఐ కారణాలు, చికిత్సా విధానాలు

4. రెండు కళ్ళ చుట్టూ కమిలిన గాయాలు ఉన్న పరిస్థితిని రాకూన్ కళ్ళుగా వ్యవహరించడం జరుగుతుంది. పుర్రె ఫ్రాక్చర్(విరగడం) కావడం లేదా మరేదైనా ఇతర తలగాయాల మూలంగా ఇది సంభవించవచ్చు. దీనికి అత్యవసర వైద్య సహాయం అవసరం అవుతుంది.

ప్రభావాలు మరియు లక్షణాలు :

1. ఒక వ్యక్తి కంటి చుట్టూ ఉన్న ప్రాంతానికి గాయంతగిలితే, అవి వాపుకు దారితీస్తాయి.

2. వాపు వ్యాపిస్తున్న కొద్దీ చర్మం రంగు మారడం జరుగుతుంది. మొదట అది ఎర్రగా ఉంటుంది, అప్పుడు అది క్రమంగా ముదురు నీలం, లోతైన ఊదారంగు, మరియు నలుపు రంగుకి మారుతుంది.

3. నొప్పి నిరంతరంగా ఉండవచ్చు లేదా ఎవరైనా ప్రభావిత ప్రాంతాన్ని తాకినప్పుడు మాత్రమే అనుభూతి చెందేలా ఉండవచ్చు.

4. ఒక్కోసారి కంటి మీద ఎర్రటి ప్యాచ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది రక్తస్రావము కారణంగా లేదా కంటి కింది రక్తనాళాలు విచ్చిన్నమవడం కారణంగా సంభవిస్తుంది. ఇది సాధారణంగా 2 నుండి 3 వారాల తరువాత దానికదే తగ్గిపోతుంది. దీనికి వైద్యంగా కంటి చుక్కలు, యాంటీ బయాటిక్స్, కంటి చుట్టూ వినియోగించగల లేపనాలను సూచించవచ్చు.

బ్లాక్- ఐ కారణాలు, చికిత్సా విధానాలు

5. కొద్ది రోజులలోనే వాపు తగ్గుముఖం పడుతుంది. క్రమంగా నొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ముదురు రంగులో ఉన్న ప్రాంతం కొన్ని రోజుల వ్యవధిలోనే లేత రంగుకి మారుతుంది. అనగా ముదురు నీలం, ఊదారంగు, లేదా నలుపు నుండి పసుపు ఆకుపచ్చ వరకు పారదర్శకంగా మారుతుంది.

6. దృష్టి సమస్యలు, సాధారణంగా అస్పష్టంగా, కలగవచ్చు.

7. బ్లాక్-ఐ సమస్య, సాధారణంగా 1 నుండి 2 వారాల్లోపు అదృశ్యమవుతుంది, మరియు ఇది సాధారణంగా వైద్య సహాయం అవసరం లేనిదిగా ఉంటుంది., అత్యవసర పరిస్థితుల్లో, లేదా నొప్పి తీవ్రమవుతుందని భావిస్తే తప్ప.

కానీ ఏది ఏమైనా సమస్య ప్రారంభంలోనే వైద్యుని సంప్రదించడం మూలంగా, పరిస్థితి తీవ్రతరం కాకుండా నివారణా చర్యలు చేపట్టవచ్చు. సమస్య తీవ్రతను ఉద్దేశించి, వైద్యులు యాంటీ బయాటిక్స్, పర్యవేక్షణ, ఆహార ప్రణాళిక, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు లేపనాలను సూచించవచ్చు. కావున నిర్లక్ష్యం తగదు. ఒకోసారి ప్రమాదాలు జరుగకపోయినా, కన్ను వాపుకు గురవడం లేదా నీరు కారడం, రక్తనాళాలు ఉబ్బినట్లు కనపడడం, లేదా రక్తం కారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే వైద్య సహాయానికి పూనుకోవాలి. మరియు చీము పదార్ధాలకు దూరంగా ఉండవలసినదిగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: eye నేత్రాలు
English summary

black eye causes, symptoms and treatment

There are several reasons for black eye. One if the common causes of black eye is due to the blow to the nose.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more