For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే హుక్కా

|

చలనచిత్రాలలో, లేదా పురాతన చిత్రాలలో ఒక పొడవైన పైపును పట్టుకొని గట్టిగా పొగ పీల్చడం చూస్తూనే ఉంటాం. సిగరెట్లకు సాంప్రదాయక రూపంగా, హుక్కాను అభివర్ణించడం జరుగుతుంటుంది. మరియు ఎన్ని సంవత్సరాలైనా దానిపట్ల ప్రజాదరణ పెరుగుతూనే ఉంది కానీ, తగ్గడంలేదు. దీనికంటూ ప్రత్యేకించిన ప్రయోజనాలైతే లేవు కానీ, మనిషిని పూర్తిగా వ్యసనపరునిగా మార్చి, క్రమక్రమంగా ఆయువును తగ్గించడంలో మాత్రం హుక్కా ప్రభావవంతంగా ఉంటుందని గంటాపధంగా చెప్పవచ్చు.

అనేకరకాల ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతూ ఉన్న హుక్కా, అనధికారికంగా ధూమపాన ప్రియులకు అభిమాన వస్తువుగా ఉందని తెలిసిన విషయమే. ప్రాథమికంగా, హుక్కా అనేది ధూమపానం కోసం వినియోగించే, పొగాకుతో నింపిన పైపు. ఇది సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ హుక్కాకు జోడించబడి ఒక నీటి పాత్ర, మరియు ఒక పొగాకు పాత్ర ఉంటాయి. అంతేకాకుండా సౌకర్యానికి అనుగుణంగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పైపులను హుక్కాను ఉపయోగించడానికి అనువుగా ఏర్పాటు చేయబడి ఉంటాయి.

హుక్కా ఉపయోగించడానికి పొగాకులో తరచుగా ఫ్రూట్ పల్ప్, తేనె, కొబ్బరి, కొన్ని రకాల ఫ్రూట్ ఫ్లేవర్లు, పుదీనా, లేదా కాఫీ వంటి అదనపు దినుసులను జోడించడం జరుగుతుంటుంది. ఇలా హుక్కాలలో పొగాకుతో పాటుగా ఫ్లేవర్స్ జోడించడమనేది, పెద్ద వయస్కులకు ప్రీతిపాత్రమైన అంశాలలో ఒకటిగా ఉంటుంది. అయితే, ప్రజలు ఈ హుక్కాతో కూడిన సంతోషం మరియు ఆనందం నీడలో అనారోగ్య సమస్యలను పట్టించుకోకపోవచ్చు. కానీ, ఈ హుక్కా అమృతం చాటున దాగి ఉండే కాలకూట విషం. మనిషిని నెమ్మదిగా అదఃపాతాళానికి తీసుకునిపోయి, పూర్తిగా సమూలంగా నాశనం చేయగలిగే ప్రాణాంతక వ్యసనం.

400 సంవత్సరాలకన్నా ముందు నుండి, ఈ హుక్కా ఉపయోగంలో ఉన్న కారణంగా దీని పట్ల సానుకూలత ఎక్కువగా కొనసాగుతూ వచ్చింది. పైగా పొగాకు ప్రభావాన్ని, ఇన్ఫెక్షన్లను నీరు తగ్గిస్తుందని నమ్మబడిన కారణంగా జనాదరణ పెరుగుతూ వచ్చింది. కానీ తరువాతి పరిశోధనల్లో, అది అత్యంత ప్రమాదకర స్థాయిలకు చేరుకుందని తేలింది. హుక్కా పీల్చడం మీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపగలదు ? మరియు దీనివలన తలెత్తే దుష్ప్రభావాల గురించిన మరిన్ని వివరాలను ఇక్కడ పొందుపరచబడ్డాయి.

హుక్కాలో దాగి ఉన్న విషాలు :

హుక్కాలలో చల్లని నీటిని ఉపయోగిస్తున్నప్పటికీ, అది మీ ఊపిరితిత్తులపై కఠినమైన ప్రభావాన్ని చూపుతుంది. పొగాకు మరియు దాని నుండి వెలువడే పొగ దిగువ పొందుపరచబడిన విషతుల్యాలను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది.

• పోలోనియం 210, ఇది ఒక రేడియోధార్మిక ఐసోటోప్ గా ఉంటుంది.

• కార్బన్ మోనాక్సైడ్

• తారు

• ఆర్సెనిక్

• ఎసిటాల్డిహైడ్

• కోబాల్ట్

• కాడ్మియం

• నికెల్

• ఫార్మాల్డిహైడ్

• లెడ్

• అక్రోలీన్

• క్రోమియం

హుక్కా పీల్చడం వలన తలెత్తే దుష్ప్రభావాలు :

హుక్కాను నేరుగా పీల్చడం మాత్రమే కాకుండా, హుక్కా పొగను వేరే ఇతర రూపాలలో పీల్చినా కూడా మీ శరీరం ప్రభావితమవుతుంది. అనగా ప్రత్యక్ష దూమపానమే కాదు, పరోక్ష ధూమపానం కూడా మీ శరీరానికి హాని కలిగించవచ్చు. సిగరెట్ పొగ కన్నా, హుక్కా పీల్చడం సురక్షితమైనదని ప్రజలు తరచుగా నమ్ముతారు. కానీ అది పచ్చి అబద్దం. వాస్తవానికి, హుక్కా పొగ, సిగరెట్ కన్నా ప్రమాదకరం.

హుక్కా పీల్చడానికి సంబంధించిన కొన్ని సాధారణ దుష్ప్రభావాలు క్రింది విధంగా ఉన్నాయి:

• అకాల వృద్ధాప్యం, ఎందుకంటే పొగతాగడం మీ చర్మానికి చేరుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించి, చారలు, మంగు, నల్లటి మచ్చలు మరియు ముడుతలు ఏర్పడడానికి కారణంగామారి వయస్సు పైబడినట్లు కనిపించేలా చేస్తుంది.

• మోనోన్యూక్లియోసిస్ మరియు ఓరల్ హెర్పిస్ వంటి అంటు వ్యాధుల ప్రమాద తీవ్రతలను పెంచవచ్చు.

• ఓరల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్ వంటి క్యాన్సర్ ప్రమాదాలను పెంచవచ్చు.

• బ్రాంకైటిస్ మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధుల వంటి ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యాలకు కారణంగా మారుతుంది.

• గుండె జబ్బులు మరియు గుండెపోటు వంటి తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది.

చివరిగా ...

చివరిగా అంటే ఏమీ లేదు, హుక్కాకి బానిస అవడమనేది జీవితానికి చివరి రోజులను తీసుకునివస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సిగరెట్ కన్నా, హుక్కా సురక్షితమన్న అపోహలే సగం దీనికి అలవాటు పడడానికిగల ప్రధాన కారణాలుగా వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. శాస్త్రీయ ఆధారాల ప్రకారం, హుక్కా పీల్చడం మీ ఆరోగ్యం మరియు శ్రేష్టతకు పూర్తిస్థాయిలో ప్రమాదకరమని తెలుస్తోంది. కాబట్టి, మీరు హుక్కా అనుసరించాలని కోరుకుంటున్నవారైతే, అది మీ ఆరోగ్యం పట్ల చూపే ప్రతికూల ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకుని అనుసరించండి. పైగా వీటి పట్ల ఆకర్షితులయయ్యేందుకు, అనేకమంది హుక్కా నిర్వాహకులు హానికర మత్తు పదార్ధాలను జోడిస్తున్న విషయం విదితమే.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Health Risks Of Smoking Hookahs

Hookah smoke contains many of the same harmful chemicals in traditional cigarette smoke. It is a common misconception that smoking from a hookah removes nicotine and other toxins from the tobacco. Smoking hookah can cause heart disease, bronchitis, cancer, premature ageing, infections and various other illnesses.
Story first published: Friday, May 17, 2019, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more