Just In
- 45 min ago
వేసవిలో పుచ్చకాయ రసం తాగితే శరీరానికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా?
- 2 hrs ago
వెరైటీగా చికెన్ టేస్ట్ చూడాలనుకుంటే చికెన్ టిక్కా మసాలా రిసిపి ట్రై చేయండి..
- 4 hrs ago
నోటి దుర్వాసనకు చెక్ పెట్టే ఆహారాలు ఇవి..
- 5 hrs ago
Chaitra Navaratri 2021: ఛైత్ర నవరాత్రుల పూజా పద్ధతులేంటో తెలుసుకుందామా...
Don't Miss
- Movies
యాక్టర్ హేమ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరి జోరుగా ప్రచారం
- News
నో మాస్క్ నో ఎంట్రీ: మసీదులోకి అనుమతి లేదు..
- Sports
SRH vs RCB: బెంగళూరుతో హైదరాబాద్ ఢీ.. బోణీపై కన్నేసిన సన్రైజర్స్! కేన్ మామ డౌటే! తుది జట్లు ఇవే!
- Finance
చైనా, పాక్ సహా పోల్చినా.. మూడు వారాల్లో రూపాయి భారీ పతనం, ఎందుకంటే?
- Automobiles
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భోజనం చేసిన ఎంత సమయం తర్వాత నీళ్ళు తాగాలి?
మనం మన ఆహారంతోపాటుగా అనుసరించే అంశాలలో నీరు తాగడం కూడా ఒకటి. అంతేకాదు, ఇది మనలో అనేక మందికి తప్పనిసరి అలవాటుగా ఉంటుంది. అవునా ? ఆహారం సులభంగా కడుపులోకి వెళ్ళాలన్న ఆలోచనతో నీరు తరచుగా తీసుకోవడం జరుగుతుంటుంది. కొందరైతే ఆహారం కన్నా అధికంగా నీటిని తీసుకుంటూ ఉంటారు. లేనిచో దాహంతో కూడిన అనుభూతికి లోనవుతూ ఉంటారు.
నీరు ఎంత గొప్పదయినప్పటికీ, జీవితంలో మనకు అందుబాటులో ఉండే అమృతం వలె ఉన్నప్పటికీ, రోజులో తరచుగా తీసుకుంటున్నాకూడా, భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువగా వినియోగింపబడాలని గుర్తుంచుకోండి. కొందరైతే ఆహారం పూర్తిగా తీసుకున్న తర్వాత, ఒకేసారి నీటిని స్వీకరిస్తుంటారు. కానీ ఎంత సమయం తర్వాత తీసుకోవాలి, మరియు ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు కూడా ప్రామాణికంగా ఉంటాయి.
మొదట్లో ఈ నియమాన్ని అనుసరించడం కొంచెం అసాధ్యంగానే అనిపించవచ్చు, కానీ అలవాటుగా చేయడం మొదలుపెడితే క్రమంగా సులభమవుతుంది. ఇవన్నీ చదివిన తరువాత, మీ తల తిరిగే ప్రశ్న ఒకటి మెదులుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగవచ్చా? లేక కొంత సమయం వేచి ఉండాలా ? అయితే ఎందుకు ?
ఆహారం తీసుకున్న తర్వాత, తక్షణమే నీరు ఎందుకు త్రాగకూడదు?
ముందుగా, ఆహారం తరువాత మాత్రమే నీటిని పరిహరించాలి అన్నది తప్పు అని గ్రహించాలి. వాస్తవానికి ఇది మూడు విధాల ప్రక్రియగా ఉంటుంది. ఆహారం ముందు, ఆహారం తీసుకునే సమయంలో మరియు ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తీసుకోవలసి ఉంటుంది. అది కూడా కొద్ది మొత్తాలలో.
ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తీసుకునేందుకు కనీసం అరగంట వేచి ఉండాలని గుర్తుంచుకోండి. మరియు గ్లాసును మించిన మోతాదు లేకుండా చూసుకోండి. ఎందుకంటే, మనం మన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది. ఆహారం, మన అన్నవాహిక నుండి జీర్ణాశయానికి, ఆతర్వాత మన పెద్దపేగుకు చేరి, చివరకు మన శరీరం నుంచి బయటకు విసర్జించబడుతుంది.
మన దేహం ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో ఉత్పత్తి అయ్యే ఒక నిర్ధిష్ట ద్రవం, ఘననిష్పత్తిలో ఉంటుంది. ఆహారం తిన్న తరువాత నేరుగా నీటిని సేవించినప్పుడు ఈ సంతులనం అంతరాయానికి గురవుతుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి తీసుకునే సహజ సమయాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటుగా, సాధారణం కన్నా అధిక క్యాలరీల వినియోగానికి దారితీస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
ఆహారం మరియు నీటిని వినియోగించే సమయంలో, కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలని సిఫార్సు చేయబడుతుంది. ఈ 30 నిముషాలలో మన శరీరం జీర్ణక్రియలలోని తరువాతి దశలోనికి ప్రవేశిస్తాయి. ఆహారంతో పాటుగా నీరు అధికం తీసుకోవడం మూలంగా జీర్ణక్రియ ప్రక్రియలకి అంతరాయం ఉంటుంది. కానీ కాస్త వ్యవధిని ఇచ్చిన తర్వాత నీటిని కొద్ది మొత్తాలలో తీసుకోవడం ద్వారా, జీర్ణక్రియలు సులభంగా జరిగేందుకు వీలవుతుంది.
ఆహారం తీసుకున్న తర్వాత నేరుగా నీటిని తాగడం మూలంగా జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైన జీర్ణ రసాలు మరియు ఎంజైములు కూడా కరిగింపబడుతాయి. క్రమంగా ఈ ఎంజైములు తక్కువగా ఉన్న కారణంగా మన శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది. క్రమంగా గుండెల్లో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఒక్కోసారి తీసుకునే ఆహారాన్ని అనుసరించి తీవ్రతరం కూడా కావొచ్చు.
ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో, కొన్ని అవసరమైన పోషకాలు కూడా శరీరం ద్వారా శోషించబడతాయి; అయితే, భోజనం తరువాత నేరుగా నీటిని తాగడం మూలంగా, పోషకాలు శోషించుకునే ఆస్కారం లేక, నేరుగా జీర్ణవ్యవస్థకు తరలించబడుతాయి. క్రమంగా మీరు ఎంత పోషకభరితమైన ఆహారం తీసుకున్నా కూడా, సరైన పోషకాలు మీ శరీరానికి అందకుండా జీర్ణమైపోతాయి.
భోజనం తర్వాత నేరుగా నీటిని తీసుకునే అలవాటు కారణంగా, ఈ ప్రక్రియ జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా, మనం తీసుకునే ఆహారంలోని నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. అన్నిటిని మించి, నీటికి సహజ సిద్దంగా ఆహార ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. క్రమంగా మనం వినియోగించే అన్నిరకాల ఆహారాలకి చల్లదనాన్ని జోడిస్తుంది. కావున అతిశీతల నీటిని ఆహారం సమయంలో వినియోగించడం కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.
ఇది మన శరీరాలకి నిజంగా ప్రతికూలమైన అంశంగా ఉంటూ, స్థూల కాయానికి కూడా దారితీస్తుందని చెప్పబడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను ప్రధానంగా ప్రభావితం చేయడం ద్వారా, జీర్ణ వ్యవస్థలో మిగిలిపోయిన జీర్ణంకాని ఆహారం ద్వారా అదనపు కొవ్వు నిక్షేపాలను పెంచడం ద్వారా ఊబకాయానికి దారితీయవచ్చు. మన శరీరంలో పేరుకుని ఉండే జీర్ణంకాని ఆహారం నుండి వెలువడే గ్లూకోజ్, కొవ్వుగా మారుతుంది. క్రమంగా మన శరీరంలో స్థానం ఏర్పరచుకుంటూ ఉంటుంది.
దీని మూలంగా మన శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు పెరగడమే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా పెరగడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మూలంగా మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులకు దారితీస్తుంది.
ఊబకాయం మరియు మధుమేహం మాత్రమే కాకుండా, ఆహారం తరువాత నేరుగా నీటిని తీసుకోవడం ద్వారా, యూరిక్ యాసిడ్ స్థాయిలు, ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్, వి.ఎల్.డి.ఎల్ మరియు ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతాయి.

1. యూరిక్ ఆమ్లం :
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం మూలాన మోకాళ్ల నొప్పులు, భుజం నొప్పులు కలగడంతో పాటుగా, మణికట్టు కీళ్లలో కూడా నొప్పి పెరిగేందుకు కారణంగా తయారవుతుంది. ఇది చీలమండలు, మోచేతులు, మణికట్టు వంటి ప్రదేశాలలో వాపుకు దారితీస్తుంది.

2. ఎల్ డిఎల్ (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు, చెడు కొలెస్ట్రాల్) :
దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని కూడా వ్యవహరిస్తారు. పైన చెప్పిన విధంగా మన శరీరంలోని జీర్ణంకాని ఆహారం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి దారితీసే ఫ్యాట్ గా మారుతుంది.
అంతేకాక, ఎల్.డీ.ఎల్ కొలెస్టరాల్ స్థాయిలు పెరిగిననప్పుడు, ధమనులు, సిరల మద్యలో కొవ్వు నిక్షేపాలు పేరుకునిపోవడం ద్వారా గుండెకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. క్రమంగా ఈ పరిస్థితి శరీరంలో రక్తపోటును పెంచుతుంది, ఇది తరచుగా జరుగుతున్న ఎడల, గుండెపోటుకు కూడా దారితీస్తుంది.

3. వి.ఎల్.డి.ఎల్ (అతి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు):
ఎల్.డీ.ఎల్ కన్నా అధ్వాన్నమైన చెడు కొలెస్ట్రాల్ వి.ఎల్.డి.ఎల్. మన శరీరంలో వి.ఎల్.డి.ఎల్, జీర్ణ క్రియలు సక్రమంగా లేకపోవడం మూలాన పెరుగుతుంది. మరియు దీర్ఘకాలికంగా వి.ఎల్.డి.ఎల్ స్థాయిలు పెరిగుతున్న ఎడల, అది ప్రాణాంతకం కావొచ్చు.

4. ట్రైగ్లిసరైడ్స్:
జీర్ణంకాని ఆహార నిక్షేపాలు పేరుకుని పోవడం, భోజనం తర్వాత నేరుగా నీరు సేవించడం మూలాన ట్రైగ్లిసరాయిడ్స్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. ట్రైగ్లిసరాయిడ్స్ అనేవి ప్రాథమికంగా సహజ కొవ్వులుగా, మరియు నూనెల్లో ప్రధానమైన భాగాలుగా ఉంటాయి.
అందువలన, అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గుండె ప్రమాదాలకు దారితీయవచ్చు మరియు అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మెదడు లేదా గుండెకు పూర్తిగా రక్తసరఫరాను ఆపివేసి, ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.
అంతేకాక, కొంత మంది ఆహారం తిన్న తరువాత ఐస్ కోల్డ్ వాటర్ త్రాగడానికి మొగ్గు చూపుతారు, ఇది జీర్ణ క్రియలను పూర్తిగా చంపేస్తుంది. ఇది మన శరీరంలో జీర్ణంకాని ఆహారం పేరుకుపోవడం, గుండె వైఫల్యం, మధుమేహం మరియు ఊబకాయం వంటి తీవ్ర పరిస్థితులకు కారణంగా మారుతుంది.
అందువల్ల, మన జీవితంలో నీరు ఒక ముఖ్యమైన భాగంగానే కాకుండా కొన్ని పరిమితులతో కూడుకుని ఉంటుందని గుర్తుంచుకోవలసి ఉంటుంది. మరియు రోజులో 8 లీటర్ల కంటే తక్కువ నీటిని సేవించరాదని చెప్పబడుతుంది. అయితే దేనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయని మరచిపోకూడదు.
భోజనం ముందు లేదా తరువాత సమయాలలో తప్ప, మిగిలిన సమయమంతా మీకు అనువుగా ఉన్న ప్రతి సందర్భంలోనూ నీటిని తీసుకోవచ్చును. తరచుగా నీటిని తీసుకోవడం మూలంగా డీహైడ్రేషన్ స్థాయిలు లేకుండా చేసి, భోజనం సమయంలో నీటిని పరిమితం చేసేలా కూడా ప్రోత్సహిస్తుంది. కానీ రోజులో నీటిని తక్కువ మొత్తంలో సేవించేవారు, భోజనం సమయంలో అధిక నీటిని కోరుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మొత్తం జీర్ణ వ్యవస్థను శిథిలం చేస్తూ, శరీర జీవక్రియల మీదనే తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, జీర్ణక్రియ వ్యవస్థలను నిర్వహించడం కూడా అంత ముఖ్యమైనదని గుర్తుంచుకోండి.
అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైన జీర్ణక్రియ వ్యవస్థ సంతోషకర జీవితానికి నేరుగా ముడిపడి ఉంటుంది. కావున కనీసం కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని సజావుగా నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. మన జీవితంలో అతి ముఖ్యమైన విషయమైన ఆరోగ్యం విషయంలో అశ్రద్ద తగదు. ఆరోగ్యం పోయాక, ఎన్ని ఇతరత్రా అంశాలు ఉన్నా వ్యర్ధమే అని గుర్తుంచుకోండి.
ఈ వ్యాసం ద్వారా, అన్నివేళలా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలని మరియు సాధ్యమైనంత వరకు నీటిని తాగాలని మా బోల్డ్స్కై టీం సూచిస్తుంది. క్రమంగా భోజనం విషయంలో, ఆహారం తీసుకున్న ముప్పై నిమిషాల తరువాత, నీరు తాగేలా అలవాటు చేసుకోండి. ఈలోపు అవసరమైతే ఒక సిప్ తీసుకోండి.
ఏ అలవాటు కూడా అంత తేలికగా వెంటనే అలవడడం సాధ్యం కాదు. కానీ ఆరోగ్యం దృష్ట్యా ఆలోచన చేస్తే, ఒక క్రమశిక్షణ మరియు పట్టుదలమీద దేన్నైనా సాధించవచ్చునని గుర్తుంచుకోండి. మీరు తీసుకునే ఈ చిన్నఅడుగును ఒక అలవాటుగా చేసుకోవడం ద్వారా మీకు మంచి జీర్ణ వ్యవస్థను అందివ్వగలుగుతుంది. కాబట్టి, నీటిని తరచుగా తాగండి, కేవలం ఆహారం తీసుకునే సమయంలో మాత్రమే కొన్ని జాగ్రత్తలు అనుసరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.