For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ గ్యాస్: కారణాలు, లక్షణాలు & హోం రెమెడీస్

|

మీరు తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా ? లేదా మీరు ఎక్కువగా ఆహారం తీసుకున్న తర్వాత గ్యాస్ సమస్య తలెత్తుతుందా ? ఈ సమస్య బాధాకరమైనదిగా లేదా తేలికపాటిదిగా ఉండొచ్చు. ఇటువంటి గ్యాస్ సమస్యలు ఎప్పుడైనా, ఏరూపంలో అయినా తలెత్తవచ్చు. క్రమంగా రోజులో సుమారుగా 20 మార్లు, ప్రజలు అపాన వాయువులు లేదా త్రేన్పులను విడుదల చేస్తుంటారని ఒక అంచనా. నోటి ద్వారా గ్యాస్ విడుదల అయినప్పుడు దానిని త్రేన్పులు, లేదా త్రేపులు అని వ్యవహరిస్తుంటారు., మరియు మలద్వారం గుండా జీర్ణ వ్యవస్థ నుండి విడుదల కాబడే వాయువును అపాన వాయువుగా పిలవబడుతుంది.

అసలు పొట్టలో గ్యాస్ ఏర్పడడానికి కారణాలేంటి ?

కడుపులో వాయువు చేరడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. మొదటిది ఆహారం జీర్ణమయ్యే సమయంలో జీర్ణాశయములో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు హైడ్రోజన్ వంటి వాయువులు ఏర్పడడం జరుగుతుంటుంది. ఇక రెండవ కారణం ఆహారం తీసుకునేటప్పుడు (తినడం లేదా తాగడం) తరచుగా గాలిని మింగడం కారణంగా కూడా శరీరంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ పెరగడానికి దారితీసి, అపాన వాయువు సమస్యకు దారితీస్తుంది.

Stomach Gas

తినేటప్పుడు లేదా తాగే సమయంలో ఎక్కువగా గాలిని మింగడం వల్ల అదనంగా అపాన వాయువులు ఏర్పడడం జరుగుతుంది. క్రమంగా తరచుగా గ్యాస్ పాస్ అవడానికి కారణమవుతుంది. హార్డ్ కాండీలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం, త్వరత్వరగా తినడం, పొగ తాగడం (ధూమపానం) మరియు బబుల్-గమ్ అధికంగా నమలడం వలన కూడా పొట్టలో గ్యాస్ ఏర్పడవచ్చు. ఇవన్నీ తెలీకుండా కడుపులో వాయువులు పెరగడానికి కారణమవుతాయి.

కొన్ని రకాల ఆహారాలు కూడా కడుపులో వాయువులను పెంచడంలో కీలకపాత్రను పోషిస్తాయి. ఈ ఆహారాలు వరుసగా బ్రసెల్స్, మొలకెత్తిన గింజలు, క్యాబేజీ, బీన్స్, అస్సరాగస్, బ్రోకోలీ, శెనగపప్పు, ఆపిల్, పండ్ల రసాలు, కృత్రిమ స్వీటెనర్లు, పాలు, బ్రెడ్, ఐస్ క్రీం, గోధుమలు, బంగాళాదుంపలు, నూడుల్స్, బఠానీలు మొదలైనవి.

ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరియు మీరు గ్యాస్ విడుదల చేసిన సమయంలో అసహ్యకరమైన వాసనకు దారితీస్తుంది.

అపాన వాయువు లక్షణాలు:

• కడుపు నొప్పి

• మలద్వారం నుండి తరచుగా వాయువు

• కడుపు ఉబ్బరం

• ఛాతీ నొప్పి

• జీర్ణాశయ వాయువుతో సంబంధం ఉన్న పొత్తికడుపు (డిస్టెన్షన్ ) పరిమాణం పెరగడం

కింద పేర్కొన్న కొన్ని అంతర్గత పరిస్థితులు కూడా కడుపులో వాయువులు పెరిగేందుకు కారణంగా ఉంటాయి :

• మలబద్ధకం

• ప్రేగు ప్రకోపాల సమస్య

• లాక్టోజ్ రియాక్షన్

• గ్యాస్ట్రోఎంటరిటిస్

• మధుమేహం

• క్రోన్ వ్యాధి

• సిలియక్ వ్యాధి

• అల్సరేటివ్ కొలిటిస్

• ఆహారం తీసుకోవడంలో సమస్యలు

• జీవన శైలి

• తాపజనక ప్రేగు వ్యాధి

• గ్యాస్ట్రోఎసోఫగీల్ రిఫ్లక్స్ వ్యాధి

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి :

ఈ అపాన వాయువు సమస్య నిరంతరంగా, లేదా తరచుగా మరియు తీవ్రంగా ఉన్న పక్షంలో, మరియు ప్రేగు పనితీరులో మార్పు, మలబద్ధకం, బరువు తగ్గడం, డయేరియా, వాంతులు, పొత్తికడుపులో తిమ్మిర్లు, గుండెలో మంట, మలంలో రక్తం పడడం, ఛాతీ నొప్పి వంటి ఇతర లక్షణాలను తరచుగా ఎదుర్కొంటున్న ఎడల తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలని గుర్తుంచుకోండి. అపాన వాయువు సంబంధిత సమస్య నిర్ధారణ కోసం, వైద్యులు మీ లక్షణాల గురించిన ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకుంటారు. అవసరం దృష్ట్యా శారీరిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

అపాన వాయువు సమస్య గురించిన నిర్ధారణ ప్రకారం, ఉదరానికి ఎక్స్-రే, అప్పర్ జిఐ సీరిస్, సిటి స్కాన్, బ్రీత్ టెస్ట్, మలం టెస్ట్, మరియు రక్త పరీక్షల వంటి పరీక్షలు నిర్వహించవలసి రావొచ్చు. ఒకవేళ అంతర్లీన స్థితిలో ఉన్నట్లయితే, సమస్య చికిత్స కొరకు ఔషధాలను సూచించవచ్చు. క్రమంగా మీ రోజువారీ ఆహారపు అలవాట్లను ట్రాక్ చేయడం కొరకు ఫుడ్ డైరీ అనుసరించమని కూడా వైద్యులు సలహా ఇవ్వవచ్చు, క్రమంగా గ్యాస్ సంబంధిత ఆహార పదార్ధాలను దూరం చేయడానికి ఈ పద్దతి సహాయపడుతుంది. ఈ అపాన వాయువు చికిత్సా సమయంలో అరటి పండ్లు, బంగాళా దుంపలు మరియు బియ్యం వంటి సులభంగా జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్లను తీసుకోవలసి ఉంటుంది. అపాన వాయువులకు కారణమయ్యే అవకాశం ఉన్న పీచు ఆహారాలను తీసుకోవడం తగ్గించవలసి ఉంటుంది.

ఆహారాన్ని మింగే ముందు సరిగ్గా నమలడం ముఖ్యం. ఈ పద్దతి వేగంగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. జీర్ణ ప్రక్రియలో భాగంగా, ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కాస్త నడకకు పూనుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

ఆల్ఫా-గాలక్టోసిడసే మరియు యాంటాసిడ్స్ వంటి ప్రత్యామ్నాయ ఔషధాలు ఆహార పదార్థాలలోని కార్బోహైడ్రేట్లను కరిగించడంలో ఉత్తమంగా సహాయపడగలవు. మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందవ్వగలవు. కానీ వీటి మీదనే పూర్తిస్థాయిలో ఆధారపడడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఒకవేళ మీకు లాక్టోజ్ సరిపడని పక్షంలో పాల పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నించాలి. అపాన వాయువు చికిత్సలో ఎక్కువగా సహజ సిద్దమైన గృహ నివారణలే ప్రత్యామ్నాయంగా ఉండగలవని గుర్తుంచుకోండి.

1. వాము :

1. వాము :

వామును అనేక ఔషధ ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగించడం జరుగుతుంటుంది. ఈ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉంటుంది. క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టడం దృష్ట్యా, 3-4 టేబుల్ స్పూన్ల వామును అర కప్పు మరుగుతున్న నీటికి జోడించి., కాసేపాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి తాగడం మంచిది.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్., జీర్ణాశయం నుంచి వాయువులను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది గ్యాస్ నుండి తక్షణ ఉపశమనాన్ని అందించడమే కాకుండా అజీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసు వెచ్చని నీటికి జోడించి, ఆ మిశ్రమం చల్లారనిచ్చాక, సేవించండి. ఇది మీ జీర్ణక్రియలను సజావుగా సాగడంలో సహాయం చేస్తుంది.

3. పుదీనా :

3. పుదీనా :

పుదీనా గ్యాస్ట్రిక్ సమస్యల నివారణలో అద్భుతంగా పనిచేసే ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. మరియు ప్రేగు ప్రకోపాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఓదార్పునిస్తూ, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడగలదు. ఈ పుదీనా ఆకులను పచ్చిగా కూడా నమలవచ్చు. నీళ్లు మరిగించి అందులో కొన్ని పుదీనా ఆకులను కలపండి. 5 నిమిషాలపాటు అలాగే ఉంచి, అవసరమనుకుంటే ఒక స్పూన్ తేనెను కలుపుకుని సేవించండి.

4. దాల్చిన చెక్క :

4. దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క అపాన వాయువు సమస్య నుండి తక్షణ ఉపశమనాన్ని ఇవ్వగలిగే మరొక సహజ సిద్ద నివారణిగా ఉంటుంది. ఇది పొట్టను మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దాల్చిన చెక్క కడుపులోని యాసిడ్స్ ప్రభావాన్ని తగ్గించడంలో మాత్రమే కాకుండా, ప్రేగుల గోడల నుంచి పెప్సిన్ స్రావాన్ని తగ్గించడం ద్వారా, గ్యాస్ పెరుగుదలను అరికట్టవచ్చు. అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీస్పూన్ తేనెను ఒక కప్పు వెచ్చని పాలలో కలిపి, వడకట్టి తీసుకోండి. మీరు గ్యాస్ సమస్య తో బాధపడుతున్నఎడల ఈ చిట్కా ఉత్తమంగా పనిచేస్తుంది.

5. అల్లం :

5. అల్లం :

అల్లం అపాన వాయువు సమస్యను తగ్గించడంలో గొప్ప ఉపశమనంగా ఉండగలదు. ఎందుకంటే ఇది జీర్ణాశయ నాళానికి విశ్రాంతినిచ్చే జింజరాల్స్ మరియు షోగాఓల్స్ కలిగి ఉంటుంది. ఇది వాపును తగ్గించి జీర్ణక్రియలు సజావుగా సాగడంలో సహాయం చేస్తుంది. మీరు భోజనం చేసిన తర్వాత చిన్న మొత్తంలో తాజా అల్లాన్ని నమలవచ్చు. లేదా ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని, అరకప్పు మరుగుతున్న నీటికి కలిపి, 10 నిముషాల పాటు నానబెట్టిన తర్వాత సేవించండి. ఉత్తమ ఫలితాలకోసం రోజులో మూడు మార్లు అనుసరించండి.

6. సోంపు గింజలు :

6. సోంపు గింజలు :

సోంపు విత్తనాలు., అపాన వాయువును అరికట్టేందుకు సహాయపడే సహజ నివారణలలో ఒకటి. సోంపు విత్తనాలు జీర్ణక్రియకు సహాయంచేసే సమర్ధవంతమైన సమ్మేళనాలను కలిగివుంటాయి మరియు ఇవి కడుపులో వాయువు ఏర్పడకుండా నిరోధించగలవు. నీటిలో1 టేబుల్ స్పూన్ సోపు విత్తనాలను జోడించండి. 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉంచండి. తర్వాత, ఆ మిశ్రమాన్ని వడకట్టి సేవించండి.

7. నిమ్మ :

7. నిమ్మ :

ఒక గ్లాసు గోరు వెచ్చని లెమన్ వాటర్ ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం ఒక గొప్ప ఆరోగ్యకరమైన అలవాటుగా ఉంటుంది. నిమ్మ కడుపు నొప్పిని తగ్గించడంలో అత్యుత్తమంగా సహాయపడగలదు. ఎందుకంటే నిమ్మ, HCl ఆమ్లం (హైడ్రోక్లోరిక్ ఆమ్లం) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణంకాని ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు వెచ్చని నీటికి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం జోడించి, భోజనం తర్వాత తీసుకోండి. లేదా ప్రతిరోజూ ఉదయం, గోరువెచ్చని నీటిలో తేనెతో కలిపి నిమ్మరసం సేవించండి. ఇది జీర్ణ క్రియలను సజావుగా సాగేలా చేయడంతో పాటుగా, అపాన వాయువులను నియంత్రించడంలో ఉత్తమంగా సహాయపడగలదు.

8. మజ్జిగ :

8. మజ్జిగ :

మజ్జిగలో ఉండే ఆమ్లాలు, పొట్టలోని చెడు బాక్టీరియాను తగ్గించడంలో సహాయపడగలదు. మరియు అపాన వాయువులను తగ్గిస్తూ, ఉత్తమమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ప్రకృతి సిద్దంగా మజ్జిగలో కడుపు ఉబ్బరాన్ని తగ్గించే లక్షణాలు ఉన్న కారణంగా, జీర్ణాశయం నుంచి వాయువులను తొలగించడంలో ఉత్తమంగా సహాయపడగలదు. ఒక గ్లాసు మజ్జిగలో నల్లఉప్పు, జీలకర్ర పొడి వేసి కలిపి, భోజనం తర్వాత తరచుగా తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది.

9. చామంతి టీ :

9. చామంతి టీ :

చామంతి టీ, కడుపు ఉబ్బరాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరం తగ్గించడంలో సహాయం చేస్తుంది. చామంతి టీ తరచుగా సేవించడం వలన, వాయువుల వలన కలిగే ఉదర తిమ్మిరి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో చామంతి-టీ బ్యాగ్ వేసి, 5 నిమిషాలు అలాగే ఉంచి, తరచుగా సేవించండి. ఉత్తమ ఫలితాల కోసం రోజుకొకసారి తీసుకోండి.

కడుపులో అపాన వాయువులను తగ్గించే ఆహార పదార్ధాలు :

ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఫంక్షనల్ గాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్స్ ప్రకారం, అపాన వాయువులను తగ్గించడంలో క్రింది ఆహారాలు సహాయపడగలవు.

• గుడ్లు

• స్కిన్ లెస్ మాంసం

• చేప

• జుచినీ మరియు పాలకూర

• రైస్

• టమోటో

• ద్రాక్ష

• పుచ్చకాయలు

• బెర్రీస్

• అవకాడోలు

అపాన వాయువులు తగ్గడానికి సూచించదగిన చిట్కాలు :

• ఒక మోతాదులోనే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

• నెమ్మదిగా ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగండి.

• కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వంటివాటికి దూరంగా ఉండండి.

• చ్యూయింగ్ గమ్స్ వంటివి తగ్గించండి. వీలయితే దూరంగా ఉండండి.

• చిక్కుళ్ళు, కాయధాన్యాలు వండే ముందు నీటిలో నానబెట్టడం ముఖ్యం.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Stomach Gas: Causes, Symptoms & Home Remedies

The medical term for releasing gas from the digestive system through the anus is known as flatulence. Swallowing too much air during eating or drinking causes excess flatulence. Certain foods like Brussels sprouts, cabbage, beans, etc., could cause excessive abdominal gas too. Limit the intake of fibrous foods that are likely to cause gas.
Desktop Bottom Promotion