Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
Vitamin D deficiency:వైజాగ్ 82%, హైదరాబాద్ 76% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.దీనికి కారణం, లక్షణాలు
హైదరాబాద్ లో 76% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతన్నారు.దీనికి కారణం, లక్షణాలు
Vitamin D deficiency: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ డి చాలా ముఖ్యం. ఈ విటమిన్ లోపం వల్ల శారీరక సమస్యలే కాదు, విటమిన్ డి లేకపోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తో పాటు మినరల్స్ (Minerals), విటమిన్స్ సక్రమంగా అందితేనే ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఏసీ కార్యాలయ ఉద్యోగులు పెరిగిపోవడంతో ప్రజలు డి విటమిన్ (Vitamin d) లోపంతో బాధపడుతున్నారు. భారతదేశంలోని 27 నగరాల్లో నిర్వహించిన 2.2 లక్షల మందికి పైగా పరీక్షల డేటా ప్రకారం, హైదరాబాద్ జనాభాలో 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు నివేధికలు వెల్లడిస్తున్నాయి. నివేదికల ప్రకారం హైదరాబాద్‌లో 76%, విశాఖపట్నంలో 82% మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. వైజాగ్‌లో జాతీయ సగటు కంటే డి విటమిన్ లోపం ఎక్కువగా ఉండగా, హైదరాబాద్‌లో 76% గా ఉంది.

విటమిన్ డి యొక్క అతి ముఖ్యమైన మూలం సూర్యరశ్మి అని మీకు తెలుసు, అటువంటి పరిస్థితిలో, నేటి జీవనశైలి కూడా విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం కావచ్చు. ఏడాది పొడవునా సూర్యుడు ప్రకాశించే దేశం మనది. ఇటువంటి ఉష్ణమండల దేశంలో, జనాభాలో నాలుగింట మూడు వంతుల మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. సూర్యరశ్మి విటమిన్ డి కి అతిపెద్ద ఆధారం. అయితే కొన్ని ఆహార పదార్థాలు కూడా తక్కువ మొత్తంలో విటమిన్ డిని అందిస్తాయి.

డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం
డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్, టాటా 1ఎంజి ల్యాబ్స్ గణాంకాల ప్రకారం దేశంలోని 27 నగరాల్లో 2.2 లక్షల మందిపై సర్వే నిర్వహించాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, జనాభాలో దాదాపు 76% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. మొత్తంగా 79 శాతం మంది పురుషులు వారి శరీరంలో విటమిన్ డి కావాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక స్త్రీలలో ఈ లోపం 75%గా ఉంది. సమాచారం ప్రకారం, విటమిన్ డి లోపం ఉన్నవారి సంఖ్య సూరత్ మరియు వడోదరలో ఎక్కువగా ఉంది. సూరత్‌లో 88%, వడోదరలో 89% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇది కాకుండా, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 72 శాతం మంది ఈ విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించారు.

యువతలో లోపం ఎక్కువగా ఉంది..
జాతీయ సగటుతో పోలిస్తే, ఆసక్తికరంగా, యువకులు విటమిన్ డి లోపంతో ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు తేలింది. దీని ప్రాబల్యం 25 ఏళ్లలోపు 84% మంది, 25-40 ఏళ్ల వయసు వారిలో 81% ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం , హైదరాబాద్‌లోనూ వివరాలు సేకరించారు. వైజాగ్‌లో జాతీయ సగటు కంటే డి విటమిన్ లోటు ఎక్కువగా ఉండగా, హైదరాబాద్‌లో 76 శాతం ఉంది.

కరోనా తర్వాత :
సర్వే ప్రకారం, కోవిడ్ కారణంగా లాక్డౌన్లో విటమిన్-డి లోపం మరింత పెరిగిందని తెరపైకి వచ్చింది. అదే సమయంలో, లాక్‌డౌన్‌తో పాటు కాలుష్యం మరియు డైట్‌లో జంక్ ఫుడ్‌ను చేర్చుకోవడం వల్ల ప్రజల శరీరంలో విటమిన్-డి లోపానికి కారణమని నిపుణులు అంటున్నారు. చాలా మంది యువత పౌష్టికాహారం తీసుకోవడం లేదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, మన శరీరంలో విటమిన్-డి పరిమాణం 75 నానో గ్రాములు ఉంటే అది సరైనదిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, అంతకంటే తక్కువ ఉన్న వ్యక్తులు విటమిన్ డి లోపం బాధితులుగా పరిగణించబడతారు.

విటమిన్ డి ప్రాముఖ్యత...
సూర్యరశ్మి నుండి విటమిన్ డి లభిస్తుంది.ఈ విటమిన్ మన శరీర చర్మంపై సూర్యకిరణాల ద్వారా తయారవుతుంది. శరీరంలో పెరుగుదల, అభివృద్ధి, జీవక్రియ, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి , కండరాలను బలోపేతం చేయడానికి విటమిన్ డి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు, తీసుకునే ఆహారం నుండి శరీరం గ్రహించడంలో డి విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రికెట్స్ వంటి అనారోగ్యాలు వస్తాయి. డి విటమిన్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువే.

ఈ విధంగా విటమిన్ డి శరీరంలో పనిచేస్తుంది
మన కండరాలు, గుండె, మెదడు మరియు రోగనిరోధక వ్యవస్థలో విటమిన్ డి గ్రాహకాలు ఉంటాయి. శరీరం విటమిన్‌ను మూత్రపిండాలు మరియు కాలేయానికి రవాణా చేస్తుంది, ఇక్కడ అది క్రియాశీల హార్మోన్‌గా మార్చబడుతుంది. ఈ రూపంలో విటమిన్ డి శరీరంలోని కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి యొక్క ప్రధాన మూలం సూర్యుడు, ఇది కాకుండా, కొన్ని ఆహారాల సహాయంతో, శరీరంలో విటమిన్ డి లోపాన్ని కూడా తీర్చవచ్చు.

విటమిన్ డి లోపానికి కారణాలు..
మారుతున్న ఆహారపు అలవాట్లు, మన శరీరానికి సరిపడా సూర్యరశ్మి తగలకపోవడం, ఇండోర్ జీవనశైలి కారణంగా విటమిన్ డి లోపాలు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్య యుక్త వయసు వారిలో చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ డి-కలిగిన బలవర్థకమైన తృణధాన్యాలు, చేపలు వినియోగం తక్కువే లోపానికి ప్రధాన కారణం. ముఖ్యంగా శీతాకాలంలో ఆహార లోపం ఉన్న మహిళల్లో డి విటమిన్ లోపాలు పెరిగిపోతున్నాయని గుర్తించారు.

విటమిన్ డి లోపం యొక్క లక్షణాలు
- నిస్పృహ, విచారం
- అలసట
- విషయాలు మర్చిపోవడం
- ఆత్మహత్య ఆలోచనలు
- చింతించండం
- ఆకలి లేకపోవడం
వేగంగా బరువు తగ్గడం లేదా పెరగడం
- నిద్రలేమి
- పెరిగిన రక్తపోటు
- ముఖం మరియు చేతులు ముడతలు
- ఎముకలలో నొప్పి
- కండరాల బలహీనత
- అలసట, ఏదైనా పనిలో ఆసక్తి కోల్పోవడం
- నిద్రలేమి, నిరాశ

విటమిన్ డి లోపాన్ని నివారించడం ఎలా?
మన శరీరంలో విటమిన్ డి లోపాన్ని ఆహారం ద్వారా తొలగించడం కొంచెం కష్టమే. ఆహారం గురించి మాట్లాడుతూ, ఈ విటమిన్ గుడ్డు మరియు చేపల పసుపు భాగంలో కనిపిస్తుంది. అందువల్ల, ఇది ఉత్తమ మార్గం. లోపాన్ని నివారించడానికి తక్కువ దుస్తులతో ఎండలో నడవడం మరియు విటమిన్-డి యొక్క నోటి సప్లిమెంట్ తీసుకోవడం. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో విటమిన్ డి లభిస్తుంది. గుడ్డు సొనలు, కొవ్వు చేపలు, ఎర్ర మాంసం అంటే మీట్, బలవర్ధకమైన ఆహారాలతోపాటు, అవసరమైన వారు డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి.
(నిరాకరణ: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. తెలుగు బోల్డ్ స్కై దీన్ని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)



Click it and Unblock the Notifications