For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో ఈ 8 అవయవాలు లేకుండా కూడా సాధారణ జీవితాన్ని గడపగలరని తెలుసా ?

శరీరంలో ఈ 8 అవయవాలు లేకుండా కూడా సాధారణ జీవితాన్ని గడపగలరని తెలుసా ?

|

మానవ శరీరం కాలానుగుణ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అదేక్రమంలో భాగంగా మానవ శరీరంలో కొన్ని అవయవాలు జతలుగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం లేదా ఆరోగ్య సమస్యల కారణంగా జతలో ఒక అవయవాన్ని తొలగించిన ఎడల, ఆ అవయవం పనిని రెండవది తీసుకుంటుంది. అయితే, మీ శరీరంలో కొన్ని అవయవాలు లేకుండా కూడా సాధారణ జీవితాన్ని గడపగలరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

8 organs without you can live with no stress

పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగల అవయవాల జాబితాను ఇక్కడ పొందుపరచడం జరిగింది. కానీ, వైద్య కారణాలు లేకుండా వాటిని తొలగించమని మేము ప్రోత్సహించడం లేదు. ఈ వ్యాసం కేవలం అవగాహన కోసం మాత్రమే.
కడుపు భాగం :

కడుపు భాగం :

కడుపు క్యాన్సర్తో బాధపడుతున్న కొంతమంది రోగులకు, ఆపరేషన్ ద్వారా, కొంతభాగం తొలగించవలసి ఉంటుంది. కానీ, ఈ విధానం తరువాత, అన్నవాహికను నేరుగా చిన్న ప్రేగులతో అనుసంధానించవలసి ఉంటుంది. క్రమంగా, ఇదే పూర్తిగా కడుపు యొక్క పనితీరును తీసుకుంటుంది. కానీ, ఇక్కడ విటమిన్ బి 12 యొక్క శోషణ మాత్రమే సమస్యగా ఉంటుంది. ఇది బైయెన్నియల్ ఇంజెక్షన్ల ద్వారా పరిష్కరించబడుతుంది.

పెద్ద ప్రేగు :

పెద్ద ప్రేగు :

కొన్ని వైద్య పరిస్థితుల కారణంగా, పెద్ద ప్రేగును కూడా కొంతభాగం తొలగించవలసిన పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఆ పెద్దపేగు భాగం లేకుండా కూడా మనిషి జీవించవచ్చు, కానీ మీకు కొలొస్టోమీ బ్యాగ్ అవసరంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది చిన్న ప్రేగు ద్వారా పాక్షికంగా పునరుద్ధరించబడుతుంది. దీని పరిమాణం తక్కువగా ఉన్న కారణంగా, మీరు తరచుగా బాత్రూంకు వెళ్ళవలసి ఉంటుంది.

అపెండిక్స్(ఉండుకము):

అపెండిక్స్(ఉండుకము):

ఉండుకము శరీరం నుండి పూర్తిగా తొలగించినా కూడా, మీరు ఎటువంటి సమస్యలు లేకుండా జీవించగలిగినప్పటికీ, అది సమస్యలను కలిగించని ఎడల దానిని తొలగించాలని మాత్రం చూడకండి. కొన్ని అధ్యయనాల ప్రకారం, అనారోగ్యాల తర్వాత మీ ప్రేగుల పనితీరును పునఃప్రారంభించడానికి అపెండిక్స్ “మంచి” బ్యాక్టీరియాను విడుదల చేస్తుందని వివరించాయి. ఒక్కోసారి ఉండుకము వాపుకు గురవడం కారణంగా కడుపునొప్పి తలెత్తినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ ఉండుకాన్ని తొలగించవలసిన పరిస్థితులు నెలకొంటాయి.

పునరుత్పత్తి అవయవాలు :

పునరుత్పత్తి అవయవాలు :

వివిధ వైద్య కారణాల వల్ల లేదా వ్యక్తిగత కారణాల మూలంగా, వృషణాలు, అండాశయాలు మరియు గర్భాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు.

క్షీర గ్రంధులు:

క్షీర గ్రంధులు:

రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలను గుర్తించినప్పుడు, మహిళలు లేదా పురుషులలో (అవును, పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ బారినపడవచ్చు) ఈ గ్రంథులను తొలగించవలసిన పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్షీర గ్రంధులను తొలగించడం కారణంగా ప్రాణానికి ఎటువంటి ముప్పూ వాటిల్లదు. కానీ, శారీరిక మానసిక అంశాల ఆధారితంగా బ్రెస్ట్ ప్రొస్థెటిక్ ఉపయోగించి రొమ్ములను పునర్నిర్మించవచ్చు.

ఇంద్రియ అవయవాలు :

ఇంద్రియ అవయవాలు :

కళ్ళు, చెవులు లేదా ముక్కు లేకుండా కూడా మనిషి జీవించవచ్చు. ఈ అవయవాలను ప్రొస్థెటిక్ సంరక్షణతో భర్తీ చేయవచ్చు.

టాన్సిల్స్ :

టాన్సిల్స్ :

టాన్సిల్స్ మెడ వెనుక భాగంలోని కణజాలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా మరియు వైరస్లను ఫిల్టర్ చేస్తాయి. కాని ఇవి ఒక్కోసారి సంక్రమణలకు గురవుతుంటాయి. క్రమంగా, ఆరోగ్య పరిస్థితుల ప్రకారం తొలగించబడతాయి. అదృష్టవశాత్తూ, టాన్సిల్స్ అనేవి వయస్సుతో పాటు తగ్గుముఖం పడుతాయి. ఆపై సమస్యలను కూడా కలిగించవు.

కాలి వేళ్ళు :

కాలి వేళ్ళు :

మన పూర్వీకులు, ప్రైమేట్స్, వారి కాళ్ళ వేళ్ళను కొమ్మలను పట్టుకునేందుకు సైతం వినియోగించేవారు. కానీ ఆధునిక మనిషి మొదటి బొటనవేలు మరియు వాటి పక్కన మూడు వేళ్ళను మాత్రమే ఉపయోగించి నిలబడగలుగుతున్నాడు. ఐదవ వేలు పరిణామక్రమం యొక్క ఉత్పత్తిగా మిగిలిపోయింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 organs without you can live with no stress

It is fascinating how the human body can adapt to changes. The human body has pair organs, and in the case of removal of one of a pair, the other will take over the work of the deceased. However, have you ever wondered if you can live a normal life without certain organs in your body?
Desktop Bottom Promotion