For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె నొప్పితో ఏపీ మంత్రి హఠాన్మరణం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండె నొప్పి గండం నుండి గట్టెక్కొచ్చు...

ఏపీ మంత్రి గుండెపోటుతో మరణించారు, అందుకు గల కారణాలేంటి, గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తుది శ్వాసను విడిచారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే ఆయన ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఎక్సర్ సైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఇంట్లో ఉన్న తన భార్యకు చెప్పి కింద పడిపోయారట.

AP Minister died after a massive cardiac arrest; Know reasons and precautions for cardiac arrest in Telugu

ఆ వెంటనే వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో 8:45 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు వైద్యులు ఈ మరణ వార్తను తెలిపారు.

AP Minister died after a massive cardiac arrest; Know reasons and precautions for cardiac arrest in Telugu

ఈ సందర్భంగా అకస్మాత్తుగా గుండె నొప్పి ఎందుకు వస్తుంది.. గుండె నొప్పి వచ్చేందుకు ప్రధాన కారణాలేంటి.. గుండె నొప్పి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కోవిడ్ మారితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి...కోవిడ్ మారితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి...

గుండె నొప్పి వస్తే..

గుండె నొప్పి వస్తే..

సాధారణంగా గుండె నొప్పి లేదా గుండె పోటు అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో.. ఎలా వస్తుందో అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అయితే, ఒక్కసారి గుండెపోటు తీవ్రమైతే మాత్రం శాశ్వతంగా కన్ను మూయాల్సిందే. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లేదా లక్కీగా ఉంటే మాత్రం బతికే అవకాశాలున్నాయి. ఇతర వ్యాధులతో పోల్చితే గుండె నొప్పిని ముందుగానే గుర్తించి.. అప్రమత్తం అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గుండె పోటుకు ముందు మన బాడీ కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో తెలుసుకుంటే మనం గుండెపోటు నుండి గండం నుండి తప్పించుకోవచ్చు.

గుండె నొప్పి ఎందుకు?

గుండె నొప్పి ఎందుకు?

మనలో ప్రతి ఒక్కరికీ గుండెకు అనునిత్యం రక్తం సరఫరా అవుతూ ఉండాలి. గుండెకు రక్తం సరఫరా ఏ మాత్రం నిలిచినా.. బాడీలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వులే అని వైద్యులు చెబుతున్నారు. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం ప్రవహించే మార్గం తగ్గిపోతుంది. ఈ కారణంగా గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో గుండె కండరాలకు ఆక్సీజన్, పోషకాలు అందవు. అప్పుడు కండరాలు చచ్చుబడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

మద్యం సేవించే ముందు ఈ ఆహారాలు తింటే మద్యం ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు...!మద్యం సేవించే ముందు ఈ ఆహారాలు తింటే మద్యం ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు...!

గుండె నొప్పికి ముందు లక్షణాలు..

గుండె నొప్పికి ముందు లక్షణాలు..

* గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎప్పుడు, ఎవరికి కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి.

* అకస్మాత్తుగా మాట్లాడే వేళ గందరగోళ పడటం, ఏదైనా చెప్పాలనకుని వెంటనే ఆగిపోవడం, ఒకే విషయాన్ని అనేకసార్లు చెప్పడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

* గుండెకు రక్త సరఫరా తగ్గిపోతే.. గుండెలో మంటగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

* రెగ్యులర్ గా జలుబు, దగ్గు, జ్వరం వస్తూ.. అవి అస్సలు తగ్గకపోయినా గుండె నొప్పి అని అనుమానపడొచ్చు.

* గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి.

* మత్తుగా ఉన్నా లేదా చెమటలు ఎక్కువగా పడుతున్నా కూడా గుండె నొప్పికి సూచనగా పరిగణించాలి.

* విపరీతమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.

* ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ, వికారం వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారి తీస్తాయి.

* కంటి చివర్లో కురుపులు వచ్చినా.. గుండెపోటుకు దారి తీయొచ్చు.

* కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించొచ్చు.

* శరీరంలో పైభాగం నుండి ఎడమ చేతి కింద వరకు నొప్పిగా ఉంటే అది కచ్చితంగా గుండెనొప్పి అని గుర్తించాలి.

ఇలా చేస్తే గుండె పదిలం..

ఇలా చేస్తే గుండె పదిలం..

* గుండె నొప్పి రాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు నడవాలి.

* మీకు వ్యాయామం చేసే అలవాటు లేకపోతే, ఈ పది నిమిషాల నడక ఎంతో ఉపయోగపడుతుంది. మీరు నిత్యం వ్యాయామం చేస్తే ఈ పది నిమిషాలు మరింత కలిసొస్తుంది.

* మీ ఇంట్లో ఏదైనా బరువుగా ఉండే వస్తువులను పైకెత్తడం, హార్ట్ కవర్ బుక్ ని లిఫ్ట్ చేయడం వంటివి చేయాలి. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా.. తర్వాత చాలా ఈజీగా మారుతుంది.

అప్పుడు మీరు మరిన్ని వస్తువులను పైకెత్తేందుకు ప్రయత్నించండి లేదా ఏదైనా జిమ్ లో చేరండి.

* ప్రతిరోజూ ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి. ఇవి మీ బ్రెయిన్ నుండి బవెల్స్ వరకూ అన్నింటికీ మేలు చేస్తాయి.

* తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం తీసుకోండి. అలాగే టిఫిన్ సమయంలో ఒక పండు, ఓట్ మీల్, హోల్ వీట్ టోస్ట్ వంటి పూర్తి ధాన్యాలు ఉండేలా చూసుకోండి.

* వారానికి ఒకసారి మాంసానికి బదులుగా ఫిష్ లేదా సీ ఫుడ్ తినండి. సీ ఫుడ్ గుండెకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది.

* ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఊపిరి పీల్చడం, వదలడం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.

FAQ's
  • ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పుడు మరణించారు?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తుది శ్వాసను విడిచారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే ఆయన ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఎక్సర్ సైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఇంట్లో ఉన్న తన భార్యకు చెప్పి కింద పడిపోయారట. ఆ వెంటనే వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో 8:45 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు వైద్యులు ఈ మరణ వార్తను తెలిపారు.

  • గుండె నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలేంటి?

    మనలో ప్రతి ఒక్కరికీ గుండెకు అనునిత్యం రక్తం సరఫరా అవుతూ ఉండాలి. గుండెకు రక్తం సరఫరా ఏ మాత్రం నిలిచినా.. బాడీలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వులే అని వైద్యులు చెబుతున్నారు. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం ప్రవహించే మార్గం తగ్గిపోతుంది. ఈ కారణంగా గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో గుండె కండరాలకు ఆక్సీజన్, పోషకాలు అందవు. అప్పుడు కండరాలు చచ్చుబడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

AP Minister died after a massive cardiac arrest; Know reasons and precautions for cardiac arrest in Telugu

Here we are talking about the AP Minister died after a massive cardiac arrest; Know reasons and precautions for cardiac arrest in Telugu
Desktop Bottom Promotion