For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19:మళ్తీ కోవిద్ కొత్త వేరియంట్లు.. దీనిపై వ్యాక్సిన్ పని చేస్తుందా?

కరోనా కొత్త వేరియంట్లో మరి కొన్ని కొత్త లక్షణాలొచ్చాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా మహమ్మారి మన దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పట్టినట్టు మనం వింటున్నాం. కరోనా బారిన పడిన వారు కూడా త్వరగానే కోలుకుంటున్నారు. ఇటీవలే వంద కోట్ల మందికి టీకాలు పూర్తయినట్టు.. మనమంతా సేఫ్ అని ఊపిరి పీల్చుకున్నాం.

AY4.2 New Covid Variant symptoms and is vaccine effective with it? Explained in Telugu

అయితే అంతలోనే కోవిద్ మరో కొత్త వేరియంట్ రూపంలో వచ్చేసింది. ముందుగా యుకే, యూరోపియన్ దేశాల్లో AY.4.2 యొక్క కొత్త వేరియంట్ లక్షణాలు విపరీతంగా బయటపడినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాజాగా 6 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. ఈ కొత్త వేరియంట్ ను 'డెల్టా ప్లస్' అని కూడా అంటారు.

AY4.2 New Covid Variant symptoms and is vaccine effective with it? Explained in Telugu

ఈ డెల్టా రూపాంతరం చెంది.. ఇప్పటికీ ఆధిపత్య వేరియంట్ అయినప్పటికీ, AY.4.2 డెల్టా ఉపవిభాగం వేగంగా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. ఇందులో స్పైక్ మ్యుటేషన్లు A222V మరియు Y145H ఉన్నాయి. ఇది వైరస్ మనుగడకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా కోవిద్ కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? దీనికి వ్యతిరేకంగా కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

డెల్టా ప్లస్ అంటే ఏమిటి?

డెల్టా ప్లస్ అంటే ఏమిటి?

దీనిని AY4.2 అంటారు. కానీ కొందరు దీనిని డెల్టా ప్లస్ అని కూడా పిలుస్తారు. అసలు డెల్టా సౌట్రైన్ మే 2021లో UKలో ఆందోళన కలిగించే వైవిధ్యంగా వర్గీకరించబడింది. జూలై 2021లో, నిపుణులు AY.4.2ని గుర్తించారు. ఇది డెల్టా యొక్క ఉపవిభాగం. ఇది అప్పటినుండి నెమ్మదిగా పెరుగుతోంది. వైరస్ మన కణాలలోకి చొచ్చుకుపోవడానికి ఉపయోగించే స్పైక్ ప్రోటీన్‌ను ప్రభావితం చేసే కొన్ని కొత్త ఉత్పరివర్తనలు వేరియంట్లలో ఉన్నాయి. తాజాగా మన దేశంలో మధ్యప్రదేశ్ లో నాలుగు కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దీని లక్షణాలు ఏమిటి

దీని లక్షణాలు ఏమిటి

ప్రస్తుతం, డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంక్రమణ లక్షణాలు ఇతర కరోనా వైరస్ జాతుల కంటే భిన్నంగా ఉన్నట్లు ఎటువంటి సూచన లేదు. అయితే, ఈ క్రింది లక్షణాలను నివారించాలని నిపుణులు అంటున్నారు.

NHS ప్రకారం, కోవిడ్-19 యొక్క ప్రధాన లక్షణాలు

NHS ప్రకారం, కోవిడ్-19 యొక్క ప్రధాన లక్షణాలు

* అధిక శరీర ఉష్ణోగ్రత - మీ ఛాతీ లేదా వీపును తాకినప్పుడు మీరు వేడిగా ఉన్నట్టు భావించడం.

* తరచుగా నిరంతర దగ్గు - 24 గంటల్లో ఒక గంట లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు దగ్గడం. ఒకవేళ మీకు సాధారణంగా దగ్గు ఉంటే, అది మరింత తీవ్రమవుతుంది.

* మీరు అకస్మాత్తుగా వాసన లేదా రుచి కోల్పోవడం వంటివి జరుగుతాయి. మీరు సాధారణం కంటే భిన్నంగా వాసన లేదా రుచి గ్రహించకపోవచ్చు.

దీనికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పనిచేస్తుందా?

దీనికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పనిచేస్తుందా?

ఈ రూపాంతరం టీకాలను అసమర్థంగా చేస్తుందనే సూచన ప్రస్తుతం లేదు. అయితే నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు. వేరియంట్లలో వైరస్ మనుగడ ప్రయోజనాలను అందించే ఉత్పరివర్తనలు ఉన్నాయి, అయితే ఇది ఎంత ముప్పును కలిగిస్తుందో తెలుసుకోవడానికి పరీక్షలు జరుగుతున్నాయి. నిపుణులు ఈ వేరియంట్ పెద్ద ఎత్తున రావడం లేదా ప్రస్తుత వ్యాక్సిన్‌ల నుండి తప్పించుకునే అవకాశం లేదని మరియు ఇంకా ఆందోళన కలిగించే వైవిధ్యంగా పరిగణించబడలేదని అంటున్నారు.

రెండు డోసులు తీసుకుంటే..

రెండు డోసులు తీసుకుంటే..

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి.. మన దేశంలో అదీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో AY 4.2 కొత్త రకం కేసులు రావడం ఇదే తొలిసారి. వీటి బారిన పడిన వారు కూడా రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారే. వీరితో సన్నిహితంగా ఉన్న మరికొందరు వ్యక్తులను పరీక్షించగా.. వారంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యాధికారులు వివరించారు. AY 4.2 అనేది ఓ కొత్త రకమైన వేరియంట్ అని.. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఇంకా అందుబాటులో లేదని ఇండోర్ మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనితా మూతా వివరించారు.

UKలో డెల్టా ప్లస్ కేసులు

UKలో డెల్టా ప్లస్ కేసులు

జూలై నుండి UKలో AY4.2 కేసులు బాగా పెరిగాయి. ఈ వేరియంట్ ఇప్పుడు దేశంలో ప్రాసెస్ చేయబడిన మొత్తం కేసులలో 8% వాటాను కలిగి ఉంది. UKలో ఇప్పటివరకు 14,385 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన దేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాజాగా నాలుగు నుండి ఆరు కేసులు నమోదయ్యాయి.

FAQ's

English summary

AY4.2 New Covid Variant symptoms and is vaccine effective with it? Explained in Telugu

AY4.2 - also known as Delta Plus - is a variant of Covid currently being monitored by the UK Government. Read on to know more.
Story first published:Tuesday, October 26, 2021, 13:08 [IST]
Desktop Bottom Promotion