For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Healthy lifestyle: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆయుర్వేద మార్గం: బ్రహ్మముహృతంలో మేల్కొలపడం

|

Healthy lifestyle: ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. డబ్బు కోల్పోతే సంపాదించుకోవచ్చు. కానీ, ఆరోగ్యం కోల్పోతే సంపాదించుకోలేము. చిన్న పాటి అనారోగ్యమైన జీవితంపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. దాని వల్ల మనం ఒక్కరమే కాకుండా కుటుంబసభ్యులు కూడా బాధ పడాల్సి వస్తుంది. ఆరోగ్యం-ఆర్థికం రెండింటికి సంబంధం ఉంటుంది. అనారోగ్యం ఆర్థికంగా కూడా ప్రభావం చూపుతుంది. ప్రస్తుత స్థితిగతుల్లో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం.

వ్యాధులు లేకుండా చూసుకోవడం అలాగే ఆరోగ్యంగా ఉండటం కోసం తాపత్రయ పడటం ఈనాటిది కాదు. చరక సంహితలో దీని గురించి చర్చించారు. అంటే పురాతన ఆయుర్వేద సాహిత్యంలో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పలు సూచనలు చేశారు. ఈ చరక సంహితలో ఎన్నో విషయాల గురించి విపులంగా చెప్పారు. వాటిని పాటిస్తే ఆయురారోగ్యం సొంతం అవుతుందని సూచించారు. అనారోగ్య లక్షణాలు, ఔషధాలు, ఆహార పదార్థాల గురించి చరక సంహితలో త్రిసూత్ర ఆధారంగా చెప్పారు. ఇందులో చెప్పిన ప్రతి విషయం ఇప్పటికీ అనుసరణీయమే.

మానవ నాగరికత నుంచే ఆరోగ్యం కోసం ఏమేం చేయాలో చెబుతూ వస్తున్నారు. అలాగే వ్యాధిని రెండు రకాలుగా నివారించవచ్చని వెల్లడించారు. ఒకటి సూక్ష్మజీవుల నుంచి మనల్ని దూరంగా ఉంచుకోవడం. రెండోది ఒక వేళ వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవడం. ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం, అలాగే కణాల మైటోకాండ్రియల్ పని తీరును మెరుగుపరచడం ద్వారా వృద్ధాప్యం వచ్చే వేగాన్ని తగ్గించవచ్చు. మైటోకాండ్రియల్స్ ను మెరుగు పరిస్తే.. వ్యాధిని నివారించడమే కాకుండా.. మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.

నిద్ర ప్రాముఖ్యత

నిద్ర ప్రాముఖ్యత

ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రక్రియ అనేది త్వరగా మేల్కొనడం నుంచి మొదలు అవుతుంది. తెల్లవారుజామునే నిద్ర లేవడం మంచి ఆరోగ్యకరమైన అలవాటు. స్వచ్ఛమైన గాలిలో త్వరగా నిద్రలేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సెరోటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌లు సహా న్యూరో-కెమికల్‌లు లాంటి హార్మోన్లు ఉత్సాహాన్ని ఇస్తాయి. దీని వల్ల తెలియని ఆనందం సొంతం అవుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ, నాడీ-నిబంధనలు, హార్మోన్ రెగ్యులేషన్ మెరుగైన పని తీరు కనబరిచేలా సాయం చేస్తుంది.

ఎప్పుడు నిద్ర లేవాలి?

ఎప్పుడు నిద్ర లేవాలి?

ఎప్పుడు నిద్ర నుంచి మేల్కోవాలి అనేది చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేవడానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం. వేసవిలో సూర్యుని గమనాన్ని బట్టి కాలం మారుతూ ఉంటుంది. ఇది చాలా ముందుగానే ఉంటుంది. అలాగే శీతాకాలంలో ఇది కొంచెం ఆలస్యం అవుతుంది. వేసవిలో సగటున 6:00AM గంటలకు సూర్యోదయ అవుతుంది కాబట్టి, 4.30AM ను బ్రహ్మ ముహూర్తంగా పరిగణించాలి. అలాగే శీతాకాలంలో సూర్యుడు 7 గంటలకు ఉదయిస్తాడు కాబట్టి, 5.30 గంటలను బ్రహ్మ ముహూర్త సమయం అనుకోవాలి. బ్రహ్మముహూర్తానికి ముందే నిద్రలేవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

రాత్రి మంచి ఉండాలి. శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే చాలా రకాలుగా సమస్యలు వస్తాయి. అలసట, తలనొప్పి సమస్యలు వస్తాయి. శరీరంలో వాతాన్ని పెంచుతుంది. ఇది స్థూలకాయానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది. ఇది జీవక్రియ, జీర్ణక్రియలపైనా ప్రభావం చూపుతుంది.

బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత

బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత

ఒక రోజులో బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. మంత్రాలను పఠించడం, మత పరమైన ఆచారాలను అనుసరించడం, అధ్యయనం చేయడం, ఆలోచించడం, నేర్చుకోవడం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, ఆరాధన అలాగే ధ్యానం చేయడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచి సమయం. సూర్యోదయానికి ముందు రాత్రి, తెల్లవారుజామున ఆహ్లాదకరమైన హార్మోన్లు అధిక సాంద్రతలో ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్లు, ఇతర హార్మోన్లు పగటి పూట ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట స్టెరాల్స్ హార్మోన్లు అధిక సాంద్రతలో ఉంటాయి.

సెరోటోనిన్

సెరోటోనిన్

ఇది మొదటి ఆహ్లాదకరమైన హార్మోన్. ఉదయాన్నే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. జ్ఞానము, జ్ఞాపకశక్తి, ఆలోచన, అభ్యాసం లాంటి బహు ముఖ విధులను నెరవేర్చే న్యూరోట్రాన్స్‌మిటర్. సైకో-న్యూరోఇమ్యునాలజీ మార్గం ద్వారా రోగ నిరోధక శక్తి, నాడీ సంబంధిత హార్మోన్ల పని తీరును మెరుగుపరుస్తుంది.

మెలటోనిన్

మెలటోనిన్

దీనిని నిద్రలేపే హార్మోన్ అని కూడా అంటారు. పీనియల్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ కార్యకలాపాలను పెంచుతుంది. ఇది ఆహార పదార్థాల నుండి మందుల నుండి కూడా ఈ హార్మోన్ ను పొందవచ్చు. ఇది సూర్యోదయానికి ముందు ఉత్పత్తి అవుతుంది.

ఆక్సిటోసిన్

ఇది పిట్యూటరీ గ్రంథి వెనుక భాగం నుండి స్రవిస్తుంది. ఇది న్యూరోపెప్టైడ్ హార్మోన్. పునరుత్పత్తి సమయంలో శారీరక శ్రమ సమయంలో ఈ హార్మోన్ పాత్ర పోషిస్తుంది.

ఎండార్ఫిన్లు

ఇది పిట్యూటరీ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది. ఎండోజీనస్ ఓపియాయిడ్ న్యూరోపెప్టైడ్ హార్మోన్ ఇది. ఎండార్ఫిన్లు ప్రధానంగా నొప్పిని తగ్గించేందుకు సహాయపడతాయి.అలాగే ఆనందాన్ని ఇస్తుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు ఇది సహజ వైద్యంలాగా పని చేస్తుంది.

ఫైనల్ నోట్

ఆరోగ్యకరమైన జీవనశైలి వ్యాధులను నివారిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శారీరకంగా, మానసికంగా ఉండేందుకు సాయపడుతుంది.

English summary

Ayurvedic Habits and Their Benefits for a Healthier Life in Telugu

read on to know Ayurvedic Habits and Their Benefits for a Healthier Life in Telugu
Story first published:Saturday, July 16, 2022, 12:04 [IST]
Desktop Bottom Promotion