For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు పడకగదిలో ‘ఆ’ సామర్థ్యం పెంచుకోవాలంటే... ఈ పద్ధతులను ఫాలో అవ్వండి...

|

మగవారు కేవలం బాడీలో కండలు పెంచడమే కాదు.. కాస్త శృంగార సామర్థ్యంపైనా శ్రద్ధ వహించాలి. మీరు లైంగికంగా ఆరోగ్యంగా ఉంటేనే పడకగదిలో పార్ట్ నర్ తో కావాల్సినంత సేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా జరిగితేనే మీ వైవాహిక జీవితం లేదా ఇతర రిలేషన్ షిప్ ఏదైనా బలంగా ఉంటుంది.

అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మగవారు మరియు మహిళలు వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో లైంగిక కార్యకలపాలపై ఆసక్తి తగ్గుతోందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మగవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మగాళ్లలో శీఘ్రస్కలనం, అంగస్తంభన, శీఘ్రస్కలనంతో పాటు మరికొన్ని సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయట.

అయితే కొంతమంది పురుషులు పడకగదిలో తమ భాగస్వామితో తాత్కాలికంగా ఆనందంగా గడిపేందుకు మార్కెట్లో లభించే మెడిసిన్ ను ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారట. అయితే వాటిని ఇలా వాడితే.. మీరు అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు మీరు లైంగిక విషయంలో నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలు అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి. ఇదంతా మానసిక ఒత్తిడి, అధిక బరువు, ఇతర వ్యాధుల వంటి సమస్యల వల్లే జరుగుతుందని.. ఈ సందర్భంలో మగవారు లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. కాబట్టి పురుషులు ఈ పద్ధతులను ఫాలో అయితే పడకగదిలో పార్ట్ నర్ తో కోరుకున్న విధంగా ఎంజాయ్ చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

Fat To Fit : గణేష్ ఆచార్య 98 కిలోల బరువు ఎలా తగ్గాడు.. తన వెయిట్ లాస్ జర్నీ విశేషాలేంటో చూసేద్దాం...Fat To Fit : గణేష్ ఆచార్య 98 కిలోల బరువు ఎలా తగ్గాడు.. తన వెయిట్ లాస్ జర్నీ విశేషాలేంటో చూసేద్దాం...

యాక్టివ్ గా ఉండండి..

యాక్టివ్ గా ఉండండి..

మగవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయాన్నే కనీసం అరగంట పాటు ఎక్సర్ సైజ్ చేస్తే (చెమట వచ్చే విధంగా) మీలో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది.

వీటిని ఎక్కువగా తినండి..

వీటిని ఎక్కువగా తినండి..

సాధారణంగా చాలా మంది ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటిని తినడం వల్ల నీటిలో దుర్వాసన వస్తుందని, వాటిని దూరం పెడుతుంటారు. కానీ వీటి వల్ల మీ బాడీలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీంతో మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. వీటితో పాటు ఎక్కువగా అరటి పండ్లను తీసుకోవాలి. ఎందుకంటే అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది, తద్వారా మీ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు తీసుకునే ఆహారంలో మిరియాలను విరివిగా ఉపయోగించండి. ఇవి రక్తపోటు మరియు మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. వెన్న, ఆలివ్ ఆయిల్, చేపలు, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. వీటితో మీ హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఇవన్నీ మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో బాగా తోడ్పడతాయి.

మానసిక ఒత్తిడిని తగ్గించండి

మానసిక ఒత్తిడిని తగ్గించండి

మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందు మానసికంగా ముందుగానే సిద్ధమై ఉండాలి. అలాగే మీ భాగస్వామిని కూడా సిద్ధం చేయాలి. అలా కాకుండా మీరు మానసిక ఒత్తిడితో ఉంటే, అది మీ లైంగిక సామర్థ్యాన్ని తగ్గించడమే కాదు, మీ మొత్తం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.

రోజూ ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మీకు తెలుసా?రోజూ ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మీకు తెలుసా?

వీటికి దూరంగా ఉండండి..

వీటికి దూరంగా ఉండండి..

మీకు పొగతాగడం మరియు మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉంటే కూడా మీ శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకనే వీటిని అతిగా వాడకుండా కంట్రోల్ లో ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి మీ రక్తనాళాలను, ఊపిరితిత్తలును బాగా దెబ్బతీస్తాయి. దీని వల్ల పురుషుల్లో వంధ్యత్వ రోగాలు వచ్చే అవకాశం ఉంది.

సూర్యరశ్మిని పొందండి..

సూర్యరశ్మిని పొందండి..

ప్రతిరోజూ ఉదయించే సూర్యుడి కాంతి మీ బాడీపై పడేలా చూసుకోండి. దీనివల్ల మీరు రోజంతా చాలా హుషారుగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది పురుషులు సూర్యోదయం సమయంలో కూడా నిద్రపోతుంటారు. దీని వల్ల కూడా మీలో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ మీ శరీరంపై కొంత సూర్యరశ్మి పడేలా ప్రయత్నించండి.

హస్త ప్రయోగం

హస్త ప్రయోగం

చాలా మంది పురుషుల్లో ఉండే సాధారణమైన అలవాట్లలో ఇదొకటి. హస్తప్రయోగం అనే అలవాటు ఎక్కువ మంది పురుషులకు ఉంటుంది. అయితే దీన్ని కొందరు అతిగా ఉపయోగిస్తుంటారు. అయితే మీరు కోరుకున్నంత ఎక్కువ సమయం పడకగదిలో గడపకపోతే.. మీరు హస్తప్రయోగం ప్రయత్నించొచ్చు. ఎందుకంటే హస్త ప్రయోగం మీ లైంగిక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. కానీ అది పరిమితంగానే అన్న విషయాన్ని మరచిపోకండి.

మీ జీవిత భాగస్వామిపై శ్రద్ధ వహించండి

మీ జీవిత భాగస్వామిపై శ్రద్ధ వహించండి

మీ భాగస్వామిపై శ్రద్ధ చూపడం వారిని సంతోషపెట్టడమే కాక మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది. మీ భాగస్వామితో శృంగార సంభాషణలో పాల్గొనడం ద్వారా మీ ఇద్దరి లైంగిక జీవితం ఎంతో ఆనందకరంగా సాగుతుంది.

సెక్స్ స్పెషలిస్ట్‌ను కలవండి

సెక్స్ స్పెషలిస్ట్‌ను కలవండి

మీకు వేగంగా స్ఖలనం, అంగస్తంభన వంటి సమస్యలు ఏవైనా ఉంటే, లేదా మీరు డిప్రెషన్, ఆత్మన్యూనత భావంతో బాధపడకుండా ఉండాలంటే మీరు దగ్గరల్లోని సెక్స్ స్పెషలిస్ట్ ను కలవండి. వారితో చికిత్స చేయించుకున్న తర్వాత మీరు లైంగిక సంతృప్తిని పొందవచ్చు.

English summary

Best Ways to Improve Male Sexual Performance In Telugu

Here are the best ways to improve male sexual performance. Read on
Story first published: Saturday, December 19, 2020, 16:18 [IST]