For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shane Warne:క్రికెటర్ షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం.. చిన్న వయసులోనే గుండె ఎందుకు బలహీనపడుతోంది...

క్రికెటర్ షేన్ వార్న్ హార్ట అటాక్ తో హాఠాన్మరణం చెందాడు. ఒత్తిడి, లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ పొగ తాగడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెప్పారు.

|

ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. థాయ్ లాండ్లో కో స్యామ్యూయ్ లో సేద తీరుతుండగా.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అతను ఇంట్లో అపస్మారక స్థితిలో పడిన విషయాన్ని గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

Cricketer Shane Warne Died of Heart Attack, Know What May Cause Sudden Heart Attacks in Telugu

దీంతో మార్చి 4వ తేదీన షేన్ వార్న్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రెటీలు చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలతో చనిపోతున్నారు. ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే గుండె సంబంధిత సమస్యతో తుదిశ్వాస విడిచాడు.

Cricketer Shane Warne Died of Heart Attack, Know What May Cause Sudden Heart Attacks in Telugu

ఒకప్పుడు గుండెపోటు సమస్యలు సాధారణంగా పెద్ద వయసులో ఉన్న వారికి వచ్చేది. అయితే ఇటీవలి కాలంలో 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి గుండెపోటు లేదా గుండెనొప్పి సంబంధిత కేసులు పెరుగుతూ పోతున్నాయి. దీనంతటికి కారణాలేంటి? ఎందుకని చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం లేదు.. చిన్న వయసులో గుండె నొప్పి బారిన ఎందుకు పడుతున్నారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏ కూరగాయలు మీ రక్తనాళాలను కాపాడతాయి మరియు గుండె జబ్బులను నివారిస్తాయో మీకు తెలుసా?ఏ కూరగాయలు మీ రక్తనాళాలను కాపాడతాయి మరియు గుండె జబ్బులను నివారిస్తాయో మీకు తెలుసా?

బాడీ లోపల తెలియని వ్యాధులు..

బాడీ లోపల తెలియని వ్యాధులు..

అమ్రుత హాస్పిటల్ లోని అడల్ట్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజేష్ థాచ్ థోడియల్ ప్రకారం, ‘‘ఇంతకుముందు గుండెపోటు సమస్యలను వృద్ధాప్య వ్యాధిగా పిలిచేవారు. సాధారణంగా 60 ఏళ్ల వయసు పైబడిన వారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. యువత కూడా గుండె నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసక్తకిరమైన విషయం ఏంటంటే.. చాలా మంది బయటికి బాగా ఫిట్ గా, ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ బాడీ లోపల మాత్రం వారికి తెలియని వ్యాధులు పెరుగుతున్నాయి. నేను కూడా ఓపీడిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో సుమారు 200 మంది యువ రోగులను చూస్తున్నాను'' అని వివరించారు.

గుండెపోటుకు గల కారణాలు..

గుండెపోటుకు గల కారణాలు..

ఎవ్వరి గుండెకు అయినా నిరంతరం ఆక్సీజన్ తో కూడిన రక్తం అవసరం. ఇది నిరంతరం ధమనుల ద్వారా సరఫరా చేయబడుతుంది. మీ ధమనులలో ఏదైనా ఫలకం ఏర్పడి సిరులు ఇరుకైనప్పుడు ఈ రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఇది కొవ్వు, కాల్షియం, ప్రోటీన్ మరియు వాపు కణాల ద్వారా జరుగుతుంది. ఇలా ఫలకం పేరుకుపోవడం వల్ల బయటి పొర గట్టిగా ఉంటుంది. లోపలి పొర సున్నితంగా ఉంటుంది. ఫలకం గట్టిపడినప్పుడు, బయటి షెల్ విచ్ఛిన్నమవుతుంది. దీని చీలిక సిర చుట్టూ రక్తం గడ్డ కట్టే పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి ధమనిలో కొంత రక్తం గడ్డకట్టినా, అది రక్త సరఫరాను అడ్డుకుంటుంది. దీని ఫలితంగా గుండె దెబ్బ తింటుంది. దీని నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు వచ్చిన తర్వాత, గుండె కండరాలు స్వయంగా మరమ్మతులు చేయడం ప్రారంభిస్తారు. దీని నుండి కోలుకోవడానికి సుమారు 2 నెలలు పడుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులూ కారణమే..

దీర్ఘకాలిక వ్యాధులూ కారణమే..

గుండె పోటు మరియు ఆకస్మిక హార్ట్ ఎటాక్ మరణాలు నిర్దిష్ట వయసు గల వ్యక్తులను ప్రభావితం చేస్తున్నాయని ముంబైలోని సింబయాసిస్ హాస్పిటల్, CATH ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ అంకుర్ ఫత్తర్ పేకర్ చెప్పారు. గుండెపోటు కారణంగా గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది మీ గుండెను దెబ్బతీస్తుంది. నిశ్చల జీవనశైలి మరియు ఇతర కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, తదితర ప్రమాద కారకాలు. కాబట్టి వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి మంచిది. అయితే అధిక వ్యాయామం వల్ల మీ గుండె దెబ్బతినడం మరియు సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మద్యపానం, ధూమపానం, అలవాటు, డ్రగ్స్ తీసుకునే వారికి గుండెపోటు ఎక్కువ వస్తుందని వివరించారు.

బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...

ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయొద్దు..

ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయొద్దు..

ముంబై సెంట్రల్ లోని వోకార్డ్ హాస్పిటల్ లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కౌశల్ ఛత్రపతి మాట్లాడుతూ, ఈరోజుల్లో ప్రజలు ఆరోగ్యంపై చాలా అప్రమత్తతో ఉన్నారు. చాలా మంది ఫిట్ గా ఉండేందుకు రన్నింగ్ చేయడం, సిక్స్ ప్యాక్ వంటి వాటి కోసం ఎక్కువగా ఎక్సర్ సైజు, వర్కవుట్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ మితంగానే ఉండాలి. మీరు ఎక్కువ వ్యాయామం చేస్తే, గుండె స్పందన రేటు, బిపి పెరుగుదలతో మన గుండె ధమనులలో మైక్రోస్కోపిక్ సమస్యలు ఏర్పడతాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుంది. ఈ విధంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.

గుండె పోటు సాధారణ లక్షణాలు..

గుండె పోటు సాధారణ లక్షణాలు..

గుండె పోటు వచ్చినప్పుడు విపరీతమైన ఛాతీ నొప్పి లేదా చేతుల్లో నొప్పి, మెడ, దవడ లేదా వెన్నెముక వరకు నొప్పి వ్యాపిస్తుంది. అలాగే బాడీలో వికారం, అజీర్ణం, గుండెలో మంట, కడుపు నొప్పి, శ్వాస ఆడకపోవడం, చలి చెమటలు, అలసట, తలతిరగడం వంటివి కనిపిస్తాయి.

గుండె పోటు సంభవించినప్పుడు..

గుండె పోటు సంభవించినప్పుడు..

గుండె కండరాలలో బ్లాకేజ్ లేదా ప్రతికూల సమస్యల కారణంగా కొరోనరీ ఆర్టరీ (ధమనుల) లో రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించబడడం మూలంగా గుండె పోటు సంభవిస్తుంది. కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ గుండె కండరాలలోని కణజాలాలకు ప్రాణవాయువును నిరోధిస్తుంది. ఎక్కువ సందర్భాలలో, హృదయ ధమనులలో రక్తం గడ్డకట్టడం, తద్వారా గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోవడం వంటివి జరగడం కారణాన, ఛాతీ నొప్పి మరియు ఇతర గుండె పోటు లక్షణాలకు దారితీస్తుంది. గుండెపోట్లు గుండె కండరాలకు బలహీనత మరియు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి. క్రమంగా వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

హార్ట్ స్ట్రోక్..

హార్ట్ స్ట్రోక్..

మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులలో రక్తం గడ్డకట్టడం జరిగినప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణజాలాలకు ప్రాణవాయువు సరిగ్గా అందకపోవడం కారణంగా కణజాలం నష్టం మరియు వ్యక్తి మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ అనేది తరచుగా శరీరంలో ఒక వైపు సామర్ధ్యం కోల్పోవడంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

FAQ's
  • ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఎప్పుడు మరణించారు?

    దాదాపు 15 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్లో తన మణికట్టుతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వారిలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒకరు. ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. థాయ్ లాండ్లో కో స్యామ్యూయ్ లో సేద తీరుతుండగా.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అతను ఇంట్లో అపస్మారక స్థితిలో పడిన విషయాన్ని గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో మార్చి 4వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

English summary

Cricketer Shane Warne Died of Heart Attack, Know What May Cause Sudden Heart Attacks in Telugu

Here we are talking about the cricketer shane warne died of heart attack, know what may cause sudden heart attacks in Telugu. Have a look,
Story first published:Saturday, March 5, 2022, 16:06 [IST]
Desktop Bottom Promotion