Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
DRDO Drug 2-DG:Anti Covid Drug ఎలా పని చేస్తుంది.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే...
కరోనాతో పోరాడే డిఆర్డీఓ 2డిజి డ్రగ్ తో ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అల్లకల్లోలంగా మారింది. కోవిద్ నుండి తమకు ఎప్పుడెప్పుడు విముక్తి దొరుకుతుందా అని చాలా మంది ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో Defence Research and Development Organisation(DRDO) కోవిద్ బాధితుల కోసం 2DG డ్రగ్ ను రూపొందించింది. ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి దీన్ని ఆవిష్కరించింది. తాజాగా ఇది పౌడర్ రూపంలో ఉంటుందని, అందుకు సంబంధించిన సాచెట్ ను విడుదల చేసింది.

అతి త్వరలో 10 వేల మోతాదులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా కంపెనీ, డిఆర్డీఓ అధికారులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా వాడాలి.. దీన్ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

2DG డ్రగ్ అంటే ఏమిటి..
Defence Research and Development Organisation(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కలిసి సంయుక్తంగా 2DG డ్రగ్ ను రూపొందించారు. ఇటీవలే ఈ మందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆమోదం లభించింది. దీన్ని 2డియోక్సీ డీ గ్లూకోజ్ (2DG) అంటారు. ఇది పూర్తిగా పొడి రూపంలో మనకు లభిస్తుంది. దీన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీ బాడీ వైరల్ ఉత్పత్తులు పెరుగుతాయి. దీంతో కరోనా బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎంత ప్రభావం..
భారత రక్షణ పరిశోధన అభివ్రుద్ధి సంస్థ, రెడ్డీస్ ల్యాబ్ తయారు చేసిన ఈ కొత్త మందు కరోనా బాధితులకు చాలా వేగంగా పని చేస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో తేలిందట. ప్రస్తుతం చాలా మంది రోగులు ఆక్సీజన్ కొరత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ 2డిజి డ్రగ్ వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కరోనా సోకిన వారు ఈ మందును వాడటం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని ఒక ప్రకటనలో వివరించారు.

దీని ధర ఎంత..
ఓ నివేదికలో వచ్చిన సమాచారం ఈ డ్రగ్ ను ఎంతకు అమ్మాలి అనే దానిపై ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. అయితే ప్రస్తుత సమాచారం మేరకు.. ఈ పొడి ఒక ప్యాకెట్ కు కేవలం రూపాయలు ఖర్చవుతుందని తెలిసింది. కాబట్టి దీనిపై డిఆర్డీఓ పరిశ్రమ భాగస్వామి వీటిని ఇప్పటికే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. గ్లూకోజ్ కూడా సులభంగా ఉత్పత్తి చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

అత్యవసర సమయంలో..
కరోనావైరస్ ను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు కేవలం వ్యాక్సిన్లే తప్ప ఎలాంటి మందులు ఇప్పటివరకు అందుబాటులో లేవు. అయితే వాటికి సంబంధించిన ట్రయల్స్ మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి అత్యవసర సమయంలో 2డిజి డ్రగ్ వాడొచ్చని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) అనుమతి ఇచ్చింది. ఈ మందును వాడటం ద్వారా కరోనా రోగులు వేగంగానే కోలుకుంటున్నారు. మెడికల్ ఆక్సీజన్ పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. దీని వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ఎవరికి బాగా పని చేస్తుందంటే..
ఈ 2డిజి మందు కరోనా లక్షణాలు స్వల్పంగా, మోస్తరుగా ఉండే వారిపై బాగా పని చేస్తుందని.. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ.. అదనంగా దీన్ని తీసుకుంటే.. వారు మరింత వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని డిఆర్డీఓ ప్రకటించింది. దీన్ని ఉపయోగించిన వారిలో చాలా మంది బాధితులకు RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చినట్లు తేలింది.

ఎలా వాడాలంటే..
డిఆర్డీఓ, రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా తయారు చేసిన ఈ డ్రగ్ అన్నింటికంటే విభిన్నంగా ఉంది. ఇది ట్యాబ్లెట్ రూపంలో ఉండదు. ఇది పొడి రూపంలో ఉంటుంది. దీన్ని కొంత నీళ్లలో కలుపుకుని తాగితే చాలు. అది మన బాడీలోని కణాల్లోకి చేరి.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది.. దీంతో పాటు ఇతర వైరస్ లను నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను సైతం ఇది గుర్తిస్తుంది. వైరస్ ను బలహీనపరిచేందుకు ఇది బాగా పని చేస్తుంది. దీంతో వైరస్ నీరసపడిపోతుంది.

మూడో దశ పూర్తైతే..
ఇప్పటివరకు దీనికి సంబంధించి రెండు ట్రయల్స్ మాత్రమే పూర్తయ్యాయి. మొదటి, రెండో దశలో కరోనా రోగులు వేగంగానే కోలుకున్నట్లు డిఆర్డీఓ డిసిజిఐకి సమర్పించిన వివరాల్లో తెలిపింది. అందుకే దీనికి అత్యవసర వాడకానికి అనుమతి లభించింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటి వాటికి కూడా అత్యవసర సమయంలో మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇక మూడో దశ పూర్తై.. నివేదిక వస్తే.. ఈ డ్రగ్ ఇంకెంత బాగా పని చేస్తుందనే వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications