For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bird Flu: భారత్ లో తొలిసారి బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి.. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే.. ఇవి చేయండి..

భారతదేశంలో బర్డ్ ఫ్లూతో తొలి వ్యక్తి మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అసలే కరోనా మహమ్మారితో అందరూ కలవరపడుతున్నాం. ఇప్పటికే సెకండ్ వేవ్ తగ్గిపోయింది. థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్లని కంగారు పడుతుంటే.. తాజాగా బర్డ్ ఫ్లూ మనల్ని భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో చైనాలోని బర్డ్ ఫ్లూ దాని మూలం నుండి నివేదించబడింది. ఈ పరిస్థితి ప్రస్తుతం మానవులలో కనుగొన్నారు. బర్డ్ ఫ్లూ యొక్క వేరియంట్ అయిన హెచ్ 10 ఎన్ 3 ఇప్పుడు 41 ఏళ్ల వ్యక్తిలో కనుగొనడం జరిగింది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఈ వైరస్ నిర్ధారించబడింది.

First Bird Flu Death at AIIMS in India: All You Want to Know About Influenza Virus in Telugu

తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ తో మన దేశంలోని ఢిల్లీ నగరంలోని ఎయిమ్స్ లో పదకొండు సంవత్సరాలు బాలుడు మరణించాడు. ఆ బాలుడు చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందడంతో అందరూ కలవరానికి గురవుతున్నారు. అంతేకాదు ఆ బాలుడికి టెస్ట్ చేసిన వైద్యులందరూ ప్రస్తుతం ఐసోలేషన్ న్లోకి వెళ్లిపోయారు.

First Bird Flu Death at AIIMS in India: All You Want to Know About Influenza Virus in Telugu

హర్యానా రాష్ట్రానికి చెందిన 11 సంవత్సరాల బాలుడు సుశీల్. ఈ నెల రెండో తేదీన న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరాడు. డాక్టర్లు తనకు ముందుగా కరోనా టెస్టులు చేశారు.

First Bird Flu Death at AIIMS in India: All You Want to Know About Influenza Virus in Telugu

ఆ రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. అయితే ఆ టెస్టుల వివరాలను పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపించడంతో బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నేషనల్ సెంటర్ డిసీజ్ కంట్రోల్ పరిశోధకులు అలర్ట్ అయ్యారు. ఇలాంటివి మరిన్ని కేసులు గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ప్రత్యేక టీమ్ ను ఆ బాలుడి స్వగ్రామానికి సైతం పంపారు. ఈ సందర్బంగా బర్డ్ ఫ్లూ మళ్లీ ఎలా వచ్చింది.. అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..

బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ (H5N1 వైరస్), ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా అని కూడా పిలుస్తారు. పక్షులకు, కోళ్లలో వచ్చే వైరస్ మనిషికి వ్యాపించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఇంతకుముందు చైనాలో ఇలాంటి లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగింది.

వేల సంఖ్యలో పక్షుల మరణం..

వేల సంఖ్యలో పక్షుల మరణం..

ఆయా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు, నెమళ్లు మరణించాయి. అయితే ఈ వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ఇలా సోకిన వైరస్ కూడా పెద్ద ప్రమాదం కాదని వైద్యులు చెబుతున్నారు.

మధుమేహం ఉన్నవారు చేపలు తినొచ్చా... తింటే ఏదైనా హాని కలుగుతుందా?మధుమేహం ఉన్నవారు చేపలు తినొచ్చా... తింటే ఏదైనా హాని కలుగుతుందా?

బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే..

బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే..

ప్రస్తుత సమయంలో మనకు బర్డ్ ఫ్లూ రాకూడదంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) చెప్పిన మార్గదర్శకాలను పాటించాలి. అవేంటో మీరే చూడండి. బర్డ్ ఫ్లూ నుండి తప్పించుకోండి. ముఖ్యంగా సగం ఉడికిన గుడ్లు, చికెన్ తినకూడదు. ఫ్లూ సోకిన ప్రదేశాల్లో పక్షులను, అదే విధంగా చనిపోయిన పక్షులను గ్లౌజులు లేకుండా నేరుగా చేతులతో తాకొద్దు. పచ్చి మాంసాన్ని బయటపెట్టొద్దు. మాంసాన్ని కూడా నేరుగా తినొద్దని సూచించింది.

ఇవి చేయండి..

ఇవి చేయండి..

మాంసం పట్టుకునే సమయంలో కూడా చేతికి కచ్చితంగా గ్లౌసులను ధరించాలని FSSAI సూచించింది. అలాగే తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, మీ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బర్డ్ ఫ్లూ బారి నుండి తప్పించుకోవచ్చని తెలిపింది.

English summary

First Bird Flu Death at AIIMS in India: All You Want to Know About Influenza Virus in Telugu

Here we are talking about the first bird flu death at AIIMS in India: All you want to know about influenza virus in Telug. Read on
Story first published:Wednesday, July 21, 2021, 16:51 [IST]
Desktop Bottom Promotion