Just In
- 10 hrs ago
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- 10 hrs ago
పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!
- 11 hrs ago
Winter Tips: ఈ 5 ప్రభావవంతమైన చిట్కాలతో ఈ శీతాకాలంలో మీ పొడి చర్మాన్ని తేమగా చేయండి..
- 12 hrs ago
Winter Tips: మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి స్నానం చేసేటప్పుడు ఆయుర్వేదంలో ఈ చిట్కాలను అనుసరించండి!
Don't Miss
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Movies
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజూ ఈ 9 ఆహారాలలో ఏ ఒక్కటి తిన్నా చాలు, ఊపిరితిత్తుల వ్యాధులు రావు! కారణం ఏంటో తెలుసా?
ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకు ఉశ్చ్వాస నిశ్చ్వాసలు చాలా అవసరం. అణువు గాలి లేకపోతే కదలదు. విశ్వంలో పదార్థాలలో ప్రధాన మూలం గాలి. కానీ దాని పాత్ర రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. వివిధ రకాల కారణాల వల్ల గాలి కాలుష్యం కావడం వల్ల మానవుని శరీరంలో ప్రభావితమైయ్యే మొదటి అవయవం ఊపిరితిత్తులు.
నేటి వాతావరణంలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మరియు ముంబాయ్ వంటి మహా నగారాల్లో ఈ శ్యాసకోశ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు వందల్లో పెరిగిపోతున్నారు. నగరాల్లోనే కాదు, పట్టణాలు, గ్రామాల్లో కూడా శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వల్ల సంవత్సరంలో కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం, శ్వాస సంబంధిత సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ముందు జాగ్రత్తగా తగిన సంరక్షణ తీసుకుంటే ఈ హాని నుండి మీ ఊపిరితిత్తులను రక్షించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి.
వీటిలో ముఖ్యమైనవి ఊపిరితిత్తులలో పేరుకుపోన విషాన్ని లేదా వ్యర్థాలను విడుదల చేసే ఆహారాలు తీసుకోవడం. మీ ఊపిరితిత్తులను శ్వాసకోస సమస్యల నుండి రక్షించడానికి ఈ పోస్ట్‌లో పేర్కొన్న 9 ఆహారాలలో కనీసం ఒకదాన్ని తినండి చాలు. వాటిని తినడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం రండి.!

ఫిష్
కొవ్వు ఆమ్లం, ఒమేగా -3 కలిగి ఉన్న ఆహారం చేపలు. చేపలను వారానికి 2 సార్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల లోపాలు ఉండవు. ఇది ఊపిరితిత్తులలో మంటను కూడా నివారిస్తుంది.

టమోటా
టొమాటోలలొ మనం అనుకున్నదానికంటే భిన్నమైన వైద్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఊపిరితిత్తుల సమస్యలను నివారించడం.టమోటా రసం మరియు టమోటాలు నేరుగా తినండి, తద్వారా ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి.

సిట్రస్ పండ్లు
చాలా మందికి పుల్లని రుచి నచ్చదు. అయినప్పటికీ, పుల్లని మరియు తీపి రుచి కలిగిన సిట్రస్ పండ్లు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అందువల్ల, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి పండ్లను తినడం కొనసాగించండి.
అలాగే, మీరు రోజూ 100 మిల్లీగ్రాముల విటమిన్ సి తింటే, ఊపిరితిత్తులు దెబ్బతినకుండా మరియు ఊపిరితిత్తుల్లో చేరిన విషపదార్థాలను తొలగించడానికి పరిష్కారం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ వంట చేయడానికి ఉత్తమమైన నూనెలలో ఒకటి. దీన్ని వంట కోసం ఉపయోగించవచ్చు మరియు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆ విధంగా, ఊపిరితిత్తులు హాని నుండి రక్షించబడతాయి.

వాల్నట్
వాల్నట్ ఇతర చిక్కుళ్ళు కంటే భిన్నమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉండటమే. ఇది శరీరానికి ప్రధానంగా అవసరమయ్యే కొవ్వు ఆమ్లం. మీ ఊపిరితిత్తులు ప్రభావితం కాకుండా ప్రతిరోజూ కొద్దిగా అక్రోట్లను తినండి.

గ్రీన్ టీ
గ్రీన్ టీ మీ ఊపిరితిత్తులను శుభ్రంగా మరియు హాని లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉన్న పాలిఫెనాల్స్ పల్మనరీ కండరాలను జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించదు.

బ్లాక్ కాఫీ
పాలతో తయారుచేసిన కాఫీ తాగడం మంచిది కాదు. కానీ కాఫీ పౌడర్‌ను మాత్రమే ఉపయోగించి తయారుచేసే కాఫీని బ్లాక్ కాఫీ అంటారు, ఇది ఊపిరితిత్తుల సమస్యకు పరిష్కారం.

ఆకుకూరలు
ఆకుకూరల అధ్యయనాలు కొన్ని ఆశ్చర్యకరమైన డేటాను వెల్లడించాయి. అంటే ఆకుకూరలు వారానికి కనీసం 2 సార్లు తినేవారికి ఊపిరితిత్తుల నష్టం ఉండకూడదు.

అవిసె గింజలు
అవిసె గింజలు ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా సహాయపడతాయి. ఇందులో ఒమేగా -3 లు, ఒమేగా -6 లు వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
రోజూ తక్కువ మొత్తంలో విత్తనాలు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రావు.