For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నం తినడం మానేశారా..? ఇవి తెలుసుకుంటే మనసు మార్చుకుంటారు

|

భారత్ లో అన్నం ప్రధాన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల వారు వరి అన్నాన్ని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు రోటీ, చపాతీ లాంటివి తిన్నప్పటికీ.. దేశంలోని మెజార్టీ ప్రాంతాల్లో రైస్ ను ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నం అనేది ప్రధానం. వివిధ వంటకాలు తిన్నప్పటికీ రైస్ అంటేనే చాలా మందికి మక్కువ.భారత్ తో పాటు 100 కంటే ఎక్కువ దేశాల్లో అన్నం ప్రధాన వంటకం.

Have you stopped eating rice it is a good carb read this to know why in telugu

అయితే ఈ మధ్య కాలంలో అన్నం తినడాన్ని చాలా మంది తగ్గిస్తున్నారు. దానికి బదులుగా గోధుమ పిండితో చేసే చపాతీలను తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అన్నం తింటే బరువు పెరుగుతామన్న భావన చాలా మందిలో ఉంది. చాలా మంది ఫిట్ నెస్ నిపుణులు అన్నం తినొద్దని చెబుతుంటారు.

రైస్ ను వద్దు అనేందుకు కారణాలు

రైస్ ను వద్దు అనేందుకు కారణాలు

బియ్యంలో నిజానికి కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటాయి. అయితే ఈ పిండి పదార్థాలు ఆరోగ్యానికి ఏ హానీ చేయవు. కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ మెదడుకు, కండరాలకు శక్తిని అందించే వాటిలో ముందుంటాయి.ప్రతి గంటకు, మన మెదడు ఐదు గ్రాముల గ్లూకోజ్‌ ను తీసుకుంటుంది. ఇది రోజుకు 120 గ్రాముల గ్లూకోజ్‌ కు సమానం. మూడింట ఒక వంతు కప్పు అన్నంలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.అయితే ఈ స్థాయి కార్బొహైడ్రేట్లు శరీరానికి అవసరం అవుతాయని చాలా మంది నిపుణులు సూచిస్తారు.

పోషక విలువలు

బియ్యం రకాన్ని బట్టి అందులోని పోషకాల స్థాయి మారుతుంది. కార్బోహైడ్రేట్‌ లతో పాటు, బియ్యంలో తక్కువ మొత్తంలో ప్రోటీన్ అలాగే తక్కువ మొత్తంలో కొవ్వు కూడా ఉంటుంది. బ్రౌన్ రైస్ లో పీచుతో కూడిన ఊక, పోషకమైన జెర్మ్, కార్బ్-రిచ్ ఎండోస్పెర్మ్ ఉంటుంది. తెల్ల బియ్యంలో ఎండోస్పెర్మ్ మాత్రమే ఉంటుంది. తెల్ల బియ్యం నుండి ఊక, జెర్మ్ తొలగిస్తారు. అందువల్ల వైట్ రైస్‌తో పోలిస్తే, బ్రౌన్ రైస్‌ లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

కొవ్వు పదార్థం:

ఒక కప్పు బ్రౌన్ రైస్ అలాగే వైట్ రైస్ వండినప్పుడు అందులో 200 కేలరీలు ఉంటాయి. రెండింటిలోనూ దాదాపు 44 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బ్రౌన్ రైస్‌ లో ప్రోటీన్ కంటెంట్ ఐదు గ్రాములు ఉంటుంది. వైట్ రైస్‌ లో ప్రోటీన్ కంటెంట్ నాలుగు గ్రాములు ఉంటుంది. వైట్ రైస్‌లో ఫైబర్ పరిమాణం ఒక గ్రాము కంటే తక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో మొత్తం మూడు నుండి నాలుగు గ్రాములు ఉంటుంది. వైట్ రైస్‌లో 0.4 గ్రాములు అలాగే బ్రౌన్ రైస్‌లో 1.7 గ్రాములు మాత్రమే కొవ్వు ఉంటుంది.

బరువు తగ్గడం కోసం:

బరువు తగ్గడం కోసం:

* బ్రౌన్ రైస్ పై ఉండే ఊక పొరల కారణంగా అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

* ఫైబర్ జీర్ణ క్రియలో చాలా సాయపడుతుంది. అలాగే ఫైబర్ పొట్ట నిండిన భావన కలిగిస్తుంది.

* బ్రౌన్ రైస్ ను ఎక్కువగా నమలాల్సి ఉంఉంది. దీని వల్ల చిన్న చిన్న ముక్కలనే తినగలుగుతాం.

* పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తీసుకోవడం మెటబాలిక్ సిండ్రోమ్ లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. రోజూ తీసుకునే రైస్ లో కనీసం 50 శాతం బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకోండి. రోజూ అలా అర కప్పు వరకు బ్రౌన్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

బియ్యంలో రకాలు

బియ్యంలో రకాలు

బియ్యంలో వైట్, బ్రౌన్ తో పాటు మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇండోనేషియా, థాయ్ బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మిగతా రకాలతో పోలిస్తే థాయ్ బ్లాక్ రైస్ లోనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు, మొక్కల ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడతాయి. హిమాలయన్, థాయ్ రెడ్ రైస్ లో క్వెర్సెటిన్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు మరియు క్యాన్సర్ నివారణకు ప్రయోజనకరంగా ఉంటాయి.వైల్డ్ రైస్ ను ఒక రకంగా బియ్యంగానే పరిగణిస్తారు. తెల్ల బియ్యంతో పోలిస్తే.. ఇందులో మూడు రెట్లు ఎక్కువ ఫైబర్‌ కంటెంట్ ఉంటుంది.యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ, యాంటీ అలెర్జీ, యాంటీ హైపర్‌ టెన్సివ్ తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అన్నం ఎలా తింటే మంచిది

1: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సైడ్ డిష్‌గా, అన్నాన్ని బ్రోకలీ, వెల్లుల్లి అలాగే ఆలివ్ నూనెతో కలిపి తీసుకోవచ్చు. తక్కువ క్యాలరీల వంటకం కోసం క్యాలీ ఫ్లవర్, కొత్తి మీరతో కలిపి అన్నం తినవచ్చు.

2: భోజనం ఎలా ఉండాలి అనేదానికి బుద్ధా బౌల్స్ చక్కడి ఉదాహరణ. బియ్యాన్ని ఎలా తినాలో ఇవి చక్కగా చెబుతాయి.గిన్నెలో తాజా కూరలు, మాంసకృత్తులు బియ్యం వేసుకోవచ్చు. పుట్టగొడుగులు, స్క్వాష్, వండిన చికెన్ లేదా బీన్స్ జత చేసుకోవచ్చు.

అన్నం ఆరోగ్యకరమేనా?

అన్నం ఆరోగ్యకరమేనా?

బ్రౌన్ రైస్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, బి విటమిన్లు ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియలో అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో పని చేస్తుంది. కొద్దిగా తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యం, మధుమేహం నివారణకు ముఖ్యమైనవి. రోగనిరోధక వ్యవస్థతో పాటు, ఇతర పోషకాలు దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తాయి. మామూలు వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ అత్యుత్తమం.

బియ్యం వండటానికి చిట్కాలు

ముందుగా బియ్యాన్ని బాగా కడగాలి. బియ్యంలో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఎక్కువగా కడగడం వల్ల ఇది పోతుంది. అన్నం తినే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం మితం. అన్నమే కాకుండా ఏది తిన్నా మితంగానే తినడం అలవాటు చేసుకోవాలి.

English summary

Have you stopped eating rice it is a good carb read this to know why in telugu

read on to know Have you stopped eating rice it is a good carb read this to know why in telugu.
Story first published:Monday, July 18, 2022, 13:05 [IST]
Desktop Bottom Promotion