For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dry Fruits In Winter: చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలో తెలుసా?

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నాలుకకు రుచి రావడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడితే జలుబు, దగ్గు, జ్వరం నుండి ద

|

Dry Fruits In Winter: చలికాలం గజగజ లాడిస్తోంది. దీంతో పాటు రోగాలనూ మోసుకువచ్చింది చలి. చలి మొదలు కాగానే ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరాలు. రోగనిరోధక శక్తి లేక చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. చలికాలంలో తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. మరికొన్ని ఆహారాలను మాత్రం తప్పనిసరిగా తినాలని చెబుతారు న్యూట్రిషనిస్టులు. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Health benefits of dry fruits in winter in Telugu

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నాలుకకు రుచి రావడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడితే జలుబు, దగ్గు, జ్వరం నుండి దూరంగా ఉండొచ్చు.

ఏ డ్రై ఫ్రూట్ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం.

జీడిపప్పు

జీడిపప్పు

జీడిపప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీడిపప్పు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచవ్చు. జీడిపప్పు మైగ్రేన్ తొలనొప్పికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. జీడిపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

వాల్ నట్

వాల్ నట్

చలికాలంలో వాల్ నట్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాల్ నట్స్ లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల చర్మానికి జుట్టుకు ప్రయోజనం చేకూరుతుంది.

బాదం

బాదం

డ్రై ఫ్రూట్స్ లో బాదం ను రాజుగా పిలుస్తారు. ఎందుకంటే బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఫైబర్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. బాదం పప్పు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు బాదంపప్పులో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. ఖాళీ కడుపుతో కొన్ని బాదం పప్పులు తింటే శక్తి వస్తుంది.

అంజీర్

అంజీర్

అంజీర్ లో ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అంజీర్ పండ్లలో విటమిన్ ఏ, బి1, బి12, కాల్షియం, సోడియం, క్లోరిన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. అంజీర్ పండ్లు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. చలికాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

పిస్తా

పిస్తా

పిస్తాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పిస్తా పప్పు తీసుకోవడం వల్ల చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షించుకోవచ్చు. అలాగే చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

English summary

Health benefits of dry fruits in winter in Telugu

read on to know Health benefits of dry fruits in winter in Telugu
Story first published:Wednesday, November 30, 2022, 15:30 [IST]
Desktop Bottom Promotion