For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.

చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.

|

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో PCOS మరియు PCOD గురించి మనం తప్పకుండా వింటూనే ఉంటాము. ఈ సమస్య ద్వారా అమ్మాయి కానీ మహిళలు కానీ ఎందుకు ఎక్కువ ప్రభావితం అవుతారనే విషయాన్ని మనం ఈ కథనంలో అర్థం చేసుకుంటాము. ఇలాంటి పరిస్థితి మహిళలనే ఎందుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? హార్మోన్ల అసమతుల్యత పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందులో ఒకటి పిసిఓడి మరియు పిసిఓయస్. వీటిలో పీసీఓడీ గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. మహిళల్లో PCOD సమస్య మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుచేత అమ్మాయిలు యుక్త వయస్సు నుండే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేడు 40% కంటే ఎక్కువ మంది మహిళలు PCOD వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి మహిళల్లో సంతాలేమికి గురిచేస్తుంది.

hormone balancing foods women should include in their diet to manage pcos in telugu

సహజంగా స్త్రీలో హార్మోన్ల అసమతుల్యత వల్ల రుతుక్రమ సమస్యలతో మొదలవుతుంది, తర్వాత హిర్సుటిజం, ఊబకాయం మరియు రుతుచక్రంలో మార్పులు అన్నీ లక్షణాలుగా బయటకు వస్తాయి. అందుకు మొదట చేయవలసింది అనారోగ్యం సమయంలో సవాలుగా మారే హార్మోన్ల సమస్యను నియంత్రించడం. పిసిఒడి మరియు పిసిఓయస్ వంటి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు సాధారణ మహిళల కంటే ఎక్కువ శాతం మంది వంధ్యత్వానికి గురవుతారు. వంధ్యత్వం ఒకటే కాదు PCOD కారణంగా కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వంటి ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని ఆహారాలు మహిళల్లో పిసిఒడిని నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి గురించి మరింత ఇక్కడ తెలుసుకుందాం.

బాదం

బాదం

బాదం అందరికీ సుపరిచితమైన డ్రై నట్. కాబట్టి, ఆరోగ్య సంరక్షణ విషయంలో బాదం ఉత్తమ ఎంపిక అనడంలో సందేహం లేదు. ఎందుకంటే బాదంలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. PCOD కారణంగా స్త్రీలలో వచ్చే మొటిమలు మరియు ముఖ వెంట్రుకలు వంటి లక్షణాలను పూర్తిగా రివర్స్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే బాదం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ప్రయోజనాలను కలిగి ఉందనేది నిజం.

వాల్నట్

వాల్నట్

డ్రై నట్స్ లో వాల్ నట్స్ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హెల్తీ నట్స్ లో వాల్ నట్ ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఇది మహిళల్లో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిని నియంత్రించడంలో మరియు తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా రాత్రి నీళ్ళలో నానబెట్టిన వాల్ నట్స్ ను ఉదయాన్నే తినడం. అలా కుదరని వారు ఓట్ మీల్ లో గానీ, సలాడ్ లో గానీ, మరేదైనా పద్ధతిలో గానీ ఏదో ఒకరూపంలో మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. . ఇలా తినడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండడంతోపాటు రుతుక్రమ సమస్యలను పరిష్కరిస్తుంది.

గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాలు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో గుమ్మడి ఒకటి. గుమ్మడి గింజలు మనకు ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. మీ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవడం వల్ల మొటిమలు, జుట్టు రాలడం మరియు ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయి. గుమ్మడి విత్తనాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పురుష హార్మోన్ ను DHT గా మార్చడాన్ని అడ్డుకుంటుంది. అలాగే శరీరంలోని హార్మోన్ల పనితీరును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా గుమ్మడి విత్తనాల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతాయి. హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజలు

అవిసె గింజల్లో కూడా అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇవి వెలకట్టలేనివి. ఎందుకంటే ఇవి ఆరోగ్య సమస్యలను త్వరగా నయం చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో PCOS వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అవిసె గింజలు PCOD లక్షణాలను తగ్గించడం ద్వారా మొత్తం టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మీరు అవిసె గింజలను రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ స్మూతీస్‌లో మరియు సలాడ్‌ల పైన గార్నిషింగ్ గా ఉపయోగించవచ్చు.

తులసి

తులసి

అనారోగ్యాలకు దారితీసే అనేక అలవాట్లను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు కప్పులు కర్పూరం తులసితో తయారుచేసి టీ తాగితే మీ శరీరంలోని పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని బ్లాక్ టీలో కలుపుకోవచ్చు. ఇంకా ఐస్డ్ టీగా కూడా తాగడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పీరియడ్ సమస్యలను నివారిస్తుంది.

సాల్మన్

సాల్మన్

మాంసాహారాల్లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. చేపలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు, చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పురుషులలో టెస్టోస్టెరాన్, వాపు మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయని కూడా పరిశోధనలో తేలింది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ మధుమేహుల్లో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో మరియు రుతుక్రమాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. దీని ద్వారా మనం కొంత వరకు PCODతో పోరాడవచ్చు. మీరు ఎటువంటి సందేహం లేకుండా మీ ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చుకోవచ్చు.

 సార్డిన్

సార్డిన్

వివిధ రకాల చేపల్లో సార్డిన్స్ ఒకటి. సార్డిన్స్ మన ఆహారంలో తప్పనిసరి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే సార్డినెస్ తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, సార్డినెస్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీలో టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రుతుచక్రాన్ని మెరుగుపరుస్తుంది. అవాంచిత రోమాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. మహిళల్లో మొత్తం ఆరోగ్యం మరియు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

English summary

hormone balancing foods women should include in their diet to manage pcos in telugu

Here in this article we have listed best hormone balancing foods women should include their diet to manage PCOS in Telugu. Take a look.
Story first published:Monday, January 30, 2023, 14:28 [IST]
Desktop Bottom Promotion