For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hot bath: వేడి నీటి స్నానం 30 నిమిషాల నడకతో సమానం

|

Hot bath: స్నానం చేయడం అనేది ప్రతి ఒక్కరి సాధారణంగా రోజూ చేసేదే. అయితే కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. స్నానం అనేది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ముఖ్యమైనది. అయితే వేడి నీటి స్నానం, చల్లని నీటి స్నానం రెండింట్లో ఏది మంచిదో తెలుసుకుందాం.

వేడి నీటి స్నానం మంచిదేనా?:

వేడి నీటి స్నానం మంచిదేనా?:

చల్లని నీటితో స్నానం చేయడం కంటే కూడా.. వేడి నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుందని వెల్లడిస్తున్నారు. ఒంటి నొప్పులు ఉన్నప్పుడు వేడి వేడి నీటితో స్నానం చేస్తే రిలీఫ్ గా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. తీవ్ర అలసటగా ఉన్నప్పుడు కూడా చల్లని నీటితో స్నానం చేయడానికి బదులు వేడి వేడి నీటిని ఎంచుకోవాలని చెబుతున్నారు.

వేడినీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?:

వేడినీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?:

ఒక అధ్యయనం ప్రకారం.. వేడి నీటితో స్నానం చేస్తే ఒంట్లోని కేలరీలు కరుగుతాయట. నడక వల్ల కేలరీలు కరిగినట్లుగానే వేడి నీటితోనూ కేలరీలు బర్న్ అవుతాయి. లౌబరో యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు ఇందుకు సంబంధించి అధ్యయనం చేశారు. సాధారణ బాడీ టెంపరేచర్ ను ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెంచితే శరీరంలో జరిగే తేడాలను గమనించారు. ఈ పరిశోధనలో 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేసిన నీటిలో ఒక గంట స్నానం చేశారు. అదనంగా వారు ఒక గంట పాటు సైకిల్ తొక్కారు. కొన్ని ఫలితాలలో పెద్దగా తేడా లేనట్లు గమనించారు. స్నానం చేసిన వారితో పొలిస్తే.. సైకిలు తొక్కేటప్పుడు ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యాయి. అయితే వేడి నీటితో గంట సేపు స్నానం చేయడం వల్ల 130 కేలరీలు ఖర్చు అయ్యాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇది 30 నిమిషాలు నడవడానికి సమానమని గుర్తించారు.

వేడినీటి స్నానం కేలరీలను ఎలా బర్న్ చేస్తుంది?:

వేడినీటి స్నానం కేలరీలను ఎలా బర్న్ చేస్తుంది?:

ఈ ప్రక్రియ టబ్ ‌లో కేలరీలను బర్న్ చేయడాన్ని పాసివ్ హీటింగ్ అంటారు. వ్యాయామం చేసేలా కాకుండా, వేడి మరియు తేమతో కూడిన వాతావరణం మీకు శ్రమ లేకుండా చెమట పట్టేలా చేసినప్పుడు పాసివ్ హీటింగ్ జరుగుతుంది. హీట్ షాక్ ప్రోటీన్ల వల్ల ఇలా కేలరీలు బర్న్ అవుతుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రొటీన్లు వ్యాయామం చేసే సమయంలో, వ్యాయామం లేకుండా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పాసివ్ హీటింగ్‌లో ఉత్పత్తి అవుతాయి.

వేడి నీటి ఉపయోగం ఏమిటి?:

వేడి నీటి ఉపయోగం ఏమిటి?:

బయటి ఒత్తిడికి ప్రతిస్పందనగా మానవ శరీరంలోని అన్ని కణాలు తయారు చేసే అణువులనే హీట్ షాక్ ప్రోటీన్లు అంటారు. దీర్ఘకాలంలో ఈ ప్రోటీన్ల యొక్క పెరిగిన స్థాయిలు ఇన్సులిన్ పని తీరుకు మరియు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. డయాబెటిస్ ఉన్న వారిలో ఈ రకమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు వారి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటానికి, అలాగే వారి బరువును నిర్వహించడంలో వారికి సహాయపడటానికి పాసివ్ హీటింగ్ అనేది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

నీటిని కోల్పోవడమే:

నీటిని కోల్పోవడమే:

చెమట పట్టడం వల్ల మీరు కోల్పోయే బరువులో ఎక్కువ భాగం నీటి బరువే అయి ఉంటుందని గుర్తించాలి. అయితే దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. ఒంట్లో నీరు తగ్గే కొద్దీ తల తిరగడం మొదలవుతుంది. డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతూ ఉండాలి. అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు, మీ శరీరం విపరీతంగా చెమట పట్టడం కంటే కదలికల నుండి చాలా ఎక్కువ ప్రయోజనం పొందుతుంది.

వేడినీటితో మరికొన్ని ప్రయోజనాలు:

వేడినీటితో మరికొన్ని ప్రయోజనాలు:

మీరు మీ క్యాలరీ వ్యయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నా, చెమట పట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని గమనించాలి. దీనిని ఉపయోగించడం వల్ల ఎండార్ఫిన్‌లను పెంచవచ్చు. మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. మూత్ర పిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మొటిమలను తగ్గిస్తుంది. జలుబు ఇతర అనారోగ్యాలను నివారించవచ్చు.

వేడినీటి టబ్ స్నానం చేస్తే..

వేడినీటి టబ్ స్నానం చేస్తే..

వేడి నీటిని టబ్ స్నానం చేయడం లేదా వేడి వేడి నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నాటీ వ్యవస్థ విశ్రాంతికి లోనవుతుంది. నొప్పి, వాపు లాంటివి తగ్గుతాయి. అలాగే ఒత్తిడి దూరం అవుతుంది. ఆందోళనను కూడా చాలా తగ్గిస్తుంది. వేడి నీటితో అలసట తగ్గుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

వేడినీటితో మంచి నిద్ర:

వేడినీటితో మంచి నిద్ర:

వేడి నీటితో శరీరానికి ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. అలసట దూరం అవుతుంది. శరీర కండరాలు కూడా ఉపశమనం పొందుతాయి.దాని వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటివి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. అలసట నుండి ఉప శమనం ద్వారా వచ్చే నిద్ర గుండెకు మేలు చేస్తుంది. అలాగే వేడి నీటి స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. శరీరం అంతా రక్తం వేగంగా ప్రయాణిస్తుంది. రక్త ప్రసరణ వల్ల చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాల ఆధారంగా వైద్యులు చెబుతున్నారు.

English summary

Hot bath just as good as 30 minutes of walk, study says

read on to know Hot bath just as good as 30 minutes of walk, study says
Story first published:Friday, July 29, 2022, 11:32 [IST]
Desktop Bottom Promotion