For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి

తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి

|

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో లేదా సమయంలో తలనొప్పిని అనుభవించి ఉండవచ్చు. సాధారణంగా వచ్చే తలనొప్పికి ఒక్కొక్క కారణం ఉండవచ్చు, అందులో ఒకటి మధుమేహం కావచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హెచ్చుతగ్గులు అవుతుంటాయి. అందుకు కారణం మనం తినే ఆహారం మరియు మన జీవనశైలి. డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కర స్థాయిలు మారితే, దాని వల్ల అధిక బరువు, ఒత్తిడి, తలనొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి. అందుకు మెదడులోని హార్మోన్లలలో మార్పులు కారణమవుతాయి.

How Diabetes Causes Headaches And Prevention Tips For Diabetes Headache

వరల్డ్ హెత్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం జనాభాలో సగం మంది పెద్దలు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పిని అనుభవిస్తారని అంచనా వేయబడింది. తలనొప్పుల్లో వివిధ రకాలున్నాయి. అందులో మైగ్రేన్ నుండి టెన్షన్ హెడ్ఏక్, స్ట్రెస్ హెడ్ఏక్, మరియు క్లస్టర్ హెడ్ ఏక్ వరకు ఉన్నాయి. అలాగే సైనస్ ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు మందుల వాడకం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే మీకు మధుమేహం ఉన్నా కూడా తలనొప్పి రావచ్చు. మరి డయాబెటిస్ వల్ల తలనొప్పి ఎలా వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

అధిక రక్త పోటు

అధిక రక్త పోటు

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్(Amrican diabetes association) ప్రకారం, డయాబెటిస్ ఉన్నప్రతి ముగ్గురిలో ఇద్దరికి అధిక రక్తపోటు ఉంటుందని వెల్లడించారు. అధిక రక్తపోటు ఉన్న చాలా మందికి లక్షణాలు ఏవి కనబడవు. అయితే, రక్తపోటు ఎక్కువగా ఉంటే, మీకు తలనొప్పి రావచ్చు అని నిర్ధారించారు.

పరిష్కారం

పరిష్కారం

రక్తపోటు నియంత్రణలో లేకపోతే అది హార్ట్ అటాక్ మరియు కిడ్నీ డ్యామేజ్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అందుకోసం మీరు ఎప్పటికప్పుడు శారీరకంగా చురుకుగా ఉండటం, బరువు తగ్గడం, ధూమపానం మరియు మధ్యపానం మానేయడం, ఉప్పు తగ్గించడం, పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం ద్వారా మరియు రక్తపోటు మందులు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు.

స్లీప్ అప్నియా

స్లీప్ అప్నియా

నిద్రలేమి (స్లీప్ అప్నియా) అనేది ఒక సాధారణ మరియు తీవ్రమైన పరిస్థితి, ఇది నిద్రలో శ్వాసనాల మార్గం నిరంతరం నిరోధించబడినప్పుడు సంభవిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి నిద్రలేమి సమస్య (స్లీప్ అప్నియా) వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం లేదా గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా ఇది సాధారణం. స్త్రీల కంటే పురుషులకు స్లీప్ అప్నియా వచ్చే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ. గురక, సుదీర్ఘమైన స్లీప్ అప్నియా, నోరు పొడిబారడం, చిరాకు. లక్షణాలు తలనొప్పికి కారణాలుగా ఉన్నాయి.నిద్రలేమి సమస్యతో బాధపడే వారిలో అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, గుండెపోటు, స్ట్రోక్ మరియు కాలేయ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

పరిష్కారం :

పరిష్కారం :

బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ మరియు ధూమపానం మానేయడం వంటి జీవనశైలి చర్యల ద్వారా స్లీప్ అప్నియాను నియంత్రించవచ్చు.

హైపర్గ్లైసీమియా

హైపర్గ్లైసీమియా

హైపర్గ్లైసీమియా, లేదా రక్తంలో అధిక గ్లూకోజ్, తలనొప్పికి కారణమవుతుంది. డయాబెటిస్ పేషంట్స్ లో ఇది సాధారణం. మీ రక్తంలో చక్కెర స్థాయిలను బట్టి, మీరు లక్షణాలను కలిగి ఉండవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలో అధికంగా పెరిగినప్పుడు సాధారణ లక్షణాలు దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, అస్పష్టమైన దృష్టి మరియు తలనొప్పి.

పరిష్కారం

పరిష్కారం

తరచుగా మిమ్మల్ని తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే, మొదట మీరు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చెక్ చేయించుకోవడం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటే, తలనొప్పి మరింత అద్వాన్నంగా ఉంటుంది. కాబట్టి, డీహైడ్రేషన్ తగ్గించడానికి తగినంత నీరు త్రాగాలి. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించవచ్చు. హైపర్గ్లైసీమియా యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి, మీ డయాబెటిస్ చికిత్సకు కట్టుబడి ఉండండి.

హైపోగ్లైసీమియా

హైపోగ్లైసీమియా

హైపోగ్లైసీమియా అంటే రక్తంలో తక్కువ గ్లూకోజ్ స్థాయిలు. రక్తంలో తక్కువ గ్లూకోజ్ యొక్క లక్షణాలు రక్తంలో అధిక గ్లూకోజ్ లక్షణాల కంటే వేగంగా కనిపిస్తాయి. చెమటలు పట్టడం, తల తిరగడం, ఆకలి, చిరాకు, గందరగోళం మరియు తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

పరిష్కారం

పరిష్కారం

హైపోగ్లైసీమియా కారణంగా మీకు తలనొప్పి ఉంటే మీ రక్తంలో గ్లూకోజ్‌ని చెక్ చేయండి. సురక్షితంగా ఉండటానికి 4 గ్లూకోజ్ మాత్రలు, గ్లూకోజ్ జెల్ , 4 ఔన్సుల జ్యూస్ లేదా మిఠాయిని తీసుకెళ్లండి. మీకు చక్కెర తక్కువగా అనిపించినప్పుడు ఈ స్వీట్ తినండి. మీ రక్తంలో చక్కెర సురక్షిత స్థాయికి తిరిగి రావడంతో, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది.

English summary

How Diabetes Causes Headaches And Prevention Tips For Diabetes Headache in Telugu

Here we are discussing how diabetes causes headaches and prevention tips for diabetes headache. Take a look.
Story first published:Tuesday, January 31, 2023, 20:38 [IST]
Desktop Bottom Promotion