For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ డెవలప్ మెంట్, స్పెర్మ్ క్వాలిటీని పెంచే జామఆకు టీ? ఎలా చేయాలి? ఎప్పుడు తాగాలి?

|

చాలామంది పురుషులు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ లేకపోవడం లేదా స్పెర్మ్ ఉత్పత్తి కాకపోవడం. మనిషికి వీర్యకణాల కొరత వల్ల ఆ వ్యక్తి వివాహం చేసుకోలేక సంక్షోభం ఎదుర్కొంటాడు. వైవాహిక జీవితంలో భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది ముందుగానే తెలుసుకోవటానికి వ్యక్తిలో శారీరక స్థితి మరియు జననేంద్రియంలోని మార్పులను గమనించినప్పుడు జననేంద్రియాలలో మరియు దాని ఆకారం, చలన స్థితులలో మార్పులను గమనించడం మాత్రమే సాధ్యమవుతుంది.

How Guava Leaves Can Increase Sperm Count

మగవారు స్పెర్మ్ ఉత్పత్తి గురించి బాగా తెలుసుకోవాలంటే, స్పెర్మ్ అనలిస్ట్ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆ విధంగా స్పెర్మ్ లో ఏ లోపాలున్నా మీరు ఈ టెస్ట్ ద్వారా కనుగొనబడుతారు. దాంతో మీరు స్పెర్మ్ ను ఎలా ఉత్పతి చేయాలో తెలుసుకోవచ్చు. వీర్యకణాల ఉత్పత్తి, వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పెంచుకోవడానికి మీకు కావల్సిన సమాచారంను ఇక్కడ అందించాము. పురుషుల ప్రత్యుత్పత్తికి అవసరమయ్యే వీర్యం వ్రుద్దికి న్యాచురల్ గా లభించే ఒక ఆకు అందకు ఉత్తమంగా పనిచేస్తుంది. మరి ఆ ఆకు ఏమిటి? దాని వల్ల ప్రయోజనాలేంటి అన్న విషయం మనం ఇప్పుడు చూద్దాం!

ఏమి ఆకు?

ఏమి ఆకు?

పురుషుల స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే ఆ అద్భుతమైన ఆకు ఏమిటో మీకు తెలుసా? అది జామ ఆకు. జామ ఆకులు పునరుత్పత్తి శక్తిని పెంచుతాయి. ఈ జామ ఆకును నేరుగా నమిలి మింగడం లేదా పానీయంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి త్వరగా పెరుగుతుంది మరియు స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. ఇది తక్షణమే స్పెర్మ్ సంఖ్యను కూడా పెంచుతుంది. అంతే కాదు ఈ ఆకులు అదనంగా, మానవ శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఇతర ఉపయోగాలు

ఇతర ఉపయోగాలు

జామ ఆకులలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. మీరు ఈ ఆకులను టీ రూపంలో తయారు చేసి మూడు నెలలు తాగడం క్రమం తప్పకుండా తాగితే, శరీరంలో చెడు కొవ్వులను తొలగించుకోవడానికి మరియు దాని ద్వారా మంచి కొవ్వుతో శరీరంలో సరైన బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు శరీరంలో జీవక్రియలు సజావుగా నడుస్తూ ఉండటానికి ఇది సహాయపడుతుంది.

జామ ఆకులను రసంగా తయారు చేసి

జామ ఆకులను రసంగా తయారు చేసి

జామ ఆకులను రసంగా తయారు చేసి, వారానికి ఒకసారి తలకు అప్లై చేస్తే తలలో ఇన్ఫెక్షన్, చుండ్రు, పేను తొలగించడానికి సహాయపడుతుంది. జామా ఆకులను పొడి చేసి ఆహారం లేదా టీగా తీసుకుంటే, జీర్ణ సమస్యలను తొలగించడానికి, కడుపు సమస్యలను తొలగించడానికి మరియు మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇప్పుడు జామ ఆకుతో టీ ఎలా తయారుచేయాలో నేర్చుకుందాం!

ఇప్పుడు జామ ఆకుతో టీ ఎలా తయారుచేయాలో నేర్చుకుందాం!

జామ ఆకు టీ

కావలసినవి:

శుభ్రంగా ఉన్న జామ ఆకులు 5, నీరు ఒక గ్లాసు, తేనె కొద్దిగా, యాలకల పొడి కొద్దిగా.

విధానం:

విధానం:

శుభ్రమైన జామ ఆకులను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు లేదా తాజా ఆకులను నీటితో ఉడకబెట్టాలి; జామ ఆకులు నీటిలో బాగా ఉడికి నీరు రంగు మారినప్పుడు స్టౌ మీద నుండి క్రింది దింపి గోరువెచ్చగా చేసి అందులో రుచికి సరిపడా తేనె జోడించాలి, మంచి ఫ్లేవర్ కోసం యాలకలపొడి కూడా ఈ టీలో జోడించాలి. ఈ టీని గోరువెచ్చగా తాగాలి. మూడు నెలలు క్రమం తప్పకుండా తాగాలి. రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. అయితే ఉదయం పూట తాగితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

జామ ఆకుల నుండి తయారైన ఈ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల

జామ ఆకుల నుండి తయారైన ఈ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల

జామ ఆకుల నుండి తయారైన ఈ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల క్యాన్సర్, యాంటీబ్యాక్టీరియల్, చికాకు మరియు దురదలను నివారించడంలో సహాయపడుతుంది; అతిసారం, విరేచనాలు, జ్వరం, గొంతు సమస్యలు, ఇతర వ్యాధులను నయం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

విటమిన్లు

విటమిన్లు

జామ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫోలిక్ ఆమ్లం, ఫైబర్, విటమిన్ ఎ మరియు సి, ఐరన్ మరియు మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పండ్లలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు మరియు బోలిక్ ఆమ్లం స్పెర్మ్ సంఖ్య మరియు వాటి నాణ్యతను పెంచడానికి బాగా సహాయపడతాయి. శరీరానికి కీలకమైన పోషకాలను అందించడం ద్వారా శరీరాన్ని బలోపేతం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా మెరుగుపరచడానికి సహాపడుతుంది.

స్పెర్మ్ చికిత్సతో పాటు , జామ ఆకు టీ

స్పెర్మ్ చికిత్సతో పాటు , జామ ఆకు టీ

శరీరంలో అకస్మికంగా ఏర్పడే ఇతర లోపాల వలె ఉండి, చికిత్స తో నయం చేసుకోగల లోపం. దీనికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. దీని గురించి మూర్ఖంగా ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుని భాదపడకుండా, డాక్టర్ ను కలిసిని తగిన చికిత్స్ తీసుకుంటూ జామ ఆకుల టీని రెగ్యులర్ గా సేవిస్తే మీ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. దాంతో ఎలాంటి ఆందోళన లేని సంతోషకరమైన జీవితాన్ని పొదవవచ్చు.

English summary

How Guava Leaves Can Increase Sperm Count

How Guava Leaves Can Increase Sperm Count. Read to know more about..
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more