For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19 నకిలీ టీకాలను ఎలా గుర్తించాలి? ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది...

|

ఒకప్పుడు పాలల్లో కల్తీ... నీళ్లలో కల్తీ.. మనం తినే ప్రతి పదార్థంలో కల్తీ.. నకిలీ వస్తువుల గురించి మనల చాలా మందికి తెలిసిన విషయమే.. అందుకే'నకిలీ కాదేది అనర్హం'..అన్నారు కొందరు పెద్దలు.

అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లలో కూడా నకిలీ వ్యాక్సిన్లు వచ్చేశాయి. కరోనాను మనల్ని మనం కాపాడుకునేందుకు వ్యాక్సిన్లు వచ్చాయని సంతోషించేలోపే నకిలీ టీకాలు మార్కెట్లోకి వచ్చి మనల్ని మరింత ఇబ్బందులు పెడుతున్నాయి..

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ నకిలీ వ్యాక్సిన్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి టీకాలలో ఏవి అసలైనవి.. వాటిని ఎలా గుర్తించాలి... టీకాల యొక్క ప్రామాణికతను గుర్తించడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత రాష్ట్రాలకు కొన్ని పారామీటర్స్ లిస్టును షేర్ చేసింది. ఈ సందర్భంగా నకిలీ టీకాలను ఎలా గుర్తించాలి.. ఏది అసలైనదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

What is Nipah Virus Infection:నిఫా వైరస్ కు అడ్డుకట్ట వేయడమెలాగో తెలుసా...

WHO హెచ్చరికలు..

WHO హెచ్చరికలు..

ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికా వంటి దేశాలలో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క మోతాదులు అధిక స్థాయిలో విక్రయాలు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తించింది. ఈ నేపథ్యంలో మన దేశానికి కూడా నకిలీ టీకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వ్యాక్సిన్లను గుర్తించడానికి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నకిలీ టీకాలను గుర్తించడానికి మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది.

మన దేశంలో 3 టీకాలు..

మన దేశంలో 3 టీకాలు..

మన భారతదేశంలో సెప్టెంబర్ ఐదో తేదీ వరకు కేవలం మూడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఐదు టీకాలను అనుమతి లభించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మరియు స్పుత్నిక్ వి టీకాల్లో ఏది అసలైనదో గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కొన్ని పారామీటర్స్ ను కేంద్రం షేర్ చేసింది.

ఈ కలర్లో ఉండాలి..

ఈ కలర్లో ఉండాలి..

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోవిద్-19 వ్యాక్సిన్లలో అసలైన వాటికి లేబుల్ కలర్ షేడ్ డార్క్ గ్రీన్ కలర్ల ఉంటుంది. ఆర్ట్ వర్క్ ప్రకారం.. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ యొక్క కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. కేవలం వీటికి మాత్రమే ఆమోదం లభించింది. రియల్ టీకాలపై ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు స్పష్టంగా ఉంటుంది. అక్షరాలు చాలా క్లియర్(మనం చదివేలా) గా కనిపిస్తాయి. ఇవి ప్రత్యేక తెల్లని సిరాతో ముద్రించబడ్డాయి. సాధారణ స్టైల్ వైట్ కలర్ రివర్స్ లో ఉంటుంది. సాధారణ పేరు యొక్క అక్షరాల ఫాంట్ అన్ బోల్డ్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్క టీకాకు SII లోగో కచ్చితంగా ఉంటుంది. దీన్ని కొద్ది మాత్రమే గుర్తించగలరు. మొత్తం లేబుల్ కు ప్రత్యేక ఆక్రుతి తేనేగూడు ప్రభావం ఇవ్వబడింది. ఇది ఒక నిర్దిష్ట కోణంలో మాత్రమే కనిపిస్తుంది.

కచ్చితత్వాన్ని గుర్తించే పారామితులు..

కచ్చితత్వాన్ని గుర్తించే పారామితులు..

- UV కాంతి మీద మాత్రమే కనిపించే లేబుల్ పై కనిపించని UV హెలిక్స్.

- లేబుల్ లో దాచిన మైక్రో టెక్ట్స్ దావా డాటక్స్.. కోవాగ్జిన్ అని రాయబడి ఉంటుంది.

- కోవాగ్జిన్ మీద హాలోగ్రాఫిక్ కచ్చితంగా ఉంటుంది.

రష్యా టీకా పారామితులు..

రష్యా టీకా పారామితులు..

రష్యా దేశం నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు టీకాలు బల్క్ లో మన దేశంలోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సైట్ లకు రెండు వేర్వేరు లేబుల్స్ ఉన్నాయి. మొత్తం సమాచారం మరియు డిజైన్ ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, తయారీదారు పేరు మాత్రమే భిన్నంగా ఉంటుంది. మనం ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న అన్ని ఉత్పత్తుల కసం, ఇంగ్లీష్ లేబుల్ 5-ampoule ప్యాక్ యొక్క కార్టన్ ముందు మరియు వెనుక భాగంలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే అంపౌల్ లని ప్రాథమిక లేబుల్ తో సహా అన్ని వైపులా రష్యన్ భాషలో ఉంటుంది.

నకిలీ టీకా తయారీదారులపై చర్యలు..

నకిలీ టీకా తయారీదారులపై చర్యలు..

ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నకిలీ టీకా తయారీదారులపై నిఘా పెట్టామని.. అతి త్వరలో నకిలీ వ్యాక్సిన్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో నకిలీ టీకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని చెప్పారు. ‘ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్లు మన దేశంలో అమ్ముడయ్యాయని, వీటిని పరిశీలిస్తున్నామని, ఆధారాలు దొరికిన వెంటనే చర్యలు తీసుకుంటామని'మాండవ్య వివరించారు.

ఇప్పటివరకు కోవిషీల్డ్ యొక్క ప్రామాణికమైన టీకాలు ఆక్స్ ఫర్డ్-అస్ట్రాజెనెకా టీకా పూణేకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా తయారు చేస్తోంది. అదే సంస్థ విక్రయిస్తోంది. కోవాగ్జిన్ టీకాను హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ తయారు చేసి విక్రయిస్తోంది. మరోవైపు రష్యా దేశపు టీకా స్పుత్నిక్ విని డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ తో సహా దాని నమోదిత దేశీయ ఔషధ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేసి సరఫా చేస్తున్నారు.

అసలైన టీకాలను ఎలా గుర్తించాలంటే...

* SII(సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) పేరుతో లేబుల్ ఉంటుంది.

* కోవిషీల్డ్ బ్రాండ్ పేరు.. ట్రేడ్ మార్కు(TM)గుర్తు ఉంటుంది.

* సాధారణ ఫాంటులో(Bold ఉండదు) దావా అనే పేరు ఉంటుంది

* గ్రీన్ కలర్ లేబుల్.. దానిపైన తెలుపు రంగులో అక్షరాలు ఉంటాయి

* గ్రీన్ కలర్ లో అల్యూమినియంతో కూడిన బాటిల్ మూత ఉంటుంది

* స్టిక్కర్ పైన రెడ్ కలర్లో CGS Not For Sale అనే స్టాంపు ఉంటుంది

అసలైన కోవాగ్జిన్ టీకా ఇలా?

* ఈ వ్యాక్సిన్లో లేబుల్ పైన డిఎన్ఎ మాదిరిగా గుర్తులు కనిపిస్తాయి.

* లేబుల్ పై చాలా చిన్న చుక్కల రూపంలో కోవాగ్జిన్ పేరు ఉంటుంది.

* COVAXIN పేరులో x అక్షరం తొలి సగభాగం డార్క్ గ్రీన్ లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

* కోవాగ్జిన్ హాలోగ్రామ్ కచ్చితంగా ఉంటుంది.

Sputnik-v

* రష్యాకు చెందిన ఈ టీకాలు రెండు బాటిళ్ల డిజైన్ ఉంటుంది

* ఇందులో సమాచారం ఒకటే మాదిరిగా ఉంటుంది

* అయితే తయారీ సంస్థ పేరు వేరుగా ఉంటుంది.

* ఒక్కో టీకా బాక్సులో 5 ఇంజక్షన్ సీసాలు ఉంటాయి. వీటి వెనుక, ముందు భాగంలో ఇన్ఫర్మేషన్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది.

* సీసా లేబుల్ పై మాత్రం రష్యాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది.

English summary

How to identify fake COVID-19 vaccines? Health ministry issues guidelines ; All you need to know in Telugu

Health Ministry Issues Guidelines To Identify Fake COVID-19 Vaccines, Here are the Parameters to check the authencity of Covid-19 vaccines. Read on
Desktop Bottom Promotion