For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొద్దిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్... అదొక్కటి సక్సెస్ అయితే అందరికీ అందుబాటులోకి...!

కరోనా వ్యాక్సిన్ విషయంలో భారతదేశం మరో ముందడుగు వేసింది.

|

కరోనా వైరస్ కు విరుగుడు కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే రోజురోజుకు కరోనా కేసులు లక్షల సంఖ్యంలో పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

India now has two coronavirus vaccines set for human trails; all you need to know

ప్రత్యేకించి మన భారతదేశంలో పరిస్థితి రోజురోజుకు చాలా దారుణంగా తయారవుతోంది. ఇటీవల మన దేశంలో కరోనా కేసులు 7 లక్షల సంఖ్యను దాటి, పాయింట్ల పట్టికలో రష్యాను అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరింది.
India now has two coronavirus vaccines set for human trails; all you need to know

అయితే కరోనా వైరస్ కు సంబంధించి ఇటీవలే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చినట్లు రెండు కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఇంకా పూర్తిగా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు.
India now has two coronavirus vaccines set for human trails; all you need to know

ఇంతలోనే కరోనా విరుగుడు విషయంలో మరో శుభవార్త చెప్పాయి రెండు కంపెనీలు. భారత్ బయోటెక్ తో పాటు హైదరాబాద్ కు చెందిన మరో కంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్ లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, తమకు క్లీనికల్ ట్రైల్స్ కు కూడా అనుమతులు వచ్చాయని ప్రకటించాయి.
India now has two coronavirus vaccines set for human trails; all you need to know

అయితే ఒకప్పుడు ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో అనుమతులు ఇవ్వడానికి ICMR సిద్ధమైంది. దీంతో వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా వేగంగా ఓ కొలిక్కి వస్తున్నాయ్. చైనా కూడా ఈ పరిశోధనలను చాలా వేగంగా చేస్తోంది. అక్కడ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఎలాంటి ముడిసరుకుల కొరత లేదు. ఈలోపే ప్రపంచ మార్కెట్లోకి మన వ్యాక్సిన్ ప్రవేశపెట్టాలని మన దేశం ధ్రుఢ నిశ్చయంతో ఉంది.

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మీరు చేసే ఈ తప్పులు మీ జీవితానికి అపాయం కలిగిస్తాయి ...!కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మీరు చేసే ఈ తప్పులు మీ జీవితానికి అపాయం కలిగిస్తాయి ...!

ప్రయోగాలపై ధీమా..

ప్రయోగాలపై ధీమా..

హైదరాబాద్ చెందిన ఓ రీసెర్చ్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో చాలా ధీమాగా ఉంది. ఇప్పటికే జంతువులపై నిర్వహించిన ట్రైల్స్ సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. అంతేకాదు తమకు డిజిసిఐ, ఐసిఎంఆర్ అనుమతులు కూడా లభించిందని చెప్పింది.

ఆగస్టు నెలలోనే..

ఆగస్టు నెలలోనే..

వీరి లెక్కల ప్రకారం ఆగస్టు 15వ తేదీ నాటికి కరోనా వ్యాక్సిన్ లాంఛ్ చేయడమే కాదు.. పంపిణీ కూడా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

12 చోట్ల క్లినికల్ ట్రయల్స్..

12 చోట్ల క్లినికల్ ట్రయల్స్..

వచ్చే నెలలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్మదాబాద్ కు చెందిన మరో కంపెనీ, ఏకంగా 12 క్లినికల్ ట్రయల్ సైట్లలో చేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించింది.

జినోమ్ వ్యాలీలో..

జినోమ్ వ్యాలీలో..

హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ యొక్క బిఎస్ఎల్-3(బయో-సేఫ్టీ లెవల్ 3) హై కంటైన్మెంట్ ఫెసిలిటీలో స్వదేశీ క్రియారహిత వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది.

యుద్ధప్రాతిపదిక టీకాలు..

యుద్ధప్రాతిపదిక టీకాలు..

కరోనా మహమ్మారికి చెక్ పెట్టడంలో మన హైదరాబాద్ కు చెందిన రీసెర్చ్ కంపెనీ యుద్ధప్రాతిపదికన కోట్ల టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం పూర్తిగా ఉండటంతో, ఒకవైపు ప్రయోగాలు చేస్తూనే, మరోవైపు వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభించిందేమో అనిపిస్తుంది.

ఇంకా ఆమోదం రాలేదు..

ఇంకా ఆమోదం రాలేదు..

అయితే ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా వైరస్ కు విరుగుడుగా వాణిజ్య వినియోగం కోసం ఎలాంటి వ్యాక్సిన్ ఆమోదించబడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థుల నుండి డజనుకు పైగా ప్రస్తుతం మానవులపై క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరుపుతున్నారు.

English summary

India now has two coronavirus vaccines set for human trails; all you need to know

Here we talking about India now has two coronavirus vaccines set for human trails; all you need to know
Desktop Bottom Promotion