For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bathing: రోజూ స్నానం చేయాలా? ఆరోగ్యం బాగుండాలంటే తప్పదా?

|

Bathing: జీవనశైలి అలవాట్లు మంచి ఆరోగ్యానికి అత్యంత కీలకం. మన అలవాట్లే వ్యాధుల నుండి మనల్ని దూరంగా ఉంచుతాయి. అలాగే మన ఆయుర్దాయం పెరగడానికి సహాయపడతాయి.సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు. వీటితో పాటు ప్రతి రోజూ స్నానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అలవాటుగానే పరిగణిస్తారు. ఇది మంచి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తుంది.

చాలా రకాలుగా స్నానం చేయవచ్చు. అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. షవర్ ద్వారా స్నానం చేయవచ్చు. నీటి ఆవిరితో శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. బాత్‌ టబ్- షవర్ బాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, స్నానం చేయడం మానసిక, శారీరక ఆరోగ్యం, సామాజిక పని తీరు, భావోద్వేగ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే ప్రతి రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచి చేస్తుందా..? దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదా..? వాటికి కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.

రోజూ స్నానం చేయడం అవసరమా?

రోజూ స్నానం చేయడం అవసరమా?

స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుంది. మురికి పోతుంది. చర్మపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. అలాగే శరీరానికి పట్టిన చెమట పోతుంది. అయితే ప్రజలు రోజూ స్నానం చేయడానికి ఆరోగ్యం అనేది కారణం కాదని హార్వర్డ్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. స్నానాన్ని ఒక అలవాటుగా, శుభ్రం చేసుకోవడంలో భాగంగానే చూస్తారని తేలింది. అలాగే శరీరం నుండి వచ్చే దుర్వాసనను తొలగించుకోవడానికి స్నానం చేస్తారని అధ్యయనంలో వెల్లడైంది. రోజూ వ్యాయామం తర్వాత చెమట వస్తుంది. దీనిని తొలగించుకోవడానికి స్నానం సాయం చేస్తుంది.

తరచూ స్నానం చేస్తే ఏమవుతుంది?

తరచూ స్నానం చేస్తే ఏమవుతుంది?

ది ఓహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్ ప్రచురించిన ఒక బ్లాగ్ ప్రకారం.. చాలా తరచుగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. అలాగే చర్మంపై దురద ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి చర్మ వైద్యులు కారణాలు చెబుతున్నారు. చర్మాన్ని కాపాడటానికి సహజంగా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. చర్మంపై నూనెలు, సహజమైన బ్యాక్టీరియా ఉంటుంది. తరచూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే మంచి బ్యాక్టీరియా, నూనె కోల్పోతుంది. దీని వల్ల దురద లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం వల్ల కూడా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మంపై సహజంగా వచ్చే నూనె లేకపోతే... చర్మం పొడిబారిపోయి.. పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల నుండి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. అలా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. తరచూ తల స్నానం చేయడం కూడా ఏమాత్రం మంచిది కాదు. జుట్టు మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు దెబ్బతింటుంది. దీని వల్ల జుట్టు ఊడిపోతుంది.

అయితే అప్పుడప్పుజు మాత్రమే స్నానం చేయాలా?

అయితే అప్పుడప్పుజు మాత్రమే స్నానం చేయాలా?

స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. వీటి ఆధారంగా.. రోజూ స్నానం చేయాలని, చేయవద్దని చెప్పలేము అనేది నిపుణులు చెప్పే మాట. రోజూ స్నానం చేయాలని ఎవరూ చెప్పరు. కానీ చెమట, దుర్వాసన, మురికి ఉన్న వారు మాత్రం రోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉండవచ్చు. స్నానం చేసే సమయంలో ఎక్కువ గాఢత ఉన్న సబ్బులను వాడవద్దని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ అధికంగా స్నానం చేయడం వల్ల అలెర్జీకి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఎవరికి స్నానం చేయడం ఎంత అవసరం అనేదానిపై రోజూ స్నానం చేయాలా.. లేదా అనేది ఆధారపడి ఉంటుంది.తరచుగా స్నానం చేయడం అనేది ఆరు బయట వాతావరణం, చర్మం రకం, శారీరక శ్రమ, అలెర్జీలు లేదా చర్మ రుగ్మతలు, స్నానం చేసే సమయం, వ్యవధి, నీటి ఉష్ణోగ్రత లాంటి అనేక రకాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటూ, రోజూ వ్యాయామం చేస్తే, వారు రోజూ షవర్‌లో మునిగిపోతారని, వ్యవధి తక్కువగా ఉండేలా చూసుకుని వేడికి బదులుగా గోరు వెచ్చని నీటిని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, వారానికి రెండు లేదా మూడు సార్లు స్నానం చేయడం ఆరోగ్యకరమైనది మరియు పర్యావరణ ప్రయోజనకరమైనదని అంటున్నారు.

స్నానం గురించి మరికొన్ని విషయాలు

స్నానం గురించి మరికొన్ని విషయాలు

మీరు రోజూ స్నానం చేస్తుంటే.. స్నానం చేసిన వెంటనే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోండి. వారానికి రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తుంటే, మీ వ్యక్తి గత పరిశుభ్రతను పాటించేలా చూసుకోండి. అలాగే దుర్వాసన రాకుండా ఉండటానికి జననాంగాలు, చంకల్లో శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండే క్రిములు తొలగిపోతాయి. దుర్వాసనకు దారి తీసే బ్యాక్టీరియా దూరం అవుతుంది. తరచూ స్నానం చేయని వారు ఈ పద్ధతి తప్పక పాటించాలని చెబుతున్నారు వైద్యుు. లేకపోతే దుర్వాసనతో పాటు బ్యాక్టీరియా పెరిగి దురద, దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

ఒక వ్యక్తి తన శరీర రకం మరియు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండటానికి స్నానం ఎంత అవసరమో అతనికే బాగా తెలిసి ఉంటుంది. ఎక్కువగా స్నానం చేయడం లేదా అతిగా శుభ్రపరచడం మానుకోండి. అయితే అవసరమైనప్పుడు స్నానం చేయడం మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం.

English summary

Is bathing everyday necessary for good health in telugu

read on to know Is bathing everyday necessary for good health in telugu
Story first published:Monday, July 18, 2022, 15:02 [IST]
Desktop Bottom Promotion