For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Is Delmicron A New COVID Variant:డెల్మిక్రాన్.. ఒమిక్రాన్ కన్నా ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి?

డెల్మిక్రాన్ కొత్త వేరియంట్ యొక్క లక్షణాలు, చికిత్స విధానం మరియు ఇది ఒమిక్రాన్ ఎంత భిన్నంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నుండి బయటపడుతుంటే.. కొత్తగా ఒమిక్రాన్ వైరస్ కొత్త వేరియంట్ కలవరానికి గురి చేస్తోంది. ఇది ఎలా సోకుతుంది.. దీని లక్షణాలేంటి అనే విషయాలపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

Is Delmicron A New COVID Variant? Know its symptoms, treatment and how its different from Omicron in Telugu

అయితే ఇంతలోనే ఒమిక్రాన్ కన్నా భిన్నమైనది.. వేగంగా విస్తరించే మరో మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించింది. మన దేశంలో కరోనా డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వేగంగా పెరుగుతున్నాయి.

Is Delmicron A New COVID Variant? Know its symptoms, treatment and how its different from Omicron in Telugu

అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలపడం ద్వారా వీటికి ఈ పేరు పెట్టారు. ఈ డెల్మిక్రాన్ కేసులు అమెరికాలో మరియు యూరప్ లలో బాగా పెరిగాయట. డెల్మిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్.. ఒమిక్రాన్ కరోనా వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందట. ఈ సందర్భంగా డెల్మిక్రాన్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీనిపై వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? చికిత్సా పద్ధతులేంటి...హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? చికిత్సా పద్ధతులేంటి...

ఒమిక్రాన్ కన్నా భిన్నమైనదా?

ఒమిక్రాన్ కన్నా భిన్నమైనదా?

ఒమిక్రాన్ అనేది సార్స్ కోవిద్ యొక్క అత్యంత పరివర్తనం చెందిన బి.1.1.529 రూపం. ఇది మొట్టమొదటిసారిగా సౌతాఫ్రికాలో కనుగొనబడింది. ఇది రూపాంతం చెంది వేగంగా వ్యాపించింది. ఇది డెల్టా వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ లక్షణాలను చూపుతోంది. అయితే డెల్టా వేరియంట్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయితే డెల్మిక్రాన్ అనేది డెల్టా మరియు ఒమిక్రాన్ రెండింటిని కలపడం వల్ల ఏర్పడింది. ఇది ప్రాథమికంగా వేరియంట్ల జంట స్పైక్. కాబట్టి కరోనా డెల్టా వేరియంట్.. ఒమిక్రాన్ లక్షణాలు రెండూ ఉన్న వారికి డెల్మిక్రాన్ సోకినట్లు నిర్ధారిస్తున్నారు.

వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా?

వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఇప్పటికే టీకాలు వేసుకున్నప్పటికీ.. ఈ మహమ్మారి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వైరస్ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని వివరించారు. అయితే ప్రజలందరూ టీకాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

గుండె జబ్బులు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఇది వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?గుండె జబ్బులు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఇది వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుదల..

ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుదల..

గత నెలలో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా ఒమిక్రాన్ వైరస్ గుర్తించబడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా ముగిసిందే ఆశలు చిగురించాయి. అయితే అంతలోనే మరో కొత్త వేరియంట్ అత్యంత వేగంతో విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే 106 దేశాలలో కనుగొనబడిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు వివరించారు.

మన దేశంలో ఎక్కడంటే?

మన దేశంలో ఎక్కడంటే?

ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి కొన్ని బూస్టర్ డోసులు తీసుకుంటే.. వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా ప్రారంభంలో ఇబ్బందులు ఉండకపోవచ్చని వివరించింది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపిన వివరాల మేరకు.. మన దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 236 కరోనా వైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 104 మంది కోలుకున్నారు. అందరి కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 65 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 64, తెలంగాణలో 24, కర్నాటక 19, రాజస్థాన్ 21 మరియు కేరళలో 15 కేసులు నమోదైనట్లు వివరించారు. దీంతో పాటు భారతదేశంలో 7,495 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల వల్ల మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అయినా సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.

FAQ's
  • ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపించే వైరస్ కు ఏమని పేరు పెట్టారు?

    మన దేశంలో కరోనా డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వేగంగా పెరుగుతున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలపడం ద్వారా వీటికి ఈ పేరు పెట్టారు.

English summary

Is Delmicron A New COVID Variant? Know it's symptoms, treatment and how it's different from Omicron in Telugu

Here we are talking about the Delmicron a new covid variant? Know It's symptoms, treatment and how it's different from omicron in Telugu. Read on
Story first published:Thursday, December 23, 2021, 14:29 [IST]
Desktop Bottom Promotion