For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం

దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం

|

ఇటీవలి కాలంలో బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాలిక సమస్యలు ప్రజల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి, అదేవిధంగా థైరాయిడ్ సమస్య కూడా పెరుగుతోంది. గొంతులోని థైరాయిడ్ గ్రంధి దెబ్బతిన్నప్పుడు, ఈ హార్మోన్ ప్రభావం వల్ల శరీరంలో అనేక హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. ముఖ్యంగా కొన్ని లక్షణాలు సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో అలసట, నీరసం, ఎక్కువగా చెమటలు పట్టడం, అధిక బరువు పెరగడం, గొంతులో వాపు, మరియు ఇరత అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

List of Superfoods which helps to prevent thyroid symptoms in telugu

అయితే మన శరీరానికి థైరాయిడ్ హార్మోన్ చాలా అవసరం. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదల అయ్యే హార్మోన్లు బలహీనంగా ఉంటే లేదా అది చాలా తరచుగా విడుదల చేయబడితే, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి లేదా రాబోయే రోజుల్లో ఈ సమస్య ఉండకూడదనుకునే వారికి ఆయుర్వేద వైద్యుడు డా. దీక్షా భావసర్ ఈ కథనంలో ఎలాంటి ఆహారాలు తినాలి అనే సమాచారాన్ని పంచుకున్నారు.

ఉసిరికాయ

ఉసిరికాయ

సగటు నారింజతో పోలిస్తే ఉసిరికాయలో 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి అధికంగా ఉంటుంది. దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే దీన్ని థైరాయిడ్‌కి సూపర్‌ ఫుడ్‌గా చెప్పవచ్చు.

ఉసిరికాయను జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఇది ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రు నివారిస్తుంది, ఇది స్కాల్ప్ లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ ఫోలికల్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది. జుట్టు రాలడం, జుట్టు అకాల నెరవడం, చుండ్రు మొదలైన వాటిని నివారిస్తుంది. ఉసిరికాయను పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే మార్కెట్లో పౌడర్ అందుబాటులో ఉంది. దీన్ని రోజూ నీటిలో కలిపి తాగాలి.

పసెలు

పసెలు

గ్రీన్ కలర్ లో ఉండే పెసలు థైరాయిడ్ కు ఉత్తమైనదని అంటారు. ఎందుకంటే ఇందులో థైరాయిడ్ ను నివారించే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు మరియు విటిమన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్దక సమస్యలను నివారిస్తుంది. పెసలు సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇది థైరాయిడ్ లక్షణాలను నివారించడంలో అద్భుతమైన ఆహారం.

 కొబ్బరి

కొబ్బరి

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి ఉత్తమ ఆహారంగా చెప్పవచ్చు. కొబ్బరి లేదా కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. ఇది నెమ్మదిగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చి కొబ్బరి మరియు మంచిది లేదా స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడాలి. కొబ్బరిలో MCFAలు అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు మరియు MTCలు అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ధనియాలు

ధనియాలు

ధనియాల్లో థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. విటమిన్లు A, C మరియు K మొత్తం ఎక్కువగా ఉంటుంది మరియు పోలెట్ ఎక్కవు మొత్తంలో ఉంటాయి. ఇవి శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే కాలేయంలో T3 మరియు T4 యొక్క కార్యాచరణను పెంచుతాయి. ఇందుకోసం ఉదయం ఖాళీ కడుపుతో ధనియాల గింజలను వేయించి పొడి చేసి నీటిలో వేసి తాగడం అలవాటు చేసుకోండి.

బ్రెజిల్ నట్:

బ్రెజిల్ నట్:

బ్రాజిల్ నట్స్ అనేది థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియకు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకం. T4ని T3గా మార్చడానికి బ్రెజిల్ గింజ అవసరం. బ్రెజిల్ నట్స్ లో ఈ పోషకం ఉత్తమ సహజ వనరులలో ఒకటి. ప్రోటీన్ ఫుడ్స్ లో ఉత్తమమైనది , శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కలది. కాబట్టి, శరీరానికి అవసరమైన మోతాదులో అందించడానికి మూడు బ్రాజిల్ నట్స్ తినాలి.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజల్లో అధిక స్థాయిలో జింక్ ఉంటుంది. దీంతో పాటు విటమిన్లు మరియు మినిరల్స్ ను గ్రహించడంలో గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో థైరాయిడ్ సమతుల్యతను కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో గుమ్మడి గింజలను తీసుకోవడం ఉత్తమం. ఇది శరీరంలోని థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేసి ఉత్పత్తిని కూడా పెంచుతుంది. డా. దీక్ష ప్రకారం, మీకు కావలసినప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను చిరుతిండిగా తినవచ్చు.

English summary

List of Superfoods which helps to prevent thyroid symptoms in telugu

Here are the List of Superfoods which helps to prevent thyroid symptoms in telugu. Read on..
Story first published:Tuesday, January 24, 2023, 13:02 [IST]
Desktop Bottom Promotion