For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marburg: ఆఫ్రికాలో మరో డెడ్లీ వైరస్.. మర్ బర్గ్ తో ఇద్దరు మృతి

|

Marburg: ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. రోజుకో కొత్త వేరియంట్ వచ్చి జనాల్ని హడలెత్తిస్తోంది. మ్యూటేషన్ లు జరుగుతూ వైరాలజిస్టులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో మంకీపాక్స్(monkeypox) అంటూ మరో వైరస్ వస్తోందని... ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొందరు మంకీ పాక్స్ అంత ప్రమాదకరం కాదని అంటుంటే.. మరికొందరేమో మంకీపాక్స్ వల్ల ప్రాణాలు కూడా పోతాయని చెబుతూ భయపెట్టిస్తున్నారు. ఈ భయాల మధ్యే ఆఫ్రికాలో మరో డెడ్లీ వైరస్ బయటపడింది.

Marburg outbreak in Ghana Know symptoms, fatality rate in Telugu

తాజాగా బయటపడిన దానిని మర్బర్గ్(Marburg) వైరస్ గా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకిన కేసులు ఘానాలో వెలుగులోకి రావడం ఉలికిపాటుకు గురి చేస్తోంది. ఈ మర్బర్గ్ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ లో ఎబోలా మాదిరి లక్షణాలు ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ వైరస్ సోకి చనిపోయిన వారిలో... అంతకుముందు డయేరియా, వాంతులు, వికారం, జ్వరం లాంటి లక్షణాలు కనిపించాయని అక్కడి వైద్యులు తెలిపారు. మర్బర్గ్ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు... పరీక్షలు నిర్వహించగా భయపడిందే జరిగింది. కచ్చితత్వం కోసం నమూనాలను సెనెగల్ లోని పాస్ట్యూర్ ల్యాబ్ కు పంపించి పరీక్షించారు. అందులోనూ వారికి వచ్చింది మర్బర్గ్ వైరసేనని తేలింది.

మర్బర్గ్ అంటే ఏంటి?

ఈ మర్బర్గ్ వైరస్ ఎబోలా(ebola) ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇది ఓ అంటువ్యాధి. ఈ వైరస్ కూడా గబ్బిలాల నుండే వ్యాప్తి చెందుతోంది. గబ్బిలాలు తిన్న పండ్ల నుంచి కూడా వ్యాపిస్తుంది.

మర్బర్గ్ ఎలా వ్యాపిస్తుంది?

మర్బర్గ్ ఎలా వ్యాపిస్తుంది?

గబ్బిలాల నుండి మనుషులకు సోకుతోంది ఈ మర్బర్గ్ వైరస్. ఈ మర్బర్గ్ వైరస్ ఉన్న వారి నుండి వచ్చే శారీరక ద్రవాలు తాకినప్పుడు ఈ వైరస్ ఇతరులకు కూడా సోకుతుంది. అలాగే వారితో దగ్గరి సంబంధం ఉన్నా ఈ వైరస్ వస్తుంది. లాలాజలం, రక్తం నుండి ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది.

మర్బర్గ్ లక్షణాలు

ఘనాలోని అశాంతి రీజియన్ కు చెందిన ఇద్దరిలో ఈ వైరస్ ను మొదట గుర్తించారు. అయితే వీరిలో వాంతులు, విరేచనాలు, జ్వరం, వికారం డయేరియా లాంటి లక్షణాలు కనిపించాయని అక్కడి ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

* ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 2 రోజుల నుండి 3 వారాల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. ఆలోపు ఈ వైరస్ ను గుర్తించడం కష్టం.

* లక్షణాలు కనిపించడం ప్రారంభమైన మొదట్లో అధిక జ్వరం వస్తుంది.

* తల నొప్పి తీవ్రంగా ఉంటుంది.

నకండరాలు నొప్పి పెడతాయి.

* పూర్తిగా అసౌకర్యంగా అనిపిస్తుంది.

* 3 వ రోజు నుండి కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులతో ఇబ్బంది పడతారు

* నీటి రూపంలో విరేచనాలు వస్తుంటాయి. ఇవి తీవ్రంగా ఉండటంతో నీరసం ఆవహిస్తుంది.

* తీవ్రమైన లక్షణాలు ఉన్న సందర్భాల్లో ముక్కు, చిగుళ్ళు మరియు యోని నుండి కూడా రక్తస్రావం జరగవచ్చు.

* ఈ లక్షణాలు కనిపించడం ప్రారంభించిన 8 నుండి 9 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

మొదటి కేసు ఎక్కడ నమోదైంది?

మొదటి కేసు ఎక్కడ నమోదైంది?

ఈ వైరస్ తొలి సారిగా 1967లో బయటపడింది. ఈస్ట్, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి దాదాపు చాలా సార్లు వచ్చింది. వందలాది మందిని కబళించింది. గతేడాది గినియాలో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. చివరి సారి మర్బర్గ్ ఔట్ బ్రేక్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది.

మరణాల రేటు ఎంత ఉంటుంది?

ఎబోలా కుటుంబానికి చెందిన మర్బర్గ్ వైరస్ కూడా ఎబోలా మాదిరిగా ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మరణాలు రేటు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సగటున 24 శాతం నుండి 88 శాతానికి పైగా మరణాలు సంభవిస్తాయని వైరాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 24 నుండి 88 మంది చనిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ఘనా ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఘనా ప్రభుత్వం ఏం చేస్తోంది?

మర్బర్గ్ తో ఇద్దరు రోగులు చనిపోయిన తర్వాత ఘనా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ వైరస్ మళ్లీ వెలుగు చూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. చనిపోయిన రోగులకు దగ్గరగా ఉన్న వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్ లను పరీక్షిస్తోంది. అయితే ఇప్పటి వరకు వేరే వ్యక్తుల్లో మర్బర్గ్ లక్షణాలు కనిపించలేదని అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పశ్చిమాఫ్రికాలో మొత్తంగా మర్బర్గ్ కేసులు రావడం ఇది రెండోసారి.

ఘనా ఆరోగ్య శాఖ అధికారులు వేగంగా స్పందించి కట్టడి చర్యలు చేపట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ మాట్షిడిసో హర్షం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి, నిర్ణయాత్మక చర్యలు చేపడితే మర్బర్గ్ లాంటి ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేయవచ్చని ఆయన చెప్పారు.

English summary

Marburg outbreak in Ghana Know symptoms, fatality rate in Telugu

read on to know Marburg outbreak in Ghana Know symptoms, fatality rate in Telugu
Story first published:Wednesday, July 20, 2022, 11:03 [IST]
Desktop Bottom Promotion