For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిరియాలు పురుషుల స్పెర్మ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా?

మిరియాలు పురుషుల స్పెర్మ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా?

|

భారతదేశంలో ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలలో మిరియాలు ఒకటి. భారతదేశం మరియు మిరియాలు చరిత్రకు ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఎందుకంటే మిరియాలు కొనడానికి బ్రిటిష్ వారు భారతదేశంలో తొలిసారిగా అడుగుపెట్టారు. మిరియాలు అన్ని పేదవారి నుండి ధనికుల వరకు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మిరియాలు ఎక్కువగా ప్రజాదరణ పొందడానికి మరియు ఎక్కువగా వంటల్లో ఉపయోగించడానికి దాని వాసన మరియు మసాలా రుచి వల్ల మాత్రమే కాదు, దానిలోని అసంఖ్యాక వైద్య లక్షణాలు. మిరియాలు భారతీయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. భారతదేశంలో మిరియాలు లేని వంటగది ఉండదని చెప్పవచ్చు. ఈ ప్రత్యేక మిరియాలు మీకు కొన్ని ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. గతంలో బ్లాక్ పెప్పర్ వల్ల అనేక ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ రోజు మిరియాల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది

జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది

నల్ల మిరియాలు గ్యాస్ట్రిక్ శ్లేష్మ గాయానికి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అధ్యయనంలో నల్ల మిరియాలు ఇచ్చిన పదార్థం తిన్న వారిలో గ్యాస్ట్రిక్ రక్తస్రావం సంకేతాలను చూపించింది. దాంతో మనం నిత్యం తినే ఆహారంలో ఉపయోగించే పదార్థాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడింది. మిరియాల్లో ఉండే పైపెరిన్ రుచి జోడిస్తుంది, తర్వాత వంటకు మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. ఇది చాలా ప్రయోజనాలను అందించే సమ్మేళనం. కానీ ఎక్కువగా తినడం వల్ల మీ గొంతు, కడుపు మంటకు గురిచేస్తాయి.

కొన్ని మందులు ఎక్కువగా గ్రహిస్తాయి

కొన్ని మందులు ఎక్కువగా గ్రహిస్తాయి

నల్ల మిరియాలు కొన్ని ఔషధాల శోషణను ప్రోత్సహిస్తాయి. పైపెరిన్ మందులు శోషణను మెరుగుపరిచే పనిని చేస్తాయి. ఇది హెపటిక్ మెటబాలిజం మరియు అలర్జీలతో పోరాడే యాంటీహిస్టమైన్స్ ఔషధం సరిగా గ్రహించనప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది, మిరియాల్లో ఉండే పెప్పరిన్ కొన్ని ఔషధాలను అధికంగా గ్రహించడం ద్వారా ప్రమాదానికి దారితీస్తుంది.

కొన్ని మందులతో జోక్యం చేసుకుంటుంది

కొన్ని మందులతో జోక్యం చేసుకుంటుంది

నల్ల మిరియాలులోని పైపెరిన్ కొన్ని మిశ్రమ ఔషధాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రయోజనాలకు దారితీస్తుంది మరియు కొన్నిసార్లు అధ్వాన్నమైన ప్రమాదాలకు దారితీస్తుంది. ఎందుకంటే పైపెరిన్ కొన్ని జీవక్రియ ఎంజైములు మరియు ట్రాన్స్పోర్టర్ కార్యకలాపాలను నిరోధించవచ్చు లేదా ప్రేరేపించవచ్చు. శరీరంలోని విషాన్ని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన శరీర ఎంజైమ్ అయిన CYP3Aచర్యను కూడా ఈ సమ్మేళనం నిరోధిస్తుంది. దాంతో మీ శరీరంలో టాక్సిన్స్ మొత్తాన్ని పెంచుతుంది.

గర్భం మీద ప్రభావం చూపుతుంది

గర్భం మీద ప్రభావం చూపుతుంది

గర్భధారణ సమయంలో మిరియాలు ఎక్కువగా తినకుండా ఉండటమే మంచిదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే మిరియాల్లో ఉండే బర్నింగ్ గుణాలు శిశువు శరీరంలో వేడికి గురిచి చేసి ఎక్కువ చికాకు కలిగిస్తుంది. నల్ల మిరియాల్లోని పైపెరిన్ మహిళల్లో పునరుత్పత్తికి చాలా సందర్భాలలో జోక్యం చేసుకుంటుంది. ఎలుకలపై చేసిన అధ్యయనం ప్రకారం నల్ల మిరియాలు గర్భధారణ అవకాశాలను 80 శాతం తగ్గిస్తాయి. పైపర్ గర్భంలో సంకోచానికి కారణం కావచ్చు. ఇది ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుంది.

పురుషుల లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది

పురుషుల లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది

మిరియాల్లో ఉండే పెప్పరిన్ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. దీనిలోని గుణాలు పురుషుల స్పెర్మ్‌ను ప్రభావితం చేస్తాయి. ఇది మగవారి స్పెర్మ్‌ను నిల్వ చేసే నాళం ఎపిడిడిమిస్‌లో ఎక్కువగా హానికరమైన వ్యర్థాలు పేరుకునేలా చేస్తుంది.

చర్మానికి హాని కలిగిస్తుంది

చర్మానికి హాని కలిగిస్తుంది

అధ్యయనాల ప్రకారం, నల్ల మిరియాలు లోని కాస్మోపెరిన్ వాస్కులర్ ఎంగోర్జ్‌మెంట్ వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడటానికి కారణం అవుతుంది.ఇంకా ఇది స్కిన్ టింగ్లింగ్ కు కారణం అవుతుంది.

తుమ్ముకు కారణం

తుమ్ముకు కారణం

ఇది ప్రమాదకరమైన దుష్ప్రభావం కాకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక దుష్ప్రభావమే. నల్ల మిరియాలు వాసన పీల్చడం నాసికా శ్లేష్మ పొరలోని నరాలను చికాకుపెడుతుంది. ఇది ముక్కులో మంట, తుమ్ము మరియు చికాకును కలిగిస్తుంది. మిరియాలు నిస్సందేహంగా అద్భుతమైన మూలిక. కానీ మీరు వీటినిలో సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా అర్థం చేసుకోవాలి మరియు దానిని సరిగ్గా ఉపయోగించాలి.

ముగింపు:

ముగింపు:

  • నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచిది. కానీ, వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఘాటైన ఫ్లేవర్ ఇవ్వడం మాత్రమే కాదు, కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మితంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి.
  • గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు అలాగే ఆహార నాళం లేదా జీర్ణాశయాంతరంలో సమస్యలున్నవారు మరియు ఫెర్టిలిటి సమస్యలున్న వారు బ్లాక్ పెప్పర్ కు ఖచ్ఛితంగా దూరంగా ఉండాలి.

English summary

Possible Side Effects of black pepper

Black pepper has been an age old remedy to treat several disorders. One must, however, be highly cautious about the amount of black pepper that is being consumed. Improper amount can cause serious effects on the body, some of which can be fatal too.
Desktop Bottom Promotion