For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా కాఫీ తాగే మహిళల్లో వంధ్యత్వమా? అంటే పిల్లలు పుట్టరా..?

రెగ్యులర్ గా కాఫీ తాగే మహిళల్లో వంధ్యత్వమా? అంటే పిల్లలు పుట్టరా..?

|

కాఫీ..టీ..అంటే చాలా మందికి ఇష్టం. కాదు కాదు ప్రాణం. కాదు కాదు అదొక వ్యసనం. అల‌స‌టగా ఉన్న‌ప్పుడు, స్నేహితులతో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు క‌ప్పు కాఫీ రుచి చూడాల్సిందేన‌ని భావిస్తారు. కాఫీ తాగగానే ఒక రిఫ్రెషింగ్ అనుభవాన్ని పొందుతారు. కొంత మందికి కాఫీ కడుపులో పడందే మరే పని జరగుదు అన్నట్లు ఉంటారు. ఇలాంటి వారు చాలా మందే ఉంటారు. అందుకే కాబోలు మార్కెట్లో వివిధ రకాల కాఫీ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కెఫిన్ తో తయారుచేసిన కేఫినేటెడ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే వీటిపై చాలా మంది ఆధారపడుతున్నారు. అయితే మనలో చాలా మందికి ఈ కాఫీలో లేదా కెఫిన్ లో ఉండే బయోకెమికల్ ప్రభావం వల్ల శక్తివంతమైన రసాయనాలు శరీరంలోని హార్మోనులపై ఏవిధంగా ప్రభావం చూపుతాయన్న విషయం తెలియదు.

రెగ్యులర్ గా కాపీ తాగడం వల్ల ఎదురైయ్యే సమస్యల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మహిళల్లో కాఫీ తాగేవారు అసౌకర్యానికి గురి అవుతన్నట్లు కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇది మహిళ ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. కాఫీ తాగడం వల్ల మహిళల్లో కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటో చూడండి.

మహిళలల అందం..ఆరోగ్యం విషయంలో కాఫీ ఒక విలన్

మహిళలల అందం..ఆరోగ్యం విషయంలో కాఫీ ఒక విలన్

మహిళలల అందం..ఆరోగ్యం విషయంలో కాఫీ ఒక విలన్ గా మారుతుంది. ఇందులో ఉండే కెఫిన్ అందుకు ప్రధాన కారణమని నిపుణులు సూచిస్తున్నారు. మరి మహిళల ఆరోగ్యంపై కాఫీ ఏవిధంగా ప్రభావితం చేస్తుంది, అది ఎటువంటి సమస్యలకు గురిచేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం..

కణితులుకు కారణం అవుతుంది

కణితులుకు కారణం అవుతుంది

కెఫిన్ తరచుగా తీసుకోవడం వల్ల కణతులు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాఫీ రెగ్యులర్ గా తాగడం వల్ల మహిళ రొమ్ము మరియు అండాశయాల్లో చిన్న కణుతులు ఏర్పడటానికి కారణం అవుతుంది. క్రమం తప్పకుండా కాఫీ తాగే మహిళల్లో ఇటుంటి కణితులు (సిస్టులు) ఏర్పడే సమస్యలు వస్తాయి.

జీర్ణక్రియపై ప్రభావం:

జీర్ణక్రియపై ప్రభావం:

కాఫీ తాగడం వల్ల శరీరంలో జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది. కాఫీ తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ (వ్యర్థాలు )అలాగే ఉండిపోవడం వల్ల శరీర పనితీరు మరింత దిగజారిపోతుంది. మితంగా తీసుకుంటే ఎటువంటి హాని ఉండదు. కానీ మూడు, నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో గుండె సమస్యలు వస్తాయి.

వంధ్యత్వ రేటు పెరుగుతుంది

వంధ్యత్వ రేటు పెరుగుతుంది

తరచుగా కాఫీ తాగే వారిలో వంధ్యత్వ రేటు పెరుగుతుంది. అంటే పిల్లలు కలకుండా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఏర్పడుతాయి. స్త్రీ మరియు పురుషులు ఎవ్వరిలో అయినా సరే కెఫిన్ అధికమైనప్పుడు వంధ్యత్వానికి కారణం అవుతుంది. అంతే కాదు, కాఫీ తాగే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాఫీలోని కెఫిన్ మరియు వంద్యత్వానికి మద్య సంబందం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బ్రెస్ట్ సైజ్ లో మార్పులు

బ్రెస్ట్ సైజ్ లో మార్పులు

రెగ్యులర్ గా కాఫీ తాగడం వల్ల బ్రెస్ట్ సైజులో మార్పులు కనబడుతాయంటున్నారు నిపుణులు. అయితే ఇది పరిమితికి మించి తీసుకునే వారిలో ఈ పరిస్థితి ఉంటుంది. అది కాఫీ తాగే పరిమాణాన్ని బట్టి సమస్య పెరగవచ్చు. కాఫీ తాగడం వల్ల రొమ్మలో ప్రేరేపణలు తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

హార్ట్ బర్న్

హార్ట్ బర్న్

కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది. ఇది మహిళల ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. రెగ్యులర్ గా కాఫీ తాగే వారిలో పొట్టలో అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ నివారించాలంటే కాఫీ తాగకుండా ఉండటమే మంచిది.

స్కిన్ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది

స్కిన్ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దాంతో చర్మంలో తేమ క్రమంగా తగ్గి చర్మం పొడిబారుతుంది. కాబట్టి కాఫీ తాగే వారు రోజులో సరిపడా నీరు కూడా తీసుకోవాలి. లేదంటే స్కిన్ డీహైడ్రేషన్ కు గురికాక తప్పదు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

రెగ్యులర్ గా కాఫీ తాగే వారిలో కాఫీలో కెఫిన్ అనే రసాయనిక పదార్థం దానంత అది శరీరంలో అదనపు కార్టిసోల్ ను ఉత్పత్తి చేస్తుంది. కాపీ తాగడానికి రుచిగా ఉందికదా అని మోతాదుకు మంచి తాగడం వల్ల, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

నిద్రలేమి సమస్య:

నిద్రలేమి సమస్య:

శరీరంలో కెఫిన్ ఎక్కువ అయితే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. అది ఇంటర్నల్ గా హార్మోనులను ప్రభావితం చేస్తుంది. రోజూ సరిపడా నిద్ర పొందకపోతే, హెల్తీ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

కెఫిన్ శరీరంలోని కొన్ని సూక్ష్మపోషకాలను క్షీణింపచేస్తుంది.

కెఫిన్ శరీరంలోని కొన్ని సూక్ష్మపోషకాలను క్షీణింపచేస్తుంది.

రెగ్యులర్ గా కాఫీ తాగే వారిలో హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడే కొన్ని న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ , విటమిన్ బి వంటి వాటిని క్షీణింపచేస్తుంది.

English summary

secret reasons why women should avoid coffee

here in this article we explain some secret reasons why women should avoid coffee, take a look.
Desktop Bottom Promotion