For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HIV & Life Expectancy: హెచ్ఐవీ ఉన్న వాళ్లు ఎన్ని సంవత్సరాలు బతకగలరో తెలుసా?

కొత్త, మరింత ప్రభావవంతమైన యాంటీరెట్రోవైరల్ మందులు వస్తుండటంతో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులూ ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.

|

HIV & Life Expectancy: హెచ్ఐవీ సోకగానే అంతా అయిపోయిందని, జీవితం ముగిసిపోయిందని అనుకునే రోజులు పోయాయి. హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వాళ్లు కూడా చికిత్స తీసుకుంటూ ఆనందంగా గడపవచ్చు. క్రమం తప్పకుండా యాంటీ రెట్రోవైరల్(Anti Retroviral Therapy) చికిత్స తీసుకుంటే, హెచ్ఐవీ పాజిటివ్ గా ఉన్న వ్యక్తులూ చాలా కాలం పాటు, పూర్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

The life expectancy of HIV-positive people, How long will they live?

హెచ్ఐవీ(HIV) ఉన్న వ్యక్తుల జీవిత కాలం ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిందని కైజర్ పర్మనెంట్ పరిశోధకులు కనుగొన్నారు. యాంటీరెట్రోవైరల్ చికిత్స వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తోందని గుర్తించారు. కొత్త, మరింత ప్రభావవంతమైన యాంటీరెట్రోవైరల్ మందులు వస్తుండటంతో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులూ ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.

1996 లో హెచ్ఐవీ ఉన్న 20 ఏళ్ల వ్యక్తి మొత్తం ఆయుర్దాయం 39 సంవత్సరాలు మాత్రమే. అది 2011 వచ్చే సరికి హెచ్ఐవీ ఉన్న వ్యక్తి మొత్తం ఆయుర్దాయం దాదాపు 70 సంవత్సరాలకు పెరిగింది. 2020 నాటికి మొత్తం ఆయుర్దాయం మరింత ఎక్కువ అయిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల జీవిత రేటు కూడా గణనీయంగా తగ్గింది. కొన్ని సంవత్సరాల క్రితం హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తుల్లో దాదాపు 78 శాతం మరణాలు ఎయిడ్స్(AIDS) సంబంధిత కారణాల వల్ల సంభవించేవి. కానీ ఇప్పుడు 2005 నుండి 2009 వరకు ఆ సంఖ్య 15 శాతానికి పడిపోయింది.

హెచ్ఐవీ చికిత్స ఎలా మెరుగుపడింది?

హెచ్ఐవీ చికిత్స ఎలా మెరుగుపడింది?

యాంటీ రెట్రోవైరల్ మందులు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే నష్టాన్ని నెమ్మదిస్తాయి. అలాగే మూడో దశ హెచ్ఐవీ ఎయిడ్స్ గా అభివృద్ధి చెందకుండా నిరోధిస్తాయి.

హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు రోజూ మూడు లేదా అంత కంటే ఎక్కువ యాంటీరెట్రోవైరల్ మందులు తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఈ మందులు శరీరంలోని హెచ్ఐవీ మొత్తాన్ని వైరల్ లోడ్ ను అణచివేసేందుకు సహాయపడతాయి. అనేక ఔషధాలను మిళితం చేసే మాత్రలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

యాంటీరెట్రోవైరల్ మందుల క్లాసెస్:

యాంటీరెట్రోవైరల్ మందుల క్లాసెస్:

* నాన్-న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఇన్ఙిబిటర్స్

* న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్

* ప్రోటీజ్ ఇన్హిబిటర్స్

* ఎంట్రీ ఇన్హిబిటర్స్

* ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్

వైరల్ - లోడ్ అణచివేత హెచ్ఐవీతో ఉన్న వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అనుమతి ఇస్తుంది. హెచ్ఐవీ మూడో దశకు అభివృద్ధి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. గుర్తించలేని వైరల్ లోడ్ ఇతర ప్రయోజనం ఏమిటంటే ఇది హెచ్ఐవీ ప్రసారాన్ని తగ్గంచడంలో సహాయపడుతుంది.

2014 యూరోపియన్ పార్ట్నర్ అధ్యయనం ఒక వ్యక్తి గుర్తించలేని లోడ్ ను కలిగి ఉన్నప్పుడు హెచ్ఐవీ వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని కనుగొంది. అంటే వైరల్ లోడ్ ఒక మిల్లీ లీటర్ కు 50 కాపీల కంటే తక్కువగా ఉంటుంది.

హెచ్ఐవీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..

హెచ్ఐవీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..

* వేగవంతమైన వృద్ధాప్యం

* కాగ్నిటివ్ ఇంపైర్మెంట్

* వాపు సంబంధిత సమస్యలు

* లిపిడ్ స్థాయిపై ప్రభావం

* క్యాన్సర్

* చక్కెర, కొవ్వుల ప్రాసెస్ లో మార్పులు

* శరీరాకృతిలో మార్పు

హెచ్ఐవీ సోకిన వ్యక్తులు సరైన చికిత్స తీసుకోకపోయినా, మొత్తానికే చికిత్స చేయించుకోకపోయినా హెచ్ఐవీ క్రమంగా అభివృద్ది చెందుతుంది. హెచ్ఐవీ మూడో దశ లేదా ఎయిడ్స్ గా రూపాంతరం చెందుతుంది. అలాగే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల్లోనూ హెచ్ఐవీ.. ఎయిడ్స్ గా మారుతుంది.

స్టేజ్-3 హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ ఉన్న వ్యక్తుల ఆయుర్దాయం భిన్నంగా ఉంటుంది. కొందరు రోగనిర్ధారటణ జరిగిన కొన్ని రోజులు లేదా నెలల్లోనే చనిపోవచ్చు. అయితే చాలా మంది మాత్రం యాంటీరెట్రోవైరస్ మందులతో తమ జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుకుంటారు.

English summary

The life expectancy of HIV-positive people, How long will they live?

read on to know The life expectancy of HIV-positive people, How long will they live?
Desktop Bottom Promotion