For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేద గృహ చిట్కాలు - అరగంటలో 'లూస్ మోషన్' సమస్య నియంత్రణ

|

విరేచనాలు సమస్య వస్తే దాని నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటాము. విరేచనాలు సమస్య ఉన్నప్పుడు టాయిలెట్‌ కు ఎక్కువసార్లు వెళ్ళడం జరుగుతుంది. ఏ మాత్రం తగ్గకుండా ప్రతి పది పదిహేను నిముషాలు లేదా అరగంటకొకసారి వెళుతుంటారు. ఇది ఇలా కొనసాగితే అతిసారాకి ప్రధాన కారణం అవుతుంది. విరేచనాలు ప్రారంభమైతే రోజులో కనీసం ఐదు లేదా ఆరు సార్లు టాయిలెట్ కు వెళ్ళవలసి ఉంటుంది. మలం చాలా నీళ్ళగా అవుతుంది మరియు కొన్నిసార్లు ఈ లక్షణాలతో పాటు కడుపులో నొప్పి, వాపు, జ్వరం మరియు అలసటను కలిగిస్తుంది.

టాయిలెట్‌కు తరచూ వెళ్లడం వల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ పాయువు చుట్టూ చేరుతుంది, ఆ కారణంగా ఎక్కువ చికాకు కలిగిస్తుంది. ప్రేగు పనితీరుకు ఇన్ఫెక్షన్ సమస్యగా ఉంటుంది. పరాన్నజీవులు, కలుషితమైన ఆహారం, బ్యాక్టీరియా మరియు వైరస్ అతిసారానికి ప్రధాన కారణం. మీరు మూడు రోజులకు మించి విరేచనాలతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. దానికంటే ముందు మీరు ఇక్కడ పేర్కొన్న కొన్ని గృహచిట్కాలను ప్రయత్నించి చూడవచ్చు. ఇంకా విరేచనాలతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేసే సమయంలో వారిలో కనిపించే ఆందోళన చెందడం వల్ల నిర్జలీకరణం అవుతుంది.

These Ayurvedic Medicines Provide Relief from Loose Motion

వెంటనే చికిత్స చేయకపోతే విరేచనాలు ఎక్కువై శరీరంలోని ద్రవం మరియు లవణాలు కోల్పోవడం వల్ల తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. చాలా తీవ్రమైన పరిస్థితులలో రోగికి డ్రిప్స్(సెలైన్ )పై ఉంచాల్సి ఉంటుంది. ఆయుర్వేద చికిత్స ప్రకారం గోరువెచ్చని నీటికి ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గ్లూకోజ్ మరియు నిమ్మరసం చేర్చి రోగికి త్రాగించాలి. మీరు భోజనం తర్వాత వాంతులు చేస్తుంటే ఈ పానీయం నోరు, పెదవులలో తేమను ఉంచడానికి సహాయపడుతుంది. నీటికి బదులుగా గంజి ఇవ్వండి. ఆయుర్వేద ఔషధాల నుండి విరేచనాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

అతిసార సమస్యకు ఆయుర్వేద చికిత్స

అతిసార సమస్యకు ఆయుర్వేద చికిత్స

అజ్వైన్ ఆయిల్, ఫెన్నెల్ ఆయిల్, సా ఆయిల్ మరియు కర్పూరం సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చుక్కను మొలాసిస్ లేదా చక్కెర ముక్క లేదా ఒక టేబుల్ స్పూన్ చక్కెరతో కలపండి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి త్రాగాలి. ఇది వికారం మరియు వాంతికి చాలా ప్రాచుర్యం పొందిన చికిత్స అని చెబుతారు.

మెంతులు, ఇంగువ, అల్లం, జాజికాయ, నల్ల ఉప్పు మరియు నిమ్మరసం సమాన పరిమాణం తీసుకోండి. ఈ మిశ్రమం సుమారు 300గ్రాములంత తయారుచేసుకుని సేవించండి.

దానిమ్మ పండు తొక్క

దానిమ్మ పండు తొక్క

* అతిసార చికిత్సకు దానిమ్మ పండు పై ఉన్న తొక్కను ఉపయోగించవచ్చు. ఎండిన దానిమ్మ తొక్క 3-4 ముక్కలు తీసుకొని 2 కప్పుల నీటిలో కలపాలి. మీడియం మంట మీద ఈ నీటిని మూత పెట్టి మరిగించాలి. దీనికి మీరు రెండు ముక్కల కలకండ లేదా చక్కెరను ఉపయోగించవచ్చు. గిన్నెలో నీరు సగం అయ్యే వరకు ఉడకబెట్టండి. మీరు భోజనం చేసిన అరగంట తరువాత తాగాలి.

* దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుని, దానికి పెరుగుతో కలిపి తినవచ్చు. ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ పొడి మరియు ఒక కప్పు చిక్కటి పెరుగు వాడండి. మీరు ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తినాలి.

* 60 గ్రాముల ఉప్పు, 5 గ్రాముల శంకాభూసం మరియు తెలుపు జీలకర్ర, 3 గ్రాముల లోధ్రా మరియు సొంటి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని 16 సమాన భాగాలుగా చేసుకుని మరియు ఒక్కొక్క భాగాన్ని ప్రతి రోజూ పెరుగుజతలో తినండి.

కొబ్బరి నీళ్ళు త్రాగాలి

కొబ్బరి నీళ్ళు త్రాగాలి

మన పెద్దలు కొబ్బరి చెట్టును తాటి చెట్టుగా భావించి ప్రతి ఇంటిలో నాటినందున ఈ రోజు భారతదేశంలో కొబ్బరి చెట్లు అధికంగా ఉన్నాయి. ఇది పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కాని ప్రతి సంవత్సరం వీటి ద్వారా చాలా నీరు లభిస్తుంది. మృదువైన, తీపి, నీటితో కూడిన కొబ్బరి నీళ్ళు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. లూజ్ మోషన్ సమయంలో శరీరంలో కోల్పోయిన ఈ పోషకాలను, లవణాలను పొందుతుంది మరియు దాని కార్యకలాపాలను పూర్తి సామర్థ్యంతో చేయగలదు. మూత్రాశయాన్ని శుభ్రపరచడానికి మరియు కొబ్బరి నీరు శక్తిని గ్రహించడానికి కి ఉపయోగపడే ఉత్తమ ద్రవం కొబ్బరి నీళ్ళు. అతిసారం మరియు నిర్జలీకరణం నుండి ఉపశమనం పొందటానికి కొబ్బరి నీరు మరొక ఆరోగ్యకరమైన మరియు పోషకమైన పానీయం. కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను రీసెట్ చేయడమే కాకుండా కడుపులోని పిహెచ్ స్థాయిని తగ్గిస్తుంది మరియు జీర్ణవ్యవస్థను శాంతపరుస్తుంది.

కోకం జ్యూస్

కోకం జ్యూస్

ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ కోకం రసం, కొద్దిగా చక్కెర మరియు ఉప్పు కలపండి. కడుపులో గడబిడ, సరిగా లేనప్పుడు ఈ జ్యూస్ ను తాగండి, ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల పొట్ట సమస్యలను నివారిస్తుంది.

దానిమ్మ రసం

దానిమ్మ రసం

దానిమ్మలో వివిధ యాంటీఆక్సిడెంట్లు మరియు పాలీఫెనాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేదా రక్తంలోని ఉండే విష పదార్థాలను లేదా కణాలను తటస్తం చేసే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దానిమ్మపండులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అతిసారానికి ఇది మంచి పరిష్కారం. దానిమ్మ రసంను ఒక కప్పు త్రాగాలి.

అల్లం

అల్లం

పురాతన కాలం నుండి యుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించి అనేక రోగాలకు చికిత్స చేస్తూవస్తోంది. సైన్స్ అనేక ఆయుర్వేద ఔషధాలకు మద్దతు ఇచ్చింది మరియు ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొనబడినది. అనేక రుగ్మతలను తొలగించడానికి అల్లం అనేక వంటలలో ఉపయోగిస్తారు. అల్లం వంటలకు మంచి రుచిని పెంచడమే కాదు జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, వికారం మొదలైనవాటిని కూడా నివారిస్తుంది. ఇంకా ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు తగ్గడం మరియు క్యాన్సర్‌ను నివారించడంలోప్రభావవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, విరేచనాలు కూడా తగ్గించడంలో ఇది సరైన ఇంటి నివారణ. అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి వేడి చేసి త్రాగాలి. ఈ నీరును ఉడకడం ప్రారంభమైన తర్వాత మంటను చాలా తక్కువగా ఉంచిగా ఇరవై నిమిషాలు పాటు ఉడకబెట్టండి. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపి గోరువెచ్చగా త్రాగాలి.

పెరుగు

పెరుగు

మన శరీరం చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలలో పెరుగు ఒకటి. పెరుగు అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే పెరుగులోని బ్యాక్టీరియా పొట్ట సమస్యలను నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. పాల నుండి తయారయ్యే ప్రక్రియలో మన జీర్ణవ్యవస్థ చేసే పనులలో మూడొంతుల పనిని పూర్తి చేస్తుంది. కాబట్టి పెరుగు మనకు ఉత్తమ ఆహారంగా ఉంది. జీర్ణ సమస్య ఉన్న రోగులకు పెరుగును ఆహారంగా స్వీకరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భోజనం చివరిలో పెరుగు లేకపోతే భోజనం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. పెరుగు మంచి భోజనం తిన్నంత సంత్రుప్తిని కలిగి స్తుంది. భోజనం చివరిలో మీరు తినే పెరుగు మీ ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆహారంలో భాగంగా క్రమం తప్పకుండా పెరుగు తినేవారికి జీర్ణశయాంతర సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. మీ కడుపు లోపల వేడి అనిపిస్తే తెల్లగా ఉండే గట్టి పెరుగును తినండి. మీకు విరేచనాలు ఉంటే రోజుకు రెండుసార్లు పెరుగు తీసుకోవాలి.

కెఫిన్ మరియు సోడా నుండి దూరంగా ఉండండి

కెఫిన్ మరియు సోడా నుండి దూరంగా ఉండండి

* మీరు విరేచనాలతో బాధపడుతుంటే మీరు 5గ్రా వెన్న,ఒక గ్రాము సోంపు వేసి 50గ్రాముల కషాయం తయారుచేయాలి. దాహం వేసినప్పుడు రోగికి ఇవ్వండి. తీవ్రమైన విరేచనాలు అవుతుంటే మీరు దీనిని మూడు రోజులు ఇవ్వాలి. 100 గ్రా రాస్నోట్, 1 గ్రా కుతాజ్, 5 గ్రా బేల్, 5 గ్రా ఇసాబుగోల్ మరియు 1 గ్రా గోండా కేతి ఉపయోగించి 200 మి.లీ కషాయంను తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని నీటితో కలిపి తాగాలి.

* మోషన్స్ వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అతిసారం కోసం పైన పేర్కొన్న అన్ని ఆయుర్వేద గృహ నివారణలను వాడండి. మీకు విరేచనాలు అవుతూనే ఉంటే పెద్ద మొత్తంలో నీరు మరియు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. అయితే కెఫిన్ మరియు సోడాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

English summary

These Ayurvedic Medicines Provide Relief from Loose Motion

The main concern in treating a patient suffering from loose motions is to prevent dehydration. The loss of fluids and salts from the body can cause serious problems if not addressed in time. In severe cases, the patient may be required to be kept on drips. As an immediate ayurveda remedy, you should give the patient boiled water with a bit of salt, one spoon of glucose and lemon. This drink can also be used for keeping the lips moist in case the patient has vomited after taking food. Give rice gruel instead of plain water.
Story first published: Thursday, October 24, 2019, 13:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more