For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంసం ఎక్కువగా తింటే మీ శరీరానికి తలెత్తే సమస్యలు ఇవే!

మాంసం ఎక్కువగా తింటే మీ శరీరానికి తలెత్తే సమస్యలు ఇవే!

|

మాంసం అనేది ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప మూలంగా సూచించబడుతుంది. శరీరం యొక్క సరైన పనితీరు కోసం ఈ రెండు పోషకాలు ఖచ్చితమైన అవసరంగా ఉంటాయి. అందుకే మాంసం మీ ఆహారంలో ఒక భాగంగా ఉండాలని సూచిస్తుంటారు. ఏదేమైనా, అధిక మొత్తంలో మాంసాన్ని తీసుకోవడం మూలంగా, శరీరంపై ప్రతికూల ప్రభావం కూడా ఉంటుందని చెప్పబడుతుంది. ఈ అంశంపై ఈ వ్యాసంలో మనం చర్చించబోతున్నాం.

మాంసం అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం. కావున అధికంగా మాంసం తీసుకోవడమనేది, అన్ని శరీర రకాలకు వర్తించకపోవచ్చు. మరియు జీవక్రియలను ప్రభావితం చేయవచ్చు. అధిక మాంసంతో కూడిన ఆహారం తీసుకున్నా కూడా శరీర విధానం మరియు ఆరోగ్య స్థాయిల ఆధారితంగా సమస్యలు రావచ్చు, లేదా రాకపోవచ్చు. క్రమంగా కొందరికి మాంసం తీసుకున్న తర్వాత కడుపు నొప్పితో కూడిన అసౌకర్యాన్ని లేదా మరేదైనా ఇతర సమస్యలను అనుభవించడం జరుగవచ్చు.

Things That Could Happen To Your Body If You Eat Too Much Meat

మీరు ఎక్కువ మాంసం తీసుకున్న ఎడల తలెత్తే సమస్యలు!

మీరు అధికంగా మాంసాన్ని తీసుకున్నప్పుడు మీ శరీరం ప్రాసెస్ చేయలేని కొన్ని విషయాలు మరియు సంకేతాల గురించిన సమగ్ర వివరణ ఇక్కడ పొందుపరచడం జరిగింది.

1. కడుపు ఉబ్బరం :

1. కడుపు ఉబ్బరం :

మాంసం తిన్న తరువాత మీకు కడుపు ఉబ్బినట్లు లేదా ఉబ్బరంగా అనిపిస్తే , ఇది కడుపు స్వీకరించడం లేదనడానికి సంకేతంగా, మరియు ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదని సూచిస్తుంది. మాంసం తీసుకున్న తర్వాత మీరు కడుపులో అసౌకర్యాన్ని అనుభవిస్తున్నట్లయితే దాన్ని ఆ ఆహారాన్ని మీ ఆహార ప్రణాళిక నుండి తక్షణమే తొలగించండి. మాంసం సరిగ్గా జీర్ణ వ్యవస్థచే శోషించుకొనని ఎడల ఉబ్బరంతో పాటుగా, తరచుగా నొప్పి, అసౌకర్యం మరియు కడుపులో బిగుతుగా ఉన్న అనుభూతికి కారణమవుతుంది.

2. మలబద్ధకం :

2. మలబద్ధకం :

మాంసంలో ముఖ్యంగా రెడ్ మీట్, తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది, క్రమంగా ఇది మలబద్ధకం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, రెడ్ మీట్ లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది మరియు అధిక కొవ్వు ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది అజీర్ణం మరియు మలబద్దకానికి దారితీస్తుంది.

3. చెడు దుర్వాసన :

3. చెడు దుర్వాసన :

మాంసం వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అధిక పరిమాణంలో తినడం వల్ల చెడు దుర్వాసనకు కారణంగా మారుతుంది. మీ శరీరం కీటోసిస్ అనే జీవక్రియల స్థితికి వెళ్ళినప్పుడు ఇది సంభవిస్తుంది. క్రమంగా మీ శరీరం కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది, ఇది అసహ్యకరమైన నోటి దుర్వాసనకు కారణంగా మారుతుంది.

4. అలసట :

4. అలసట :

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది శరీరాన్ని అలసట మరియు మగతకు గురిచేయడానికి కారణమయ్యే సెరోటోనిన్ హార్మోనును ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది.

5. వికారం :

5. వికారం :

ఒక అధ్యయనం ప్రకారం, రెడ్ మీట్ ఎక్కువగా తినే పురుషులు డైవర్టికులిటిస్ అని పిలువబడే పెద్దప్రేగు సంబంధిత బాధాకరమైన తాపజనక పరిస్థితి ఎదుర్కొనడానికి కారణంగా మారుతుందని తేలింది. ఇది తీవ్రమైన కడుపు నొప్పి మరియు వికారం కలిగిస్తుంది. అంతేకాకుండా తక్కువ రెడ్ మీట్ తిన్న పురుషులతో పోలిస్తే వారంలో అధికంగా తిన్న పురుషులు డైవర్టికులిటిస్ బారినపడే అవకాశం 58% ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Things That Could Happen To Your Body If You Eat Too Much Meat

Meat is a great source of protein and healthy fats. Both of these nutrients are required for the proper functioning of the body, which is why meat should be a part of your diet. However, the downside is consuming meat in excessive quantities has an adverse effect on the body, which we are going to discuss in this article.
Desktop Bottom Promotion