For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40ఏళ్లలోకి అడుగుపెట్టారా..? అయితే ఈ విషయాలు గమనించండి

చాలా మంది వ్యక్తులు 40 ఏళ్లు దాటడం ద్వారా వృత్తిపరంగా స్థిరపడతారు. కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే మంచి వయస్సు ఇది. వాస్తవం ఏమిటంటే, మీరు 40 ఏళ్ళకు చేరుకున్నప్పుడు శరీరంలో గణనీయమైన మార్పులు వస్తాయి.

|

వయస్సు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. జీవితంలో ఇది ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిన ప్రకృతి నిబంధన. అయితే వయస్సు పెరిగే కొద్దీ కొత్త బాధ్యతలు వచ్చి పడుతుంటాయి. వాటిని స్వీకరించాల్సిందే. అయితే.. 40 ఏళ్లు నిండడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే సాధారణ విషయమే. ఎకనామిస్ట్ నివేదిక.. 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రజలు ఆనందంగా, సంతృప్తిగా ఉంటారని పేర్కొంది.

చాలా మంది వ్యక్తులు 40 ఏళ్లు దాటడం ద్వారా వృత్తిపరంగా స్థిరపడతారు. కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే మంచి వయస్సు ఇది. వాస్తవం ఏమిటంటే, మీరు 40 ఏళ్ళకు చేరుకున్నప్పుడు శరీరంలో గణనీయమైన మార్పులు వస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది.

40 ఏళ్లు వచ్చినప్పుడు ఈ విషయాలు జరుగుతాయి

1. కండర ద్రవ్యరాశిలో తగ్గుదల

1. కండర ద్రవ్యరాశిలో తగ్గుదల

* 40ల తర్వాత కండర ద్రవ్యరాశి క్షీణించడం ప్రారంభమవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు 5 శాతం మేర ఇలా కండర ద్రవ్యరాశి తగ్గుతుంది

* సార్కోపెనియా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ముందే గుర్తించకపోతే ఉన్నట్టుండి పడిపోవడం, ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

* కండరాల ద్రవ్యరాశి క్షీణించడం ప్రారంభమైతే... దానిని ఎదుర్కొవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి.

2. నొప్పులు చుట్టుముడతాయి

2. నొప్పులు చుట్టుముడతాయి

* వయస్సు పెరిగేకొద్దీ నొప్పు రావడం సాధారణ విషయమే. అయితే దీనిని తేలికగా తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. అకస్మాత్తుగా నొప్పులు రావడం లాంటి లక్షణాలు ఉంటే అవి ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది.

* 40 నుండి 60 సంవత్సరాల మధ్య చాలా మందిలో వెన్ను నొప్పి రావడం గమనించే ఉంటారు.

* వెన్నునొప్పి లేదా మెడ నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

* వెన్నునొప్పితో పాటు, జ్వరం, తిమ్మిరి, కాలు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా వస్తాయి.

3. చేతుల్లో నొప్పి వస్తుంది

3. చేతుల్లో నొప్పి వస్తుంది

* చాలా సందర్భాలలో, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల్లో కనిపిస్తుంది.

* కొంత మందిలో నొప్పి ఒక చేతికి మాత్రమే ఉంటుంది. మరికొందరిలో రెండు చేతులూ నొప్పి పెడతాయి.

4. ముఖంపై చర్మానికి ముడతలు వస్తాయి

4. ముఖంపై చర్మానికి ముడతలు వస్తాయి

* 40 ఏళ్లకు చేరుకునేటప్పుడు, ముఖ ఆకృతిలో మార్పులను గమనించవచ్చు.

* ముడతలు, గీతలు, ఐ ప్యాక్ కనిపిస్తాయి.

* సూర్య కిరణాలు నేరుగా తగలడం, షేవింగ్ చేయడం, మేకప్ ఉపయోగించడం వల్ల క్రమంగా చర్మం దెబ్బతింటుంది.

* చర్మ సంరక్షణ చర్యలు పాటిస్తే ఇలా కావడాన్ని కొన్ని రోజుల వరకు ఆపవచ్చు

5.మెదడు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు

5.మెదడు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు

40 వ పడిలో పడితే మిడ్ లైఫ్ క్రైసిస్ అని పిలిచే రుగ్మతను అనుభవించడానికి అవకాశం ఉంది. 50వ ఏటకు చేరుకునే కొద్దీ మెదడు అంత ప్రభావవంతంగా ఉండకపోవడం తెలుస్తుంది.

6. రుచి, వాసనలో మార్పులు వస్తాయి

6. రుచి, వాసనలో మార్పులు వస్తాయి

* చాలా మంది 60ఏళ్లకు వచ్చే సరికి తమ జ్ఞానేంద్రీయాల్లో మార్పులు గమనిస్తారు.

* దంత సమస్యలు, సిగరెట్లు తాగడం లేదా మందులు తీసుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

* అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల వల్ల కూడా జ్ఞానేంద్రియ బలహీనత వస్తుంది.

7. యుటిఐలలో పెరుగుదల ఉండవచ్చు

7. యుటిఐలలో పెరుగుదల ఉండవచ్చు

* యుటిఐలు ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు, చాలా మంది వ్యక్తులకు మధ్యస్థ సంవత్సరాలలో ఇవి సర్వసాధారణంగా ఉంటాయి.

* ముఖ్యంగా మహిళలు పునరావృత అంటువ్యాధులు ఎదుర్కొంటారు.

8. ఈ వయస్సులో బరువు పెరుగుతారు

8. ఈ వయస్సులో బరువు పెరుగుతారు

* ఎవరైనా సులభంగా గుర్తించగలిగే మార్పుల్లో ఒకటి బరువు పెరగడం. ఎందుకంటే మనం ఏమి తిన్నా లేదా వ్యాయామం చేసినా శరీరం మారుతున్నట్లు అనిపిస్తుంది. * 40 ఏళ్ల వయస్సులో చెడు కొవ్వులను తొలగించడంలో శారీరక సామర్థ్యం తగ్గుతుంది.వీటిని లిపిడ్లు అని పిలుస్తారు.

* ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అనేది చూసుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. బరువుపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి.

9. జుట్టు పలచబడుతుంది

9. జుట్టు పలచబడుతుంది

* జుట్టు క్రమంగా పలుచ బడుతుంది.

* 35 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమంగా జుట్టు రాలుతుంది.

* మహిళలు 50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి జుట్టు రాలుతుంది.

10. రుతుక్రమంలో అసమానతలు

10. రుతుక్రమంలో అసమానతలు

* పెరిమెనోపాజ్ అనేది సాధారణంగా 40 ఏళ్ల మహిళల్లో ప్రారంభమవుతుంది. పెరిమెనోపాజ్ అంటే పీరియడ్స్ క్రమంగా రావు.

11. మెదడు ఫాగీగా అనిపించవచ్చు

11. మెదడు ఫాగీగా అనిపించవచ్చు

* 40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు మెదడు ఫాగీతో బాధపడే అవకాశం ఉంటుంది.

* మెదడు ఫాగీ అంటే మతిమరుపు లేదా ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కనిపించడాన్ని అలా అంటారు.

12. నోటి ఆరోగ్యం క్షీణించవచ్చు

12. నోటి ఆరోగ్యం క్షీణించవచ్చు

* వయస్సు పెరిగే కొద్దీ చిగుళ్ల ఆరోగ్యంలో మార్పులను గమనించవచ్చు.

* కణాల పునరుద్ధరణ మందగిస్తుంది.

* చిగుళ్ల కణజాలం సన్నబడుతుంది. ఎముకలు బలహీనంగా అవుతాయి.

* రోగనిరోధక వ్యవస్థ కూడా ఒకప్పుడు ఉన్నంత ప్రభావవంతంగా ఉండదు.

13. మూత్రం లీకేజీ

13. మూత్రం లీకేజీ

* కటి అవయవాలకు సపోర్ట్ చేసే కండరాలు వృద్ధాప్యం వల్ల సరిగ్గా పని చేయవు. దీని వల్ల మూత్రం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.

* దగ్గు, వ్యాయామం చేయడం, సమయానికి టాయిలెట్ కు చేరుకోలేకపోవడం వల్ల మూత్రం పడిపోతుంది.

14. సెక్స్ మరింత ఆనందంగా ఉండవచ్చు

14. సెక్స్ మరింత ఆనందంగా ఉండవచ్చు

* వయసు పెరిగేకొద్దీ సెక్స్‌ను ఆస్వాదించే సామర్థ్యం తగ్గుతుంది. కానీ 40ల్లో మహిళలు, పురుషులు శృంగారాన్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

* ఎందుకంటే వారు లైంగికంగా మరింత నమ్మకంగా ఉంటారు.

* 40ల్లో స్, పురుషులు శృంగారం విషయంలో మరింత ఉత్సాహంగా ఉంటారు.

చివరగా

మీకు 40 ఏళ్లు వచ్చేటప్పటికి మంచి, చెడుల గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది మీరే. ఆరోగ్యం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తించాలి.

English summary

Things That Happen When You Turn 40 in telugu

read on to know Things That Happen When You Turn 40 in telugu
Story first published:Thursday, July 21, 2022, 15:23 [IST]
Desktop Bottom Promotion