For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఫేమస్..అయితే వీటిని తింటే కలిగే అనర్థాలు ఇవీ..

|

ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు వంటి పాశ్చాత్య ఆహార పదార్థాలు మాత్రమె కాకుండా, భారతదేశంలో రోజు తినే కొన్ని స్నాక్స్ (చిరుతిళ్ళు) అనారోగ్యాలకు గురి చేస్తున్నాయి. పాశ్చాత్య ఆహార పదార్థాలు మాత్రమె ఆరోగ్యం పాడవుతుందని కొంత మంది అపోహ.

ఫ్రెంచ్ ఫ్రైస్.. అమెరికాలో ఇది ఫేమస్ ఫుడ్.. కానీ ప్రస్తుతం మన భారతీయులు కూడా దీనిని ఎగబడి తింటున్నారు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే దేనితోనో తయారు చేసే ఫుడ్ అనుకుంటే పొరబాటే. ఇది మనకు నిత్యం దొరికే బంగాళదుంపతోనే తయారు చేసేవే. సాధారణంగా మన దేశంలో బంగాళదుంపలతో అనేక రకాల ఫ్రైలను తయారు చేస్తారు. ఆలుగడ్డలను నిలువుగా, సన్నటి ముక్కలుగా కోసే విధానమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. అలా కోసిన వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసి రెడీ చేస్తారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. చిప్స్‌ వలే ఇవి కూడా కరకరలాడతాయి. అయితే ప్రస్తుతం వీటిని చాలా మంది రోజు తినడం చేస్తున్నారు. అలా నిత్యం వీటిని తినడం ద్వారా పలు అనారోగ్య కారణాలకు గురవ్వడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫ్రెంచ్ ఫ్రైస్... అమెరికాలో ఫేమస్ ఫుడ్. బంగాళాదుంప ఫ్రైలలో రకరకాలుంటాయి. ఆలుగడ్డలను నిలువుగా, అగ్గి పుల్లల్లా కోసే విధానమే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో కరకరలాడతాయి. అలాగని రోజూ వీటిని తినకూడదు. తింటే ఏమవుతుందంటే...

1.విపరీతంగా బరువు పెరుగుతారు:

1.విపరీతంగా బరువు పెరుగుతారు:

ఫ్రెంచ్ ఫ్రైలలో పిండి పదార్థాలు ఎక్కువ. వీటిని ఆయిల్‌లో ప్రాసెస్ చేయడం వల్ల ఈ పిండి పదార్థాలు మన నోటికి బాగుంటాయి గానీ... శరీరానికి హాని చేస్తాయి. వీటిని మన బాడీ త్వరగా ఆరగించుకోలేదు. రోజూ తినడం వల్ల పిండిపదార్థాలు బాడీలో పేరుకుపోయి... బరువు పెరుగుతారు.

Most Read: కడుపు మంటను చల్లార్చే బంగాళాదుంప...!

2. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం :

2. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం :

ఫ్రెంచ్ ఫ్రైలను ఆరోగ్యానికి హాని చేసే ట్రాన్స్ ఫాట్స్‌లో ముంచి తీస్తారు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. ఫలితంగా వాటిని తిన్నవారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో తయారై... క్రమంగా అంది గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. ఎన్నో పరిశోధనల్లో ఇది రుజువైంది. తరచుగా ఫ్రై చేసిన ఆహారం తింటే... టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు తేల్చారు.

3. క్యాన్సర్ వచ్చే ప్రమాదం :

3. క్యాన్సర్ వచ్చే ప్రమాదం :

ఫ్రెంచ్ ఫ్రైలను రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైంది. బంగాళాదుంపలను ఎక్కువ వేడిలో ఉడికిస్తే వాటిలో చక్కెర (పిండి పదార్థం)... అక్రిలామైడ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది గ్లిసిడమైడ్‌గా మారి... మన DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతుంది.

4. కిడ్నీలు పాడవుతాయి, హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ :

4. కిడ్నీలు పాడవుతాయి, హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ :

ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే మనకు బీపీ పెరుగుతుంది. రాన్రానూ అది హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది.* ఈ ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం ద్వారా మనకు తెలియకుండానే శరీరంలోకి సాల్ట్ ఎక్కువగా వెళ్తుంది. దీంతో మనకు బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధుల బారిన పడేలా చేసే అవకాశం ఉంది.

5. బ్రెయిన్ నరాలు దెబ్బతింటాయి :

5. బ్రెయిన్ నరాలు దెబ్బతింటాయి :

ఫ్రెంచ్ ఫ్రైలలో అక్రిలామైడ్ ఉంటుంది. అది మెదడులోని నరాలను దెబ్బతీస్తుంది. నరాల బలహీనత వచ్చేలా చేస్తుంది. క్రమంగా ఇది న్యూరోడీజనరేటివ్ (మెదడులో నరాలు దెబ్బతినుట) వ్యాధికి దారితీస్తుంది.

Most Read:చిలగడదుంప వల్ల కలిగే 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు !!

6. త్వరగా చనిపోయే ప్రమాదం :

6. త్వరగా చనిపోయే ప్రమాదం :

అధికబరువు, గుండె జబ్బులు, క్యాన్సర్, హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, మెదడు సమస్యలు... అన్నీ కలిసి త్వరగా చనిపోయేలా చేస్తాయి. అంతెందుకు ఇలాంటి రకరకాల రోగాలతో రోజూ బతకడం కూడా నరకప్రాయమే.

 ఈ అధ్యయనం వివరాలు

ఈ అధ్యయనం వివరాలు

ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పొందుపరిచారు. 45 నుంచీ 79 ఏళ్ల వయసున్న మొత్తం 4,400 మంది డేటా సేకరించిన పరిశోధకులు... 8 ఏళ్లపాటూ... వారిని పరిశీలించారు. వాళ్లంతా ఫ్రెంచ్ ఫ్రైలను వారానికి నాలుగైదు రోజులు తినేవారే.

Most Read: క్రిస్పీ పొటాటో ఫ్రై: మంచూరియన్ స్టైల్

పరిశోధన ముగిసేనాటికి

పరిశోధన ముగిసేనాటికి

పరిశోధన ముగిసేనాటికి 236 మంది చనిపోయారు.దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేదొకటే. ఈ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్డును వీలైనంతవరకూ తగ్గించుకోవాలి. ఉడకబెట్టిన వాటినే తినాలి. అప్పుడు అడ్డమైన రోగాలూ మన దరిచేరవు.

English summary

What happens when you eat French fries everyday?

French fries are that great American food that fools its consumers with the notion that their deep fried greasiness are actually refined, with that fancy “French” title. But don’t be fooled. “French” refers to the way the potato is cut. These potatoes doused in boiling, hot grease and salt are nothing close to being a delicacy. In fact, you should likely stay far, far away — or at least not eat them every day. Because if you do, the following undesirable things will happen to you.