For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rare blood group: అత్యంత అరుదైన రక్త గ్రూపు.. భారత్ లో ఇదే మొదటిది

|

Rare blood group: సాధారణంగా మనిషి రక్తం A, B, AB, O గ్రూపులుగా విభజిస్తారు. చాలా మందిలో ఈ నాలుగు గ్రూపులకు సంబంధించిన పాజిటివ్ లేదా నెగెటివ్ అయి ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా రక్త గ్రూపులను నిర్ణయిస్తారు. అయితే ఇవే కాకుండా కొన్ని అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. అందులో అత్యంత అరుదైనది గుజరాత్ కు చెందిన వ్యక్తిలో గుర్తించారు.

very very rare blood group found in gujarat man

A యాంటిజన్ ఉంటే A గ్రూపు అని అర్థం. B యాంటిజన్ ఉంటే B గ్రూపు అన్నట్టు. రెండు రకాల యాంటిజన్లు ఉంటే దానిని AB గ్రూపు అని అర్థం చేసుకోవాలి. ఈ యాంటీజెన్ లు ఏవీ లేకపోతే దానిని O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్ గా... లేకపోతే నెగెటివ్ గా నిర్ధారిస్తారు. అయితే నెగెటివ్ గ్రూపు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా తక్కువ మందిలో మాత్రమే A నెగెటివ్ లేదా B నెగెటివ్ గ్రూపులను గుర్తించవచ్చు. అలాగే AB నెగెటివ్ బ్లడ్ గ్రూపు అనేది అత్యంత అరుదైన గ్రూపు దేశంలో చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ రక్త గ్రూపు ఉంటుంది. తాజాగా గుజరాత్ కు చెందిన 65 ఏళ్ల గుండె జబ్బు ఉన్న వ్యక్తిలో EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్‌ తో ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూపు భారత్ లో గుర్తించడం ఇదే మొట్ట మొదటి సారి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులు కేవలం 9 మంది మాత్రమే. ఇప్పుడు తాజాగా గుర్తించిన వ్యక్తితో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ EMM నెగటివ్ రక్త గ్రూపు ఉన్న వ్యక్తుల సంఖ్య కేవలం పది మాత్రమే అంటే ఇదెంత అరుదైన బ్లడ్ గ్రూపో అర్థం చేసుకోవచ్చు.

EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్‌ అంటే ఏమిటి?

EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్‌.. ప్రస్తుతం ఉన్న A, B, O లేదా AB గ్రూపులుగా వర్గీకరించలేని ఒక ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్. సాధారణంగా, మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలు ఉంటాయి. వీటిలో A, B, O, RH మరియు Duffy వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. EMM ఎక్కువగా ఉండే 375 రకాల యాంటిజెన్‌లు కూడా ఉన్నాయి. EMM హై-ఫ్రీక్వెన్సీ యాంటిజెన్ లేని వ్యక్తులు ప్రపంచంలో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇది వారిని సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు, . ఎవరి దగ్గరినుండి పొందలేరు. ఎందుకంటే ఈ రక్తాన్ని పొందాలంటే ఈ రకమైన గ్రూపు ఉన్న వారు మాత్రమే అర్హులు. అలాగే వీరికి రక్తం ఇవ్వాలన్నా... EMM రక్త గ్రూపు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు గుజరాత్‌లోని రాజ్‌ కోట్‌ కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ బ్లడ్ గ్రూప్‌ తో గుర్తించ బడ్డాడు.

అరుదైన బ్లడ్ గ్రూపును ఎలా కనుగొన్నారు?

గుండె పోటుతో అహ్మదాబాద్‌ లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్ర చికిత్స కోసం రక్తం అవసరం అయింది. అయితే అహ్మదాబాద్‌ లోని ప్రథమ ల్యాబొరేటరీలో అతని రక్తం రకం దొరకలేదు. అతని రక్త నమూనాలను సూరత్‌ లోని రక్తదాన కేంద్రానికి పంపారు. పరీక్ష తర్వాత, ఆ వ్యక్తి రక్త నమూనా ఏ బ్లడ్ గ్రూపులతోనూ సరిపోలలేదు. దీని తరువాత వృద్ధుడితో పాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపారు. తదనంతరం వృద్ధుని రక్త వర్గం భారతదేశంలో మొట్ట మొదటిదని గుర్తించారు. అలాగే ప్రపంచంలోని పదో అరుదైన రక్త సమూహం అని నిర్ధారించారు. రక్తంలో EMM లేకపోవడం వల్ల, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ ఫ్యూజన్ (ISBT) దీనికి EMM నెగెటివ్ గా పేరు పెట్టింది.

ఇంకేమైనా అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నాయా?

బాంబే బ్లడ్ గ్రూపు, గోల్డెన్ బ్లడ్ గ్రూపులు దేశంలో అత్యంత అరుదైన రక్త గ్రూపులుగా పరిగణిస్తున్నారు. బాంబే బ్లడ్ గ్రూపు ప్రతి 10 వేల మందిలో కేవలం ఒక్కరిలో మాత్రమే ఉంటుంది. ఈ గ్రూపును మొట్ట మొదటి సారి 1952లో భారత్ లోని మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గుర్తించారు. అందుకే దానికి బాంబే గ్రూపు అనే పేరు స్థిరపడిపోయింది. బాంబే బ్లడ్ గ్రూపు ఉన్న వారిలో ఎ, బి, హెచ్ యాంటిజెన్ ఉండదు. ఎ, బి, ఎబి బ్లడ్ గ్రూపు అని రాదు. అందుకే ఈ గ్రూపు ఉన్న వారు చాలా మంది తమది ఓ గ్రూపు అనుకుంటారు.

బాంబే బ్లడ్ గ్రూపు కన్న అత్యంత అరుదైనది గోల్డెన్ బ్లడ్ గ్రూపు. ఈ గ్రూపు రక్తం ఉన్న వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వవచ్చు.. కానీ ఇతరుల నుండి రక్తాన్ని స్వీకరించలేరు. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపును Rh Null అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రూపు ఉన్న వారిలో ఆర్ హెచ్ యాంటిజెన్ ఉండదు. అందుకే దీనిని ఆర్ హెచ్ నల్ అని కూడా పిలుస్తారు.

English summary

very very rare blood group found in gujarat man

Read on to know very very rare blood group found in gujarat man..
Story first published:Wednesday, July 13, 2022, 17:09 [IST]
Desktop Bottom Promotion