For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కు బ్రేకులు వేయొచ్చా..?

విటమిన్-డి తక్కువగా తీసుకునే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

|

మన దేశంలో చాలా మంది మహిళలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో బ్రెస్ట్ (రొమ్ము) క్యాన్సర్ తొలి వరుసలో నిలుస్తోందన్న నిజం అందరినీ కలవరపెడుతోంది. కానీ ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా వీటిని నివారించొచ్చు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే మాత్రం ఈ మహమ్మారి చికిత్సకు కూడా లొంగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే క్యాన్సర్ బారిన పడకుండా విటమిన్-డిని ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విటమిన్-డి వల్ల ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విటమిన్-డిని 'సన్ షైన్ విటమిన్' అని కూడా అంటారు. సూర్యరశ్మికి గురైనప్పుడు మీ శరీరం ఉత్పత్తి చేసే కొవ్వు కరిగించేందుకు ఈ విటమిన్ సహాయపడుతుంది. ఈ విటమిన్ ను వివిధ రకాల ఆహారం మరియు సప్లిమెంట్ల నుండి కూడా పొందవచ్చు. మీ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ, విటమిన్ భాస్వరం మరియు కాల్షియం యొక్క శోషణను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు రోగ నిరోధక వ్యవస్థ యొక్క పనితీరును సులభతరం చేసేందుకు, మీ శరీరాన్ని బాహ్య కాలుష్య కారకాలు మరియు రాడికల్స్ నుండి రక్షించడంలో ఇది సహాయపడుతుంది.

విటమిన్-డి వల్ల వివిధ రకాల ప్రయోజనాలు..

విటమిన్-డి వల్ల వివిధ రకాల ప్రయోజనాలు..

ఈ విటమిన్ తో వివిధ రకాల ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ముడిపడి ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో విటమిన్-డి ప్రభావం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. కొన్ని రొమ్ము కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు, అవి ఆరోగ్యకరమైన కణాల కన్నా వేగంగా విభజనకు గురవుతాయి. క్యాన్సర్ కారకాలన్నీ ఒక చోట చేరి అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు విటమిన్-డి

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు విటమిన్-డి

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో లేదా పరిమితం చేయడంలో విటమిన్-డి పోషించిన పాత్రను అర్థం చేసుకునేందుకు కొన్ని సంవత్సరాలు అధ్యయనాలు జరిగాయి. విటమిన్-డి మరియు బ్రెస్ట్ క్యాన్సర్ అనే అంశంపై ఇటీవలి అధ్యయనం : పరిశీలనాత్మక అధ్యయనాల యొక్క క్రమబద్ధమైన సమీక్ష మరియు మెటా విశ్లేషణల్లో విటమిన్-డి తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉందని వెల్లడించింది.

విటమిన్-డి తక్కువగా తీసుకునే మహిళలు

విటమిన్-డి తక్కువగా తీసుకునే మహిళలు

విటమిన్-డి తక్కువగా తీసుకునే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారి రక్తంలో విటమిన్-డి స్థాయి ఎక్కువగా ఉన్న మహిళలు తమ రక్తంలో విటమిన్-డి తక్కువ స్థాయిలో ఉన్న మహిళలకు భిన్నంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే అవకాశం 45 శాతం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

విటమిన్-డి శాశ్వత పరిష్కారం కాదు..

విటమిన్-డి శాశ్వత పరిష్కారం కాదు..

మరో అధ్యయనంలో బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న 1666 మంది మహిళలను ప్రతివాదులుగా ఎన్నుకున్నారు. రోగ నిర్ధారణ సమయంలో విటమిన్-డి అధికంగా ఉన్న మహిళలకు, విటమిన్-డి తక్కువ రేటు ఉన్న మహిళలతో పోలిస్తే మెరుగైన రికరీ రేట్లు ఉన్నాయని తేలింది. ఈ విటమిన్-డి లోపాన్ని రొమ్ము క్యాన్సర్ తో కలిపే మునుపటి అధ్యయనాలన్నింటినీ అధ్యయనం చేసిన క్రైటన్ విశ్వవిద్యాలయం, సౌత్ కరోలినా మెడికల్ విశ్వవిద్యాలయం, మరియు గ్రాస్ రూట్స్ హెల్త్ సహకారంతో కాలిఫోర్నియా యూనివర్సిటీ శాన్ డియాగో పరిశోధకులు నిర్వహించిన మరో అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో విటమిన్-డి యొక్క కచ్చితమైన పాత్రను కనుగోనే పరిశోధనతో, ఇటీవలి అధ్యయనాలు ఈ అంశంపై మరింత లోతుగా పరిశోధనలను ప్రారంభించాయి. అంటే ఈ అధ్యయనాలు ఇంకా ఏమి తేల్చాయంటే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు విటమిన్-డి మాత్రమే పరిష్కాకారం కాదని ఒక బహిరంగ నిర్ణయానికి వచ్చాయి. అయితే వివిధ స్థాయిలలో విటమిన్-డి వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మాత్రం స్పష్టం చేసింది. ‘‘విటమిన్-డి సహాయపడుతుందని మేము అనుకోకుండా వెళ్లాము. విటమిన్-డి వివిధ స్థాయిలలో సహాయపడుతుంది. కానీ సంపూర్ణ పరిష్కారం కాదు‘‘ అని పరిశోధకులలో ఒకరు చెప్పారు.

విటమిన్-డి లో ఒక భాగం బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ప్రధానమైన అంశం

విటమిన్-డి లో ఒక భాగం బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ప్రధానమైన అంశం

విటమిన్-డి లో ఒక భాగం బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ప్రధానమైన అంశం అయినప్పటికీ, బ్రెస్ట్ క్యాన్సర్ ను అభివృద్ధిని ప్రభావితం లేదా నయం చేసే ఏకైక అంశం విటమిన్ - డి కాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి, వ్యాయామం, మరియు జన్యుశాస్త్రం వంటి అనేక కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ మెంట్ అవుతుంది. విటమిన్-డి లోపం కూడా అందులో ఒక భాగం మాత్రమే. ప్రస్తుతానికి విటమిన్-డి బ్రెస్ట్ క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉందని మాత్రం పరిశోధకులు స్పష్టం చేశారు. ఏదేమైనా, ఇటీవలి అధ్యయనాలు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు విటమిన్-డి మధ్య సంబంధంపై స్పష్టమైన అవగాహన పొందడానికి, మరింత లోతైన టెస్టులు ( ఎక్కువ రిస్క్ ప్రతివాదులు వంటివి) చేయడం ద్వారా ఈ రంగంలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని అమాంతం పెంచింది.

English summary

Vitamin D May Help Reduce The Risk Of Breast Cancer

Although a seemingly central aspect in the prevention of breast cancer, researchers point out that vitamin D is not the only factor that can influence the development of breast cancer [7] . Breast cancer develops due to several factors such as diet, lifestyle, exercise and genetics, and vitamin D deficiency is one part of it.
Story first published:Tuesday, September 10, 2019, 11:59 [IST]
Desktop Bottom Promotion