For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inability To Swallow: ఆహారం మింగలేకపోతున్నారా? ఇవే కారణాలు కావొచ్చు

ఆహారం మింగడానికి ఇన్ని భాగాలు సరిగ్గా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కదాంట్లో అయినా సమస్య ఏర్పడితే మింగడం కష్టంగా మారుతుంది. దీనినే డిస్ ఫేజియా అని పిలుస్తారు.

|

Inability To Swallow: శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారం. అది ద్రవ రూపంలోని ఆహారం అయినా, ఘన రూపంలోని ఆహారం అయినా అది నోటి ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తేనే అది జీర్ణమై శరీరానికి శక్తి వస్తుంది. అయితే ఎలాంటి ఆహారాన్ని అయినా మింగడం ద్వారానే అందరం తీసుకుంటాం.

What is dysphagia? What causes difficulty in swallowing food? know the details in Telugu

మింగడంలో అనేది చాలా తేలికంగా కనిపించినా దాని వెనక సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. నాడులు, కండరాలు, కవాటాలు, మెదడు ఇలా చాలా భాగాలు పని చేస్తే కానీ ఆహారాన్ని మింగడం జరగదు. మొదట ఆహారాన్ని నోట్లో పెట్టుకోగానే, అక్కడి నుండి మెదడుకు సమాచారం వెళ్తుంది. తర్వాత మెదడు నుండి వచ్చిన సందేశాల ఆధారంగా నోరు కదలడం మొదలవుతుంది. నోట్లో ఆహారం పెట్టుకోగానే కొండ నాలుక నుండి స్వరపేటిక వరకు ఉండే భాగాన్ని నాలుక మూసేస్తుంది.

నాలుకపై ఉన్న ఆహారం శ్వాస మార్గంలోకి వెళ్లకుండా ఎపిగ్లాటిస్ అనే మృదులాస్తి పొర శ్వాస నాళాన్ని మూసేస్తుంది. తర్వాత అన్నవాహిక పై స్ఫింక్టర్ తెరుచుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కొన్ని సెకన్లలో జరిగిపోతుంది. తర్వాత ఆహారంలో అన్నవాహిక నుండి గొట్టంలాంటి నిర్మాణం గుండా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది.

ఆహారం మింగడానికి ఇన్ని భాగాలు సరిగ్గా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కదాంట్లో అయినా సమస్య ఏర్పడితే మింగడం కష్టంగా మారుతుంది. దీనినే డిస్ ఫేజియా అని పిలుస్తారు.

మింగడంలో సమస్య ఎలా వస్తుంది?

మింగడంలో సమస్య ఎలా వస్తుంది?

యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి(GERD):

యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు కడుపులోని పదార్థాలు తిరిగి అన్న వాహికలోకి ప్రవహించినప్పుడు కనిపిస్తాయి. గుండెల్లో మంట, కడుపు నొప్పి, బర్పింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గుండెల్లో మంట:

గొంతులో చేదు రుచితో గుండెల్లో లేదా ఛాతిలో మంట సంభవిస్తుంది.

ఈసోఫేగల్ వెబ్ :

కొందరికి అన్నవాహికలోని కణజాలం పలుచటి పొరలా ఏర్పడుతుంది. దీనిని ఈసోఫేగల్ వెబ్ అంటారు. ఇది అన్నవాహికలో ఎక్కడైనా రావొచ్చు. చాలా మందిలో పై భాగంలోనే ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువగా వస్తుంది.

అకలేషియా కార్డియో:

అన్నవాహికలోని కండరాలు సరిగ్గా తెరచుకోకపోవడం వల్ల అకలేషియా కార్డియో సంభవిస్తుంది. అన్నవాహిక, జీర్ణాశయం కలిగే చోట ఉండే వలయం సరిగ్గా తెరచుకోకపోవడం వల్ల ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోదు.

నాడీ సమస్యలు:

ఆహారం మింగడానికి తోడ్పడే కండరాలు, నాడులను దెబ్బతీసే ఎలాంటి సమస్యలైనా డిస్ ఫేజియాకు దారి తీస్తాయి. నాడీ సమస్యలు, పక్షవాతం, న్యూరాని డిసీజ్ వంటి వాటి వల్ల మింగడం కష్టంగా మారుతుంది.

అన్నవాహిక క్యాన్సర్:

అన్నవాహిక యొక్క లైనింగ్ లో ప్రాణాంతక కణితి ఏర్పడినప్పుడు అది క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఇది ఆహారాన్ని మింగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది.

హెర్పెస్ ఎసోఫాగిటిస్

హెర్పస్ ఎసోఫాగిటిస్ సింప్లెక్స్ వైరస్ టైప్-1 వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల కొంత ఛాతీ నొప్పి వస్తుంది. అలాగే ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తుతుంది.

ఈ కారణాల వల్ల కూడా మింగడంలో సమస్యలు రావొచ్చు

ఈ కారణాల వల్ల కూడా మింగడంలో సమస్యలు రావొచ్చు

* స్ట్రోక్

* డిమెన్షియా

* తల, మెడ, గొంతు క్యాన్సర్

* క్యాన్సర్ చికిత్సలు( రేడియేషన్, కీమోథెరపీ)

* తల గాయం

* పార్కిన్సన్స్ వ్యాధి

* నాడీ సంబంధిత రుగ్మతలు

* కండరాల బలహీనత

డిస్ ఫేజియా లక్షణాలు:

డిస్ ఫేజియా లక్షణాలు:

డిస్ ఫేజియా ఉన్న వారిలో మింగడంలో ఇబ్బందితో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

* డ్రూలింగ్

* గద్గద స్వరం

* గొంతులో ఏదో పేరుకుపోయినట్లు అనిపించడం

* రెగ్యురిటేషన్

* బరువు కోల్పోవడం

* గుండెల్లో మంట

* మింగేటప్పుడు దగ్గు

* మింగేటప్పుడు నొప్పి

* ఆహారాన్ని నమలడం కష్టం

* న్యూమోనియా

* ముక్కు నుండి ఆహారం బయటకు రావడం

English summary

What is dysphagia? What causes difficulty in swallowing food? know the details in Telugu

read on to know What is dysphagia? What causes difficulty in swallowing food? know the details in Telugu
Story first published:Wednesday, November 30, 2022, 12:48 [IST]
Desktop Bottom Promotion