For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monkey pox: మంకీపాక్స్ అంటే ఏమిటి? లక్షణాలు, తగ్గించుకునే మార్గాలు!

మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి, మంకీపాక్స్ ఎలా సోకుతుంది, చికిత్స ఏమిటి

|

Monkey pox: ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత భయపెడుతున్న మరో సమస్య మంకీ పాక్స్. విదేశాల్లో వీటి కేసులు ఇప్పటి వరకు తక్కువ మొత్తంలోనే గుర్తించినప్పటికీ..

What is Monkeypox:? Know Causes, Symptoms, Transmission, Treatment and Prevention in Telugu

మంకీ పాక్స్ పై చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) కూడా మంకీ పాక్స్ పట్ల దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే కేరళలో మంకీపాక్స్ ను గుర్తించారు. ఇదే దేశంలో వెలుగుచూసిన మొట్ట మొదటి మంకీ పాక్స్ కేసు.

మంకీపాక్స్ అంటే ఏంటి?

మంకీపాక్స్ అంటే ఏంటి?

మంకీ పాక్స్ అనేది అరుదైన వైరస్. ఆఫ్రికాలోని అడవి జంతువుల నుండి మనుషులకు ఈ వైరస్ వ్యాపించింది. మంకీపాక్స్ సోకితే చర్మంపై పొక్కులు వస్తాయి. అవి దురద పెడతాయి.కొందరిలో చీము, రక్తం కారుతుంది. ఇది ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా సోకుతుంది. వాళ్లు ఉపయోగించిన దుస్తులు, పరుపు తాకడం వల్ల వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఒక వేళ మంకీపాక్స్ సోకినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే కోలుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?

మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?

మంకీ పాక్స్ వ్యాధి సోకితే జ్వరం వస్తుంది. దీనితో పాటు తల నొప్పి, నడుం నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ మాదిరే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు వస్తాయి. బొబ్బలు ఏర్పడతాయి. మంకీ పాక్స్ ఎక్కువగా ఉన్న వారిలో శరీరమంతా ఈ పొక్కులు వస్తాయి. వీటి నుండి చీము, రక్తం కారుతుంది.

మంకీపాక్స్ సోకిన తర్వాత ఎన్ని రోజులకు బయటపడుతుంది?

మంకీపాక్స్ సోకిన తర్వాత ఎన్ని రోజులకు బయటపడుతుంది?

మంకీపాక్స్ వివిధ మార్గాల ద్వారా మనుషులకు సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే దాని ప్రభావాన్ని చూపదు. ఈ వైరస్ మొదట శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. అందు కోసం కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ లక్షణాలూ ఉండవు కాబట్టి.. మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించలేరు. మంకీ పాక్స్ సోకిన తర్వాత 14 నుండి 21 రోజుల తర్వాత లక్షణాలు చాలా మందిలో మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు.. కానీ, శరీరంపై చిన్న చిన్న సైజుల్లో బొబ్బలు కనిపిస్తాయి.

మంకీపాక్స్ పై ఆందోళన ఎందుకు.. అది ప్రాణాంతకమా?

మంకీపాక్స్ పై ఆందోళన ఎందుకు.. అది ప్రాణాంతకమా?

సాధారణంగా మంకీ పాక్స్ దానంతటం అదే తగ్గిపోతుంది. కానీ చాలా కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాంతకం కావొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మరణాల రేటు 3 నుండి 6 శాతం వరకు ఉంది. కొన్ని సార్లు మరణాలు 10 శాతానికి పైగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరణాల రేటు పెరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

మంకీపాక్స్ మొదట అడవి జంతువుల నుండి మనుషులకు సోకింది. తర్వాత మనుషుల మధ్య వ్యాప్తి చెందుతోంది. వైరస్ సోకిన వ్యక్తులు వాడిన తువ్వాలు, దుప్పట్లు, కర్చీఫ్ లు ఇతరులు వాడితే ఈ వైరస్ వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న వారు తుమ్మినా, దగ్గినా ఇది వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

మంకీపాక్స్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి?

మంకీపాక్స్ డీఎన్ఏ వైరస్. సాధారణంగా డీఎన్ఏ వైరస్ లలో మ్యూటేషన్ తక్కువగా ఉంటుంది. అదే ఆర్ఎన్ఏ వైరస్ లలో మ్యూటేషన్ లు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అందులో మ్యూటేషన్లు చాలా ఎక్కువ. అయితే ఇప్పటివరకు మంకీపాక్స్ లో కొత్తి వేరియంట్స్ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్- WHO తెలిపింది.

దీనికి ఏ చికిత్స చేయాలి?

మంకీపాక్స్ కు కూడా కొవిడ్-19 సోకితే ఎలాంటి చికిత్స అందించారో.. అలాంటి చికిత్సనే అందుబాటులో ఉంది. అంటే లక్షణాల నుండి ఉపశమనం కలిగించేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. కానీ వైరస్ ను అంతమొందించేందుకు ఎలాంటి మందులు లేవు. యాంటీ వైరల్ మందులు కూడా మంకీపాక్స్ చికిత్స కోసం వాడతారు. మంకీపాక్స్ సోకకుండా, లేదా సోకినా దానిని జయించేందుకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తయారు చేయలేదు. మశూచికి ఇచ్చే టీకాలు మంకీపాక్స్ పై 85 శాతం వరకు పనిచేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది.

ఇది పిల్లలకు సోకుతుందా?

ఈ వైరస్ కు పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు. కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు తక్కువగా కనిపించాయి . కానీ, మంకీపాక్స్ తీవ్రత పిల్లలపై ఎక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కడుపులోని పిండానికీ కూడా ఇది సోకే ప్రమాదం ఉంది.

మంకీపాక్స్ పై అపోహలు, వాస్తవాలు..

మంకీపాక్స్ పై అపోహలు, వాస్తవాలు..

* ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి కాదు. అయినప్పటికీ ఇది సాధారణంగా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్‌ ఉన్నట్లైతే ఈ వైరస్ వ్యాపిస్తుంది.చేతులు పట్టుకోవడం, తాకడం, కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటి వాటితో వైరస్ సోకుతుంది.

* మంకీపాక్స్ కేవలం కోతుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది అనేది అపోహ మాత్రమే.వైరస్ సోకిన ఏ జంతువు, మనిషి నుండి అయినా మంకీపాక్స్ స్ప్రెడ్ అవుతుంది.

* మాంసం తినడం ద్వారా మంకీపాక్స్ సంక్రమించదు. బాగా ఉడికించిన మాంసం నుండి వైరస్ లు వ్యాప్తి చెందవు.

* స్వలింగ సంపర్కులకే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కానీ ఇది ప్రతి ఒక్కరికీ సోకే ప్రమాదం ఉంది.

English summary

What is Monkeypox:? Know Causes, Symptoms, Transmission, Treatment and Prevention in Telugu

Read on to know What is Monkeypox:? Know Causes, Symptoms, Transmission, Treatment and Prevention in Telugu
Story first published:Friday, July 15, 2022, 12:35 [IST]
Desktop Bottom Promotion