For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shane Warne's Extreme Liquid Diet:షేన్ వార్న్ తీసుకున్న లిక్విడ్ డైట్ శరీరానికి ఎంత హానికరమో తెలుసా...

ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ తీసుకున్న లిక్విడ్ డైట్ అంటే ఏమిటి, ఇది ఎంతవరకు క్షేమకరం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ గత వారం మరణించిన సంగతి తెలిసిందే. అయితే థాయ్ లాండ్ పోలీసులు శవ పరీక్ష నిర్వహించగా, అతను సహజంగానే చనిపోయాడని తేలింది.

What is Shane Warnes Extreme Liquid Diet and How safe it is in Telugu

అయితే షేన్ వార్న్ నిరంతరం 'Liquid Diet'లో ఉండేవారని, తద్వారా అతని కండరాలపై పని చేసి తన బాడీని మంచి షేప్ లో ఉంచుకునేవాడని ఆ నివేదికలో వెల్లడైంది. ప్రపంచంలో గొప్ప బౌలర్లలో ఒకడైన షేన్ వార్న్ 52 ఏళ్ల వయసులో బరువు తగ్గేందుకు 'లిక్విడ్ డైట్' తీసుకుంటున్నట్లు ఫిబ్రవరి 28వ తేదీన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

What is Shane Warnes Extreme Liquid Diet and How safe it is in Telugu

గత 14 రోజులుగా విపరీతమైన లిక్విడ్ డైట్(Liquid Diet)తో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది అతని మరణానికి కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. షేన్ వార్న్ కొద్ది రోజుల క్రితం బరువు తగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడని, అందుకే ఈ లిక్విడ్ డైట్ ఫాలో అయ్యాడని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలోనే బరువు, ఫిట్ నెస్, డైట్ కి సంబంధించిన పోస్టును గత వారం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ 'ఆపరేషన్ ష్రెడ్ మొదలైంది (10 రోజుల్లో). జులై మాసంలోపు తిరిగి ఫిట్ గా తయారవుతా' అంటూ పేర్కొన్నాడు. వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'వార్న్ ఒక రకమైన డైట్ ప్లాన్ ను ఫాలో అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 14 రోజుల పాటు లిక్విడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాడు' అని వివరించారు. ఈ సందర్భంగా లిక్విడ్ డైట్ అంటే ఏమిటి? అవి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

No Smoking Day:సిగరెట్ మానేయాలంటే.. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి..No Smoking Day:సిగరెట్ మానేయాలంటే.. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి..

లిక్విడ్ డైట్ అంటే ఏమిటి?

లిక్విడ్ డైట్ అంటే ఏమిటి?

షేన్ వార్న్ తీసుకున్న లిక్విడ్ డైట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిలో కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా కీలకమైనది. దీంట్లోని లిక్విడ్ తో క్యాలరీలను కరిగించుకునే ప్రయత్నం చేస్తారు. బరువు తగ్గేందుకు ఇది చాలా మంచిగా ఉంటుందని, అందుకే దీన్ని ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. వీటిలో సాధారణంగా పండ్లు, కూరగాయల నుండి జ్యూస్ తీసుకుని తాగుతుంటారు. ఇవి బాడీలో అధిక కొవ్వును కరిగించి, బరువును తగ్గిస్తాయి.

వార్న్ ఏమి తీసుకున్నారంటే..

వార్న్ ఏమి తీసుకున్నారంటే..

వార్న్ మేనేజర్ తెలిపిన వివరాల మేరకు.. బరువు తగ్గడంలో భాగంగా వార్న్ తన ఆహారంలో తెల్లటి బన్ ను వెన్నతో తీసుకుంటున్నాడు. వీటితో పాటు బ్లాక్, గ్రీన్ కలర్ జ్యూస్ లు ఉన్నాయి. అయితే గతంలో షేన్ వార్న్ విపరీతంగా స్మోకింగ్ చేసేవాడు. అది కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు. తన తండ్రి 30 రోజుల ఫాస్టింగ్ టీ డైట్ ని ఎందుకు తీసుకుంటాడో వార్న్ తనయుడు ప్రకటించాడు. వార్న్ తన మరణానికి కొన్ని రోజుల ముందు డైట్ ప్లాన్ పూర్తి చేశాడని, ఆ తర్వాత వెజిమైట్ టోస్ట్ తిన్నాడని నివేదికల ద్వారా తెలుస్తోంది.

లెమన్ ఆయిల్ శరీరానికి అద్భుత శక్తిని ఇస్తుంది...లెమన్ ఆయిల్ శరీరానికి అద్భుత శక్తిని ఇస్తుంది...

గుండెపై లిక్విడ్ ఫుడ్ ప్రభావం..

గుండెపై లిక్విడ్ ఫుడ్ ప్రభావం..

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఓ నివేదిక ప్రకారం, వార్న్ అకాల మరణానికి కారణం లిక్విడ్ డైట్ వల్లనే అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. లిక్విడ్ డైట్స్ లో సాధారణంగా మినరల్స్ మరియు విటమిన్లు ఉండే అనేక రకాల జ్యూస్ లు ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు మరియు కొవ్వులు, పీచు పదార్థాలు ఉండవు. అయితే ఈ డైట్లో ఉండేవారు ఆహారాన్ని బ్యాలెన్స్ గా తీసుకోవాలని, లేని పక్షంలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గుండెపై ప్రభావం..

గుండెపై ప్రభావం..

హార్ట్ ఫౌండేషన్ కు చెందిన ఆరోగ్య నిపుణులు ప్రొఫెసర్ గ్యారీ జెన్నింగ్స్ ప్రకారం, తక్కువ కేలరీల తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో గుండెపై ప్రభావం చూపుతుంది. సహజంగానే, ద్రవ ఆహారం నుండి అవసరమైన పోషకాలను పొందలేరు. తక్కువ క్యాలరీల ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాల బ్యాలెన్స్ ఉండవని నమ్ముతారు. లిక్విడ్ డైట్ వల్ల తలనొప్పి, తల తిరగడం, అలసట, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి అనేక దుష్ప్రభావాలు ఉండొచ్చని BBC నివేదిక వివరించింది.

FAQ's
  • షేన్ వార్న్ ఏ డైట్ ఫాలో అయ్యాడు?

    వార్న్ మేనేజర్ తెలిపిన వివరాల మేరకు.. బరువు తగ్గడంలో భాగంగా వార్న్ తన ఆహారంలో తెల్లటి బన్ ను వెన్నతో తీసుకుంటున్నాడు. వీటితో పాటు బ్లాక్, గ్రీన్ కలర్ జ్యూస్ లు ఉన్నాయి. అయితే గతంలో షేన్ వార్న్ విపరీతంగా స్మోకింగ్ చేసేవాడు. అది కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు. తన తండ్రి 30 రోజుల ఫాస్టింగ్ టీ డైట్ ని ఎందుకు తీసుకుంటాడో వార్న్ తనయుడు ప్రకటించాడు. వార్న్ తన మరణానికి కొన్ని రోజుల ముందు డైట్ ప్లాన్ పూర్తి చేశాడని, ఆ తర్వాత వెజిమైట్ టోస్ట్ తిన్నాడని నివేదికల ద్వారా తెలుస్తోంది.

  • లిక్విడ్ డైట్ అంటే ఏమిటి?

    షేన్ వార్న్ తీసుకున్న లిక్విడ్ డైట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిలో కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా కీలకమైనది. దీంట్లోని లిక్విడ్ తో క్యాలరీలను కరిగించుకునే ప్రయత్నం చేస్తారు. బరువు తగ్గేందుకు ఇది చాలా మంచిగా ఉంటుందని, అందుకే దీన్ని ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. వీటిలో సాధారణంగా పండ్లు, కూరగాయల నుండి జ్యూస్ తీసుకుని తాగుతుంటారు. ఇవి బాడీలో అధిక కొవ్వును కరిగించి, బరువును తగ్గిస్తాయి.

English summary

What is Shane Warne's Extreme Liquid Diet and How safe it is in Telugu

Australian Cricketer Shane Warne was on a 14-day liquid diet which consisted of just liquids and no food. Know what it is and how safe is it in telugu. Read on,
Story first published:Thursday, March 10, 2022, 12:24 [IST]
Desktop Bottom Promotion