For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

R.1 COVID-19 అంటే ఏమిటి? దీని లక్షణాలు, ప్రమాదాల గురించి తెలుసుకోండి...

|

కరోనా మహమ్మారితో మనమంతా ఏడాదిన్నరగా పోరాడుతూనే ఉన్నాం. ఇది వచ్చినప్పటి నుండి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కలవరపడుతూనే ఉన్నారు. అంతలా ఈ కరోనా భూతం విధ్వంసం చేసేసింది.

ఒకవైపు దీన్ని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు కనిపెడుతూ ఉంటే.. మరోవైపు కోవిద్-19 యొక్క కొత్త వేరియంట్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా R.1 వేరియంట్ యొక్క మరో కొత్త జాతినికి పరిశోధకులు కనుగొన్నారు.

ఇది అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తక్కువ సంఖ్యలో కోవిద్ కేసులకు దారి తీసింది. ఇది ప్రస్తుతానికి ఆందోళనకరంగా లేనప్పటికీ.. ఇది కూడా ఒక అంటు వ్యాధిలా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఈ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కోవిద్-19 R.1 వేరియంట్ అంటే?

కోవిద్-19 R.1 వేరియంట్ అంటే?

ఈ వేరియంట్ కొత్తగా అనిపించినప్పటికీ.. R.1 వేరియంట్ గత సంవత్సరం జపాన్ దేశంలో తొలిసారిగా కనుగొనబడింది. అప్పటినుండి ఈ వైవిధ్యాలు యునైటెడ్ స్టేట్స్(USA)తో సహా దాదాపు 35 దేశాల్లో కనుగొనబడ్డాయి.

ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పది వేల మందికి పైగా సోకినట్లు కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC)నివేదిక ప్రకారం R.1 ఉత్పరివర్తనలు ఏప్రిల్ 2021 నుండి యుఎస్ లో ఉన్నాయి. ఇది కెంటుకీ నర్సింగ్ హోమ్ లలో కనుగొనబడింది. ఇక్కడ చాలా మంది రోగులకు పూర్తిగా వ్యాక్సిన్లు వేశారు.

CDC అధ్యయనం ప్రకారం, టీకాలు వేయించని వ్యక్తులతో పోలిస్తే నర్సింగ్ హోమ్ లలో టీకాలు వేసిన వ్యక్తులు లక్షణాలు అభివ్రుద్ధి చెందే అవకాశం 87 శాతం తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం, CDC R.1 వేరియంట్ ను ప్రమాదకరమైనదిగా నిర్ధారణ చేయలేదు.

ఇది ఆందోళనకరమా?

ఇది ఆందోళనకరమా?

R.1 వేరియంట్ అనేది Sars-COV-2 వైరస్ యొక్క జాతి. అయితే ఇది వివిధ రూపాలు మరియు విభిన్న సామర్థ్యాలు, పరిమితులను కలిగి ఉండొచ్చు. అసలు వేరియంట్ కాకుండా, కొత్త వేరియంట్లు ప్రజలను విభిన్నంగా ప్రభావితం చేయొచ్చు.

డెల్టా వేరియంట్ కోవిద్-19 యొక్క అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా విశ్వసిస్తుండగా.. శాస్త్రవేత్తలు R.1 వేరియంట్ల గురించి కొంతకాలం వేచి చడాల్సి ఉంటుందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, వ్యాక్సిన్ భద్రత మరియు మోనోక్లోనల్ యాంటీ బాడీ ట్రీట్మెంట్ నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని చూపించడంతో పాటు R.1 వేరియంట్లలో ప్రత్యేకమైన మ్యుటేషన్లు ఉన్నాయి. ఇవి రెప్లికేషన్ మరియు ట్రాన్స్ మిషన్ ను మెరుగుపరుస్తాయి.

వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లు సురక్షితమా?

వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లు సురక్షితమా?

CDC నివేదిక ప్రకారం, R.1 వేరియంట్ నుండి వ్యాక్సిన్ వేసుకున్న వారు తప్పించుకోగలరా? అంటే అది దానిలోని ఉత్పరివర్తనాల సమితిపై ఆధారపడి ఉంటుంది. R.1 వేరియంట్లు ఉత్పరివర్తనాల కలయికను కలిగి ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ యొక్క సంభావ్య ఎస్కేప్ ఉత్పరివర్తనాలతో పాటుగా రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (E484K), ఇది N-టెర్మినల్ డొమైన్ లో W152L మ్యుటేషన్ కూడా కలిగి ఉంటుంది. ఇది స్పైక్ ప్రోటీన్ యొక్క ప్రాంతం, వాటి ప్రభావాన్ని తగ్గించే యాంటీబాడీస్ లక్ష్యం.

484 మ్యుటేషన్ కోన్వాలసెంట్ సెరాలోని యాంటీ బాడీలకు మరియు మోనోక్లోనల్ యాంటీబాడీలను తటస్థీకరించేందుకు నిరోధకతను పెంచుతుంది. E484K బీటా, గామా, ఎటా, ఐయోటా మరియు ఈ వేరియంట్లలో లభిస్తుంది. R.1 వేరియంట్లలోని మ్యుటేషన్ టీకాలు వేసిన వ్యక్తులలో యాంటీ బాడీ రక్షణను ఇస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అత్యంత ప్రముఖ వేరియంట్..

అత్యంత ప్రముఖ వేరియంట్..

కొత్తగా డెవలప్ అవుతున్న వైవిధ్యాలు ఆందోళన మరియు ఉత్సుకతకు మూలంగా ఉన్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పటికీ అత్యంత ఆధిపత్య జాతిగా, ఇది వేగంగా విస్తరిస్తోందని నమ్ముతున్నారు. CDC ప్రకారం ‘డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాకరమైన అంటువ్యాధి. ఇది ఇంతకుముందు ఉన్న వేరియంట్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది' ‘డెల్టా వేరియంట్లు గతంలో అనుకున్నదాని కంటే తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని కొత్త డేటా సూచిస్తోంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇటీవల నివేదిక ప్రకారం, టీకాలు వేయించుకోని వ్యక్తులతో పోలిస్తే, టీకాలు వేయించుకోని వారికి తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో మరియు పది రెట్లు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసింది.

కోవిద్-19 R.1 వేరియంట్ ఎక్కడ కనిపెట్టారు?

కోవిద్-19 R.1 వేరియంట్ కొత్తగా అనిపించినప్పటికీ.. R.1 వేరియంట్ గత సంవత్సరం జపాన్ దేశంలో తొలిసారిగా కనుగొనబడింది. అప్పటినుండి ఈ వైవిధ్యాలు యునైటెడ్ స్టేట్స్(USA)తో సహా దాదాపు 35 దేశాల్లో కనుగొనబడ్డాయి. ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పది వేల మందికి పైగా సోకినట్లు కొత్త నివేదికలు సూచిస్తున్నాయి.

English summary

What Is the R.1 COVID-19 Variant? Symptoms and All you need to know in about new variant in Telugu

What Is the R.1 COVID-19 Variant? Here's what you need to know about the R.1 COVID-19 variant and how to protect yourself from it. Read on.
Story first published: Saturday, September 25, 2021, 11:24 [IST]