For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Masculinity: ముఖం చూసి మగతనం ఉందో? లేదో? చెప్పొచ్చా

మగతనం అనేది ల్యాబ్ పరీక్షల్లో మాత్రమే నిర్ధారణ అవుతుంది. ఒకవేళ అలా నిర్ధారణ అయినప్పటికీ.. ఒక మగాడు పడక గదిలో ఎలా ప్రవర్తిస్తాడన్న దానిపై నిజమైన మగతనం ఆధారపడి ఉంటుంది.

|

Masculinity: పురుషుల ముఖం చూసి వారిలో మగతనం ఉందో లేదో మహిళలు చెప్పేస్తారు..? శృంగారంలో వారు తమను తృప్తి పరచగలుగుతారో లేదో చూడగానే తెలిసిపోతుందా..? అసలు నిజంగా అది సాధ్యమేనా ఇప్పుడు తెలుసుకుందాం.

What Makes a Persons Face Look Masculine in telugu

మగతనం అనేది ల్యాబ్ పరీక్షల్లో మాత్రమే నిర్ధారణ అవుతుంది. ఒకవేళ అలా నిర్ధారణ అయినప్పటికీ.. ఒక మగాడు పడక గదిలో ఎలా ప్రవర్తిస్తాడన్న దానిపై నిజమైన మగతనం ఆధారపడి ఉంటుంది. మగవారిలో ఆత్మవిశ్వాసం లేకపోయినా.. పర్ఫార్మెన్స్ ఆంగ్జైటీ ఉన్నా.. వాళ్లు బెడ్రూంలో వారి మగతనాన్ని చూపించలేరు. కొంత మందిలో హార్మోన్లు, నరాలు, రక్త ప్రసరణ ఇలా అన్నీ బాగున్నా సెక్స్ చేయలేరు.

What Makes a Persons Face Look Masculine in telugu

ముఖం చూడగానే స్త్రీ లక్షణాలు కనిపిస్తే వారిలో ఆడతనం ఉన్నట్టుగా... పురుషుని ముఖం కాస్త రఫ్ గా, కఠినంగా కనిపిస్తే మగతనం ఉన్నట్లుగా భావిస్తారు.కానీ, UKలోని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం, అలా అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. పురుషులు పొడవుగా లేదా బరువుగా కనిపిస్తేనే వారు మరింత పురుషంగా భావించబడతారని అధ్యయనం కనుగొంది. పురుషత్వం ఆకర్షణపై మరియు నాయకత్వం మరియు నమ్మకం వంటి అనేక ఇతర లక్షణాలపై శక్తివంతమైన ప్రభావాలను చూపుతుందని అధ్యయనంలో తేలింది.

శరీర ఆకృతిని బట్టి మగతనం తెలుస్తుందా?

శరీర ఆకృతిని బట్టి మగతనం తెలుస్తుందా?

దీని గురించి ఒక అధ్యయనం జరిగింది. ఎత్తు, బరువు లాంటి వాటి ఆధారంగా పురుషుల్లో మగతనం ఉందా లేదా మహిళలకు కనుక్కోగలుగుతారా అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. అలాగే ముఖాలు మాత్రమే చూపించి వారి ఎత్తు, బరువు అంచనా వేయగలుగుతారా అని ఆ అధ్యయనంలో పాల్గొన్న పలువురు మహిళలను వారు అడిగారు.

ముఖం చూసి ఎక్కువ లేదా తక్కువగా అంచనా వేస్తారు:

ముఖం చూసి ఎక్కువ లేదా తక్కువగా అంచనా వేస్తారు:

అయితే అందులో పాల్గొన్న మహిళలు ఇచ్చిన సమాధానం కొంత ఆశ్చర్యకరంగా ఉందని అధ్యయనాన్ని నిర్వహించిన వారు వెల్లడించారు. ముఖ కవలికలను చూసి ఆయా పురుషులు ఉన్నఎత్తు, బరువు కంటే కూడా మహిళలు ఎక్కువగా అంచనా వేసినట్లు తెలిపారు. ఎత్తు మరియు బరువుకు సంబంధించిన వాస్తవ భౌతిక వ్యత్యాసాలపై ప్రజలు తమ గ్రహణాత్మక తీర్పులను ఆధారం చేసుకుంటారని పరిశోధనలు సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశీలకులు పొడవాటి లేదా బరువైన వ్యక్తిని మరింత పురుషుడిగా ఎందుకు అర్థం చేసుకోవచ్చో ఈ "పర్సెప్షన్ ఓవర్ జనరలైజేషన్" వివరించగలదని పరిశోధకులు అంటున్నారు.

లైంగిక ఆసక్తి లేకపోవడం:

లైంగిక ఆసక్తి లేకపోవడం:

రతి క్రీడలో పాల్గొనాలన్న ఆసక్తి లేకపోతే పురుషుల్లో మగతనం ఉన్నా.. దాని వల్ల సెక్స్ చేయలేరని అంటున్నారు వైద్యులు. పని ఒత్తిడి, ఇతర సమస్యలు, ఆలోచనలు, డిప్రెషన్ వల్ల వారు కలయికపై పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ కారణాల వల్ల కూడా వారు రతి క్రీడలో రెచ్చిపోకుండా డీలా పడిపోతారు. కొందరు శృంగారం అంటే ఉండే భయం వల్ల కూడా దానిపై ఆసక్తి లేకుండా చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో సెక్స్ అనేది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ప్రభావితం అవుతుంది. అంటే సెక్స్ డ్రైవ్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో మంచి ఆహారం తీసుకోవడం ఒకటి కాగా.. వ్యాయామం అనేది తప్పనిసరిగా జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే మద్యపానం, మాదక ద్రవ్యాలు, ధూమపానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలి. ఈ చెడు అలవాట్ల వల్ల పురుషుల్లో లైంగిక ఆసక్తి తగ్గుతుంది. ఊబకాయం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్త హీనత, టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం వల్ల కూడా సెక్స్ అంటే ఆసక్తి చూపించరు పురుషులు.

అన్ని పరిశోదనలు తేల్చిన విషయం ఏమిటంటే మగతనం అనేది కలయిక ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ ముఖం చూసి చెప్పలేమని తేల్చాయి. పురుషుల్లో మగతనం ఉన్నప్పటికీ, ఒక్కోసారి డీలా పడిపోతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంగం స్తంభించకపోవడం:

అంగం స్తంభించకపోవడం:

పురుషత్వం లేకపోవడానికి సాధారణంగా కారణం అయ్యేది అంగం స్తంభించకపోవడం. లిబిడో తగ్గడం వల్ల పురుషాంగం నిటారుగా నిలుచోకుండా చేస్తుంది. అలాగే అంగానికి సక్రమంగా రక్త ప్రసరణ లేక పోవడం కూడా అంగం స్తంభించకపోవడానికి కారణం అవుతుంది. కొందరిలో సెక్స్ మొదట్లో అంగం స్తంభించినా.. రతి క్రీడ పూర్తి కాకముందే చల్లబడిపోతుంది. ఇది కూడా ఓ కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

English summary

What Makes a Person's Face Look Masculine in telugu

read on to know What Makes a Person's Face Look Masculine in telugu
Story first published:Friday, August 5, 2022, 17:23 [IST]
Desktop Bottom Promotion