For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Heart Day 2021 : గుండెపోటు రాకుండా ఉండాలంటే గుడ్లు తినాలంట...!

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా దాని యొక్క థీమ్ చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

|

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్ హార్ట్. అది లేకపోతే మనిషి మనుగడే ఉండదు. మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కు హార్ట్ తో డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్టుగా లింకు ఉంటుంది. మన హార్ట్ బీటును బట్టే మనకు ఎంత బిపి ఉందనే విషయాన్ని కూడా లెక్కిస్తారు.

World Heart Day : Date, Theme, History And Significance in telugu

మన ప్రాణాలన్నీ గుండె గుప్పిట్లోనే ఉంటాయన్న సంగతిని ఎవ్వరూ మరువకూడదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ గుండె దినోత్సవాన్ని(World Heart Day)జరుపుకుంటారు. ఈరోజున గుండె జబ్బుల బారిన పడి అకాల మరణం పొందకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్లో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రపంచ హృదయ సమాఖ్య(World Heart Fedaration), కృషి చేస్తోంది..

World Heart Day : Date, Theme, History And Significance in telugu

ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ సంస్థ గుర్తించింది. ఇలాంటి పరిస్థితిని తగ్గించేందుకు అది ప్రతి సంవత్సరం కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి ఎలాంటి వ్యాయామం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలనే విషయాలను వివరిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎప్పుడు ప్రారంభమైందంటే..

ఎప్పుడు ప్రారంభమైందంటే..

World Heart Fedaratin(WHF) అనేది ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది 2000లో జెనీవా, స్విట్జర్లాండులో స్థాపించబడింది. ఇందులోని ఫెడరేషన్ సభ్యులు గుండె జబ్బుల నుండి అకాల మరణం సంభవించకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. గుండె గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలలో అవగాహన కల్పిస్తుంటారు. ఈ ప్రచారంలో, ఇండియన్ హార్ట్ అసోసియేషన్ వంటి అనేక ప్రధాన సంస్థలతో సహా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ యొక్క చాలా మంది పనిచేస్తున్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవ ప్రాముఖ్యత..

ప్రపంచ హృదయ దినోత్సవ ప్రాముఖ్యత..

ప్రపంచ హృదయ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడం గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం స్ట్రోక్ మరియు గుండె జబ్బులతో సహా హృదయ సంబంధ వ్యాధులు అని తేలింది. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక నిష్క్రియాత్మకత వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి ప్రజలు తీసుకోగల చర్యలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. దీని వల్ల 80% అకాల మరణాలను గుండె జబ్బులు మరియు స్ట్రోక్ నుండి నివారించవచ్చు.

2025 నాటికి..

2025 నాటికి..

సంక్రమణ రహిత వ్యాధుల మరణాలలో దాదాపు సగం మందికి గుండె జబ్బులు కారణమవుతున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా మరణానికి మొదటి స్థానంలో ఉంది. మే 2012 లో, ప్రపంచ నాయకులు 2025 నాటికి నాన్-కమ్యూనికేట్ వ్యాధుల నుండి ప్రపంచ మరణాలను 25% తగ్గించాలని ప్రణాళిక వేశారు.

హార్ట్ స్ట్రోక్ ఎందుకొస్తుంది..

హార్ట్ స్ట్రోక్ ఎందుకొస్తుంది..

హార్ట్ ఎటాక్ అనేది కొందరికి వంశపారంపర్యంగా, వయసు మీదపడినా, అధిక బరువు(ఒబేసిటి), ఒత్తిడి, బిపి-షుగర్, ధూమపానం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ప్రముఖ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ చంద్రశేఖరరెడ్డి ఓ కార్యక్రమంలో వివరించారు.

ఎలా గుర్తించాలంటే..

ఎలా గుర్తించాలంటే..

ఛాతిలో నొప్పి రావడం.. ఊపిరి సరిగ్గా అందకపోవడం.. చెమట, దవడ నొప్పి, ఇవన్నీ గుండెపోటు లక్షణాలే.. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే రోగి పక్కనే ఉన్నవారు సాధ్యమైనంత వరకు వారికి అరగంటలోపు వైద్య సహాయం అందేలా ప్రయత్నించాలి. లేదా గుండెపై గట్టిగా రెండు చేతులతో నొక్కాలి(వారికి మెళకువ వచ్చేంత వరకు మాత్రమే).

గుడ్లు తింటే గుండె భద్రం..

గుడ్లు తింటే గుండె భద్రం..

ఇటీవల చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ నిపుణులు చేసిన అధ్యయనంలో గుడ్లు తింటే గుండె భద్రంగా ఉంటుందని తేల్చారు. ప్రాచీనకాలం నుండి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారని.. ఇవి మనకు కావాల్సిన ప్రోటీన్లను అందజేస్తాయన్నారు. అందుకే వారంలో కనీసం రెండుసార్లు గుడ్లు తింటే గుండె పదిలంగా ఉంటుందని వివరించారు.

FAQ's
  • వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటారు. గుండె జబ్బుల బారిన పడి ఎవ్వరూ అకాల మరణం చెందకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కలిగించేందుకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ పని చేస్తోంది.

English summary

World Heart Day : Date, Theme, History And Significance in telugu

Every year on 29 September, World Heart Day is celebrated. This year the theme is My Heart, Your Heart, which ensures heart health equity for all.
Desktop Bottom Promotion