For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Idli Day 2022: ఇడ్లీని ఇలా తింటే ఆరోగ్యానికి ఎంత లాభమో తెలుసా...

వరల్డ్ ఇడ్లీ డే 2022 సందర్భంగా, ఇడ్లీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇడ్లీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా తేలికగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది. ఇడ్లీని నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.

World Idli Day 2022: Health Benefits of Eating Idlis

అంతేకాదు అత్యంత త్వరగా జీర్ణం కూడా అవుతుంది. మనల్ని హెల్దీగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని మీకు తెలుసా? లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే, ఇలా ఎందరికో స్పెషల్ ఉన్నట్టుగానే ఇడ్లీకి కూడా ఓ స్పెషల్ డే అనేది ఉంది.

World Idli Day 2022: Health Benefits of Eating Idlis

అది ఎప్పుడంటే మార్చి 30వ తేదీ. ప్రతి సంవత్సరం మార్చి 30వ తేదీన వరల్డ్ ఇడ్లీ డేగా జరుపుకుంటారు. 2015 సంవత్సరంలో చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీన్ని గుర్తించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఎనియవన్ సుమారు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేసి, వాటి ప్రత్యేకత గురించి అందరికీ తెలిసేలా చేశాడు. అక్కడితో ఆగకుండా ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఏకంగా 44 కిలోల ఇడ్లీని కట్ చేసి సంబురాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఇడ్లీ ఎక్కడి నుండి వచ్చింది? ఇడ్లీలో ఎన్ని రకాలున్నాయి? వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వేసవిలో గుడ్లు తినాలా వద్దా? మీ సందేహాలకు మా సమాధానంవేసవిలో గుడ్లు తినాలా వద్దా? మీ సందేహాలకు మా సమాధానం

ఇడ్లీ పుట్టుక ఎక్కడంటే..

ఇడ్లీ పుట్టుక ఎక్కడంటే..

ఇడ్లీని మొట్టమొదట ఇండోనేషియా దేశంలోని పులియబెట్టిన ఆహారంగా ఆవిర్భవించింది. ఇది క్రీస్తు శకం 800-1200లో భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారతంలో ప్రజలు ఇడ్లీని సాంబార్, పచ్చడి, చట్నీ, కారంపొడి, నెయ్యితో కలుపుకుని ఎక్కువగా తింటుంటారు. వీటన్నింటి సంగతి పక్కన బెడితే.. ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఇంట్లోనే సులువుగా చేసుకునే అద్భుతమైన, ఆరోగ్యకరమైన ఇడ్లీల గురించి తెలుసుకుందాం...

రవ్వ ఇడ్లీ..

రవ్వ ఇడ్లీ..

ఈ రకమైన ఇడ్లీని సాధారణంగా రవ్వతో తయారు చేస్తారు. ఇందులోకి కొబ్బరి చట్నీ లేదా శనగలు, పప్పులతో కూడిన చట్నీని, పుదీనా పచ్చడిని తీసుకుంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇడ్లీలో దాదాపు 40 నుండి 60 క్యాలరీల వరకు ఉంటాయి.

హెల్దీ ఇడ్లీ..

హెల్దీ ఇడ్లీ..

మూంగ్ దాల్, పచ్చిమిరప, మెత్తని బంగాళదుంపలతో కలిపి స్టఫ్ డ్ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా టిఫిన్ సమయంలో తీసుకుంటారు. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా శక్తివంతంగా పనిచేయాలా? ఐతే ఇది తాగండి...వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా శక్తివంతంగా పనిచేయాలా? ఐతే ఇది తాగండి...

తట్టే ఇడ్లీ..

తట్టే ఇడ్లీ..

ఈ రకమైన ఇడ్లీని ఎక్కువగా కర్నాటక, తమిళనాడులో తింటారు. ఇవి సాధారణ ఇడ్లీ కంటే సైజులో కొంచెం పెద్దవిగా ఉంటాయి. వీటిని రవ్వ, బియ్యంతో కలిపి తయారు చేస్తారు. వీటిలో ఆరోగ్యకరమైన పోషకాలెన్నో ఉంటాయి. ఈ ఇడ్లీలను నెయ్యి, కొబ్బరి చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.

ఓట్స్ ఇడ్లీ..

ఓట్స్ ఇడ్లీ..

ఈ రకమైన ఇడ్లీ ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో లాభం చేకూరుస్తుంది. ఇడ్లీ తింటే హెల్దీ బెనిఫిట్స్ ఉంటే.. ఓట్స్ ఇడ్లీతో మరిన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటో వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మీ లైఫ్ స్టైల్ లో వీటిని భాగంగా చేసుకుంటే మరింత బలంగా తయారవ్వడం ఖాయం.

చిరుధాన్యాలతో ఇడ్లీ..

చిరుధాన్యాలతో ఇడ్లీ..

ఇటీవలి కాలంలో రకరకాల ధాన్యాలతో ఇడ్లీలను తయారు చేస్తున్నారు. బియ్యానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల్ని ఇడ్లీ తయారీలో వాడుతున్నారు. మినుములు, కొర్రలు, రాగి వంటి వాటితో కూడా ఇడ్లీలను తయారు చేస్తున్నారు. వీటిలో ప్రోటీన్లు, అనేక విటమిన్లు, పీచు పదార్థాలు లభిస్తాయి.

ఈ పొరపాట్లు చేయొద్దు..

ఈ పొరపాట్లు చేయొద్దు..

మనలో చాలా మంది ఇడ్లీ తయారీలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దీంతో వాటి వల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఇడ్లీ లు తెల్లగా ఉండాలని మినపప్పు పొట్టుని తీసి, తెల్లటి బియ్యపు రవ్వ వాడుతున్నారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల ధాన్యాల్లోని పోషకాలను కొంత మేర కోల్పోవచ్చు. మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండి పదార్థాలు శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. మరోవైపు ఇడ్లీ తయారీలో రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

FAQ's
  • వరల్డ్ ఇడ్లీ డే ఎప్పుడు? ఇడ్లీ ఎక్కడి నుండి వచ్చింది?

    ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని మీకు తెలుసా? లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే, ఇలా ఎందరికో స్పెషల్ ఉన్నట్టుగానే ఇడ్లీకి కూడా ఓ స్పెషల్ డే అనేది ఉంది. అది ఎప్పుడంటే మార్చి 30వ తేదీ. ప్రతి సంవత్సరం మార్చి 30వ తేదీన వరల్డ్ ఇడ్లీ డేగా జరుపుకుంటారు. 2015 సంవత్సరంలో చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీన్ని గుర్తించారు. ఇడ్లీని మొట్టమొదట ఇండోనేషియా దేశంలోని పులియబెట్టిన ఆహారంగా ఆవిర్భవించింది. ఇది క్రీస్తు శకం 800-1200లో భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.

  • ఇడ్లీ తయారీలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు?

    మనలో చాలా మంది ఇడ్లీ తయారీలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దీంతో వాటి వల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఇడ్లీ లు తెల్లగా ఉండాలని మినపప్పు పొట్టుని తీసి, తెల్లటి బియ్యపు రవ్వ వాడుతున్నారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల ధాన్యాల్లోని పోషకాలను కొంత మేర కోల్పోవచ్చు. మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండి పదార్థాలు శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. మరోవైపు ఇడ్లీ తయారీలో రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

English summary

World Idli Day 2022: Health Benefits of Eating Idlis

Here we are talking about the World Idli Day 2022: Health benefits of eating idlis. Have a look
Story first published:Wednesday, March 30, 2022, 11:49 [IST]
Desktop Bottom Promotion