For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Menstrual Hygiene Day 2022:పీరియడ్స్ వేళ పరిశుభ్రతకు సంబంధించి ఈ పొరపాట్లు చేయకండి...

ప్రపంచ బుుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం 2022 సందర్భంగా, నెలసరి సమయంలో మహిళలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెలా పీరియడ్స్ అనేవి కచ్చితంగా వస్తాయి. ఇలా నెలసరి వచ్చిన సమయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొందరు మహిళలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది.

World Menstrual Hygiene Day 2022

అయితే ప్రతి నెలా సరైన సమయంలో నెలసరి వస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయికి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

World Menstrual Hygiene Day 2022

ఒక క్రమ పద్ధతిలో సరైన పరిశుభ్రతను నిర్వహించడం అనేది అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి మీరు పీరియడ్స్ సమయంలో శుభ్రమైన నీరు మరియు పీరియడ్స్ పరిశుభ్రతకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను వాడాలి. ప్రస్తుతం ఇవి మనకు అందుబాటులో ఉండటం లక్కీ అనే చెప్పాలి. అయితే ఇప్పటికీ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోని మహిళలు పీరియడ్స్ సమయంలో చాలా అసౌకర్యంగా ఉంటున్నారు. కొందరు ఆ భాగంలో పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. మే 28వ తేదీన ప్రపంచ బుుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రైవేట్ భాగాన్ని బాగా కడగాలి..

ప్రైవేట్ భాగాన్ని బాగా కడగాలి..

మహిళలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో ప్రైవేట్ భాగాన్ని మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే ఇది మీ పిహెచ్ బ్యాలెన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియాలో వాగినోసిస్ కు హాని కలగొచ్చు. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ప్రైవేట్ భాగాన్ని నీటితో మాత్రమే కడగాలి. సహజమైన సబ్బుతో ఆ ప్లేసులో శుభ్రం చేసుకోవాలి.

అవి వాడొద్దు..

అవి వాడొద్దు..

పీరియడ్స్ సమయంలో సువాసన వెదజల్లే టాంపాన్లు లేదా ప్యాడ్స్, టాయిలెట్ పేపర్లను వాడకండి. ఇవి వాడటం వల్ల మీ చర్మానికి కాస్త చిరాకు కలిగించొచ్చు. ఇది మీకు మంట వచ్చేలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సువాసన లేని ఉత్పత్తులను వాడండి. ముఖ్యంగా సహజంగా లభించే వాటిని ఉపయోగించండి. ఎందుకంటే వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు.

కండోమ్ వాడండి..

కండోమ్ వాడండి..

కొందరు పీరియడ్స్ సమయంలో కూడా కలయిక కావాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఆ కార్యంలో పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీ రాదని భావిస్తారు. అయితే ఇది కొందరు మహిళలకు మాత్రమే. అందరికీ ఇలా జరగదు. అయితే ఈ సమయంలో మీరు కండోమ్ వాడితే మంచిది. ఇది లేకుండా ఆ కార్యంలో పాల్గొంటే లైంగిక పరమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గర్భాశయం కూడా కొద్దిగా విస్తరించి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా కండోమ్స్ వాడండి.

ఆరోగ్యకరమైన ఆహారం..

ఆరోగ్యకరమైన ఆహారం..

పీరియడ్స్ సమయంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా నీరు తాగాలి. లేకపోతే మీకు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. నెలసరి వచ్చినప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ బాడీలోని పోషకాల వ్యక్తీకరణకు ఇబ్బంది కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో గుడ్లు, పండ్లు, తాజా కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ప్యాడ్లను తరచుగా మార్చాలి..

ప్యాడ్లను తరచుగా మార్చాలి..

పీరియడ్స్ వచ్చిన తర్వాత తరచుగా ప్యాడ్లను మారుస్తూ ఉండాలి. లేదంటే మీకు ఇన్ఫెక్షన్ వంటివి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం పాటు ప్యాడ్లను ఉపయోగించొద్దు. ప్రతి 4-6 గంటలకు ఇవి కచ్చితంగా మార్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయాలి..

ఇలా చేయాలి..

పీరిడయ్స్ సమయంలో కాస్త చిరాకుగా ఉంటుంది. దీంతో కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు యోగా, ధ్యానం వంటివి చేయాలి. పని ఒత్తిడి తగ్గించుకోవడం.. నచ్చిన వారితో ఎక్కువ సమయం గడపడం.. గార్డెనింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

FAQ's
  • ప్రపంచ బుుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా బుుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం మే 28వ తేదీన జరుపుకుంటారు.సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయికి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో సరైన పరిశుభ్రతను నిర్వహించడం అనేది అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి మీరు పీరియడ్స్ సమయంలో శుభ్రమైన నీరు మరియు పీరియడ్స్ పరిశుభ్రతకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను వాడాలి. ప్రస్తుతం ఇవి మనకు అందుబాటులో ఉండటం లక్కీ అనే చెప్పాలి. 

English summary

World Menstrual Hygiene Day 2022: Menstrual Hygiene Mistakes to Avoid in Telugu

World Menstrual Hygiene Day 2022: Here are the common Menstrual Hygiene Mistakes made by women during periods. Read on
Desktop Bottom Promotion