For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zydus Cadila's Vaccine: 12 ఏళ్ల పిల్లలకు జైడస్ క్యాడిలా టీకా ఎలా పని చేస్తుందో తెలుసా...

మన దేశంలో 12 ఏళ్ల పిల్లలకు టీకా వేసేందుకు జైడస్ క్యాడిలా జైకోవ్-డికి ఆమోదం లభించింది. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

|

కరోనా మహమ్మారికి విరుగుడుగా ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కరోనా నియంత్రణకు మన కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తోంది.

Zydus Cadilas ZyCov-D vaccine approved for children above 12 years in India; All you Need Know About Vaccine in Telugu

తాజాగా మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. జైడస్ క్యాడిలా ఫార్మా డెవలప్ చేసిన 'ZyCov-D' వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) శుక్రవారం నాడు ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటంటే.. మూడు డోసుల ఈ టీకాను 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా ఇవ్వొచ్చు.

Zydus Cadilas ZyCov-D vaccine approved for children above 12 years in India; All you Need Know About Vaccine in Telugu

ఈ వయసు వారికి మన దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా జైడస్ క్యాడిలా జైకోవ్-డి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది.. ఇది ఏ దేశానికి చెందినది.. తొలిసారి ఎక్కడ ఇది సక్సెస్ అయ్యిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తొలి కోవిద్ వ్యాక్సిన్..

తొలి కోవిద్ వ్యాక్సిన్..

‘ZyCov-D' ప్రపంచంలోనే DNA ఆధారిత మొట్టమొదటి కోవిద్ వ్యాక్సిన్ అని బయోటెక్నాలజీ విభాగం(DBT) ప్రకటించింది. ‘మిషన్ కోవిద్ సురక్ష' కింద DBT భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు. ఈ వ్యాక్సిన్ కు ఆమోదం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కార సామర్థ్యానికి ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు.

ఇంజెక్షన్ లేకుండా..

ఇంజెక్షన్ లేకుండా..

జైడస్ క్యాడిలా డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ అవసరం లేకుండానే ఫార్మజెట్ అనే సాధనం ద్వారా ‘ZyCov-D'ని చర్మంలోకి చొచ్చుకెళ్లేలా చేస్తారు. ఇది కరోనా నుండి రక్షణ కల్పించడంలో 66.6శాతం సమర్థతను చాటుకున్నట్లు.. మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు సంబంధించిన మధ్యంత ఫలితాలు చెబుతున్నాయి. మూడు దశల క్లినికల్ ట్రయల్స్ లో మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 28 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఇందులో సుమారు వెయ్యి మంది 12-18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. తొలి, రెండో దశ ట్రయల్స్ లో తీవ్రమైన లక్షణాలను నిరోధించగా.. మూడో దశలో మాత్రం మితమైన లక్షణాలు కూడా దురమవుతాయి.

216 కోట్ల లక్ష్యం..

216 కోట్ల లక్ష్యం..

ఆగస్టు మరియు డిసెంబర్ మధ్య దేశంలో సుమారు 216 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. జైడస్ క్యాడిలా ఐదు కోట్ల మోతాదులను అందిస్తుందని వివరించారు. అదే సమయంలో ‘ZyCov-D' యొక్క వ్యాక్సిన్లు ఏడాదికి 10 నుండి 12 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జైడస్ క్యాడిలా ఒక ప్రకటనలో పేర్కొంది.

స్వదేశీ టెక్నాలజీ..

స్వదేశీ టెక్నాలజీ..

మన దేశంలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తర్వాత స్వదేశీ టెక్నాలజీతో తయారైన రెండో వ్యాక్సిన్ ‘ZyCov-D'. ప్లాస్మిడ్ డిఎన్ఎ సాంకేతికత ఆధారంగా తయారైన ఈ టీకా.. కోవిద్ స్పైక్ ప్రోటీన్ ను ఉత్పత్తి చేసేలా శరీరానికి ఇది సంకేతాలిస్తుంది. దీని వల్ల బాడీలో యాంటీ బాడీలు తయారై.. కోవిద్ నుండి రక్షణ, వైరస్ నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుంది. DBT వివరించింది.

ఈ టీకాలు మాత్రమే..

ఈ టీకాలు మాత్రమే..

భారతదేశంలో ఇప్పటివరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి లభించిన విషయం గురించి తెలిసిందే. అయితే ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వీ టీకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

English summary

Zydus Cadila's ZyCov-D vaccine approved for children above 12 years in India; All you Need Know About Vaccine in Telugu

Here we are talking about the zydus cadlia's ZyCov-D vaccine approved for children above 12 years in India. All you need know about vaccine in Telugu
Story first published:Saturday, August 21, 2021, 17:24 [IST]
Desktop Bottom Promotion