For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలిమంటలు పాకించండి!

By B N Sharma
|
Decor Ideas For A Warm Living Room!
చలికాలం వచ్చేసింది. ఇక ఇంటిలో సైతం కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇంటికి చేసే అలంకరణలు కుటుంబ సభ్యులందరకు చలిని తగ్గించి వెచ్చగా, సౌకర్యవంతంగా వుండేలా చేయాలి. కొన్ని చిట్కాలు పరిశీలించండి.

లివింగ్ రూమ్ రగ్గు - సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరే ప్రదేశం లివింగ్ రూమ్. ఈ రూమ్ నేల కాళ్ళకు చల్లగా లేకుండా మీరు కూర్చునే సోఫా లేదా సిటింగ్ ప్రదేశంలో ఆకర్షణీయ రంగుకల ఒక మందపాటి రగ్గుతో నేలను కప్పేయండి.

సిల్క్ కుషన్లు - సోఫా, దివాన్ మొదలైన వాటిపై సిల్క్ కుషన్లు వేస్తే వెచ్చగా వుంటుంది. లివింగ్ రూమ్ లో బీన్స్ బ్యాగ్ కూడా వుంచండి.

పొడవైన కర్టెన్లు వేయండి - చలిగాలి ఇంటిలోకి రాకుండా పొడవైన కర్టెన్లను విండోలకు వేయండి. వీటి రంగులు, చిక్కటి ఎరుపు లేదా ఆరెంజ్ గా వుంటే బాగుంటుంది. ఎపుడూ వుండే రంగులకంటే కొంచెం విభిన్నంగా వుండి హాయిగొల్పుతుంది.

ఫైర్ ప్లేస్ - ఫైర్ ప్లేస్ వద్ద సీటింగ్ ఏర్పాట్లు చేయండి. లివింగ్ రూమ్ లో ఫైర్ ప్లేస్ ఏర్పాటు లేకుంటే, బాగా ఎండ తగిలే కిటికీ వద్ద రిలాక్స్ గా పుస్తకం చదువుతూ కూర్చోండి.

రూమ్ హీటర్స్ - లివింగ్ రూమ్ సైజును బట్టి ఒకటి లేదా రెండు హీటర్లు పెడితే కూడా రూమంతా వెచ్చటి వాతావరణం ఏర్పడి సౌకర్యంగా వుంటుంది.

English summary

Decor Ideas For A Warm Living Room! | చలి పులిని పారద్రోలండి!

As winter has almost come, it is time to prepare yourself to get warm inside the roof too. During winter season, home decor ideas should be smart enough to prevent the cold wind from affecting your health. So, what are the must haves for living room decor to get the cozy feeling? Here are few home decor ideas for having a cozy living room in fall. Take a look.
Story first published:Friday, November 18, 2011, 11:31 [IST]
Desktop Bottom Promotion